MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Health
  • Weight Loss Drinks: రాత్రి పడుకునేటప్పుడు ఇవి తాగితే.. పొట్ట కొవ్వు ఐస్ లా కరిగిపోతుందట!

Weight Loss Drinks: రాత్రి పడుకునేటప్పుడు ఇవి తాగితే.. పొట్ట కొవ్వు ఐస్ లా కరిగిపోతుందట!

Weight Loss: ఈ మధ్యకాలంలో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. చిన్న వయస్సులోనే పొట్ట వచ్చేస్తుంది. అలాంటివారు జిమ్‌కి వెళ్లకుండా, డైట్ చేయకుండా పొట్ట తగ్గించుకోవాలనుకుంటే రోజూ రాత్రి పడుకునే ఈ సూపర్ డ్రింక్స్ తాగండి. పొట్ట కొవ్వు ఐస్ లాగా కరిగిపోతుందట.

2 Min read
Author : Rajesh K
Published : Jul 03 2025, 08:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పసుపు పాలు:
Image Credit : Getty

పసుపు పాలు:

పసుపులో ఉన్న కర్కుమిన్ అనే శక్తివంతమైన పదార్థం శరీరంలోని వాపును తగ్గించి, జీవక్రియలను మెరుగుపరుస్తుంది. ఇది కొవ్వు కరుగించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పసుపు పాలను తాగితే మంచి నిద్ర రావడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

తయారీ విధానం: ఒక గ్లాసు పాలను వేడి చేసి, అందులో అర టీస్పూన్ పసుపు పొడి, చిటికెడు మిరియాల పొడి కలపాలి. మిరియాల పొడి,  పసుపులోని గుణాలను శరీరం మెరుగుగా గ్రహించేందుకు సహాయపడుతుంది. తీపిగా కావాలనుకుంటే చిటికెడు తేనె కూడా కలపవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
 ఇంగువ టీ
Image Credit : Getty

ఇంగువ టీ

ఇంగువలో ఉన్న ఔషధ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపుతుంది. అలాగే ఆకలిని నియంత్రిస్తుంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఇంగువ టీ తాగితే కడుపు ఉబ్బరం తగ్గి, నిద్ర బాగా పడుతుంది.

తయారీ విధానం: ఒక కప్పు నీటిలో ఇంగువ వేసి బాగా మరిగించాలి. తరువాత వడగట్టి, అందులో ఒక టీస్పూన్ తేనె కలిపి తాగాలి. అవసరమైతే ఒక చిటికెడు మిరియాల పొడిని కూడా కలిపితే ఫలితం మరింత మెరుగవుతుంది.

36
గ్రీన్ టీ :
Image Credit : Getty

గ్రీన్ టీ :

గ్రీన్ టీలో పుష్కలంగా ఉండే క్యాటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తాయి, జీవక్రియలను మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే ఎల్-థియానైన్ అనే అమైనో ఆమ్లం మానసిక ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతతను కలిగిస్తుంది. దీని వల్ల నిద్ర కూడా మెరుగవుతుంది.

అయితే గ్రీన్ టీలో కొద్దిపాటి కెఫిన్ ఉండే కారణంగా, పడుకునే ముందు తాగకపోవడం మంచిది. భోజనం తరువాత ఒక గంట తర్వాత లేదా పడుకునే 2–3 గంటల ముందు తాగితే మంచిది.  

తయారీ విధానం: ఒక కప్పు వేడి నీటిలో ఒక గ్రీన్ టీ బ్యాగ్ వేసి 2–3 నిమిషాలు నానబెట్టి తీసేయాలి. కావాలంటే తేనె లేక నిమ్మరసం చేర్చొచ్చు, కానీ పాలు కలపవద్దు.

46
మెంతుల నీరు :
Image Credit : stockPhoto

మెంతుల నీరు :

మెంతులు రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ముఖ్యంగా రాత్రి మెంతుల నీరు తాగడం వల్ల, నిద్ర సమయంలో శరీరం కొవ్వును కరిగించే ప్రక్రియను ప్రోత్సహిస్తుంది.

తయారీ విధానం: ఒక టీస్పూన్ మెంతులను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని వడగట్టి ఖాళీ కడుపుతో తాగవచ్చు. లేకపోతే, అదే నీటిని గోరువెచ్చగా చేసి వడగట్టి, రాత్రి పడుకునే ముందు కూడా తాగవచ్చు.

56
దోసకాయ, పుదీనా:
Image Credit : stockPhoto

దోసకాయ, పుదీనా:

దోసకాయలో నీటి శాతం అధికంగా ఉండటంతో శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అదే సమయంలో ఇందులో కేలరీలు తక్కువగా ఉండటంతో శరీర బరువు నియంత్రణకు కూడా ఇది సహాయపడుతుంది. పుదీనా జీర్ణక్రియను మెరుగుపరచి, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఈ రెండు పదార్థాల మిశ్రమం రాత్రిపూట తాగితే.. శరీరాన్ని ఉత్తేజపరిచి, కొవ్వు కరిగే ప్రక్రియను ప్రారంభిస్తుంది.

తయారీ విధానం: ఒక కప్పు నీటిలో కొన్ని దోసకాయ ముక్కలు, కొన్ని తాజా పుదీనా ఆకులు వేసి కనీసం 30 నిమిషాల నుంచి 1 గంట వరకు నానబెట్టాలి. పడుకునే ముందు ఈ నీటిని తాగితే శరీర శుద్ధికి సహాయపడుతుంది.

66
కొబ్బరి నీరు, దాల్చిన చెక్క :
Image Credit : stockPhoto

కొబ్బరి నీరు, దాల్చిన చెక్క :

కొబ్బరి నీరులో తక్కువ కేలరీలతో కూడిన సహజ ఎలక్ట్రోలైట్ ఉంటాయి. ఇది శరీరాన్ని తేలికగా హైడ్రేట్ చేస్తుంది. ఇది జీవక్రియను మెరుగుపరిచి, కొవ్వు కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించి, ఇన్సులిన్ స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. ఇది శరీరంలో కొవ్వు నిల్వ కాకుండా నిరోధిస్తుంది. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగై, శరీర శుద్ధి ప్రక్రియ ఉత్సాహంగా సాగుతుంది.

తయారీ విధానం: ఒక గ్లాసు కొబ్బరి నీటిలో చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి బాగా మిక్స్ చేసి, పడుకునే ముందు తాగాలి.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఆరోగ్యం
ఆహారం
మహిళలు
పురుషులు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Related Stories
Recommended image1
Weight Loss: వేగంగా బరువు తగ్గాలంటే.. ఈ టిప్స్ పాటిస్తే చాలు..
Recommended image2
Weight loss Injection: 100 కేజీల బరువునైనా ఇట్టే తగ్గించే ఇంజెక్షన్.. ధరెంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved