Healthy Drinks : రోజంతా చురుగ్గా ఉండాలంటే.. ఈ సూపర్ డ్రింక్స్ తాగాల్సిందే..
Healthy Drinks: ఆఫీసులో పని ఒత్తిడిని తగ్గించి, ఉత్సాహంగా ఉండేందుకు టీ, కాఫీ తాగడం చాలామందికి అలవాటు. కానీ, పదేపదే క్యాఫేన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. వాటికి బదులుగా మీ శరీరాన్ని ఉత్తేజపరచి, తక్షణ శక్తిని అందించే పానీయాలు తాగాలి? అవేంటంటే?
- FB
- TW
- Linkdin
Follow Us
)
టీ, కాఫీకి బదులు తాగాల్సిన ఆరోగ్యకరమైన పానీయాలు!
ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుని బయటకు వెళ్లి టీ, కాఫీ తాగడం చాలామందికి అలవాటు. కొన్ని సంస్థల్లో వీటిని ఉచితంగా అందిస్తాయి. కానీ, పదే పదే క్యాఫేన్ తీసుకోవడం ఆరోగ్యపరంగా మంచిదేనా ? అనే సందేహాలు కూడా ఉన్నాయి. వాటిని బదులు మీ శరీరాన్ని ఉత్తేజపరచి, తక్షణ శక్తిని అందించే ఈ పానీయాలు తీసుకోండి. ఈ ఆరోగ్యకరమైన పానీయాలు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు, ఆఫీసుకి తీసుకెళ్లొచ్చు కూడా! అవి ఏమిటంటే... చూద్దాం!
మజ్జిగ :
రోజంతా శక్తివంతంగా, ఉత్సాహంగా ఉండాలంటే మజ్జిగ (బటర్‌మిల్క్) ఒక అద్భుతమైన పానీయం. ఇది శరీరాన్ని తేలికగా ఉంచడమే కాకుండా, ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మజ్జిగ లో ఉండే సహజ ప్రోబయాటిక్స్, జీర్ణక్రియను మెరుగుపరచి శక్తి ని అందిస్తాయి. అంతేకాకుండా, ఇది హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడంలో, దాహాన్ని తీరుస్తూ, శరీరాన్ని లోపలినుంచి చల్లబరిచే గుణం కలిగినది. ముఖ్యంగా వేసవిలో కానీ, పని ఒత్తిడిలో కానీ… ఒక గ్లాస్ మజ్జిగ ఎంతో ఉపశమనం లభిస్తుంది.
ఉసిరికాయ జ్యూస్ :
ఉసిరికాయ – కరివేపాకు – అల్లం జ్యూస్ తయారీ: 2–3 ఉసిరికాయలను గింజలు తొలగించి, కొద్దిగా కరివేపాకు, అల్లంతో కలిపి మెత్తగా రుబ్బండి. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో పోసి ఆఫీసుకి తీసుకెళ్లి, బ్రేక్ టైంలో తాగండి. ఉసిరికాయలో విటమిన్ సి, కరివేపాకులో ఐరన్, అల్లం ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ అందిస్తుంది. ఈ మూడింటి కలయికతో తయారైన జ్యూస్ తాగడం వల్ల శరీరం ఉత్సాహంగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా మారుతుంది.
నిమ్మరసం :
ఆఫీసులో చురుగ్గా పనిచేయడానికి నిమ్మరసం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి బాగా కలిపి తాగితే రుచికరమైన నిమ్మరసం తయారవుతుంది. ఈ జ్యూస్ వల్ల శరీరానికి తక్షణ ఉత్సాహం లభిస్తుంది. ఇది నీరసం లేకుండా, శక్తివంతంగా పని చేయడానికి సహాయపడుతుంది. ప్రతి రోజూ ఓ చిన్న గాజు లేదా ప్లాస్టిక్ సీసాలో ఈ పానీయం తీసుకెళ్లి, బ్రేక్ టైంలో తాగండి. నిమ్మరసం.. జీర్ణక్రియను మెరుగుపరచడం, శరీరాన్ని డీటాక్స్ చేయడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
కరివేపాకు జ్యూస్ :
శరీరంలో తగినంత పోషకాలు లేకపోతే బలహీనంగా, అలసిపోయినట్లు అనిపిస్తుంది. కాబట్టి ఆఫీసులో మీరు ఉత్సాహంగా పనిచేయాలనుకుంటే కరివేపాకు జ్యూస్ కూడా బెస్ట్ ఆప్షన్. దీనికోసం అరకప్పు కరివేపాకును నీటిలో మరిగించాలి. నీటి రంగు బాగా మారిన తర్వాత దాన్ని వడకట్టి, దానికి రెండు చుక్కల నెయ్యి, కొద్దిగా ఉప్పు కలిపి సూప్ లాగా తాగండి.
దాల్చిన చెక్క నీరు :
ఆఫీస్ బ్రేక్ టైంలో చల్లని లేదా హాయిగా ఉండే పానీయం తాగాలనిపిస్తే దాల్చిన చెక్క నీరు బెస్ట్ ఛాయిస్. ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి తాగొచ్చు. తీపి కోసం కొద్దిగా తేనె కలిపితే చాలు. ఇది శరీరాన్ని చురుకగా మార్చడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడంలో, శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. ఆఫీసుకెళ్తూ ఒక చిన్న డబ్బాలో దాల్చిన చెక్క పొడి తీసుకెళ్లి, బ్రేక్ టైంలో ఈ పానీయం సిద్ధం చేసుకుని తాగకండి.