Best Bedtime Drinks బరువు తగ్గాలా? అయితే రాత్రి పడుకునే ముందు ఈ డ్రింక్స్ తాగండి!
బరువు తగ్గించుకోవడం ఇప్పుడు చాలామంది సమస్య. దానికోసం తీవ్ర కసరత్తులు చేయడం, డైట్ పాటించడంలాంటివి ఎన్నెన్నో చేస్తూ కష్టపడుతుంటారు. అయితే దీనికోసం ఒక సింపుట్ చిట్కా ఉంది. పాటిస్తే బరువును నియంత్రించడం తేలికే. రాత్రి పడుకునే ముందు వాము, పసుపు, అల్లం లేదా జీలకర్ర నీళ్లు తాగండి. కలబంద జ్యూస్ కూడా బాగా పనిచేస్తుంది. ఈ డ్రింక్స్ సరైన పద్ధతిలో తాగితే త్వరగా బరువు తగ్గుతారు.

బరువులెత్తే పని లేదు
ఎక్కువ బరువుతో చాలామంది బాధపడుతున్నారు. ఈ బరువును ఎలా తగ్గించుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. జిమ్ లేదా యోగా చేయడానికి చాలామందికి సమయం ఉండదు. అలాంటివాళ్ల కోసం ఈ చిట్కా బాగా పని చేస్తుంది.
ఈ రోజు కొన్ని ప్రత్యేక చిట్కాలు తెలుసుకుందాం. చాలామంది బరువు తగ్గడానికి ప్రత్యేక డ్రింక్స్ తో రోజును ప్రారంభిస్తారు. ఇప్పుడు దానికి రివర్స్ చేయండి. ఈ రోజు కొన్ని డ్రింక్స్ గురించి తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు వీటిని తాగండి. త్వరగా బరువు తగ్గుతారు.
వాము టీ
దీనిని టీ అని పిలిచినప్పటికీ, ఈ టీ చేయడానికి టీ పొడి అవసరం లేదు. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా వాము వేసి మరిగించండి. తర్వాత కప్పులో పోసి చల్లారనివ్వండి. రాత్రి పడుకునే ముందు తాగండి.
పసుపు టీ
రాత్రి పడుకునే ముందు పసుపు టీ తాగండి. వేడి నీటిలో చిటికెడు పసుపు వేసి కలపండి. రాత్రి పడుకునే ముందు తాగండి. దీని వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
అల్లం టీ
ఒక గిన్నెలో తగినంత నీరు తీసుకోండి. అందులో ఒక అల్లం ముక్క వేసి మరిగించండి. మరిగిన తర్వాత వడగట్టి కప్పులో పోయాలి. తర్వాత చల్లారనివ్వండి. రాత్రి పడుకునే ముందు తాగండి.
జీలకర్ర నీళ్లు
రాత్రి జీలకర్ర నీళ్లు తాగితే మంచిది. ఒక గిన్నెలో తగినంత నీరు తీసుకోండి. అందులో జీలకర్ర వేసి మరిగించండి. చల్లారిన తర్వాత ఈ నీటిని తాగండి.
కలబంద జ్యూస్
చాలామంది పగటిపూట తాగుతారు, మీరు రాత్రి పడుకునే ముందు కూడా కలబంద జ్యూస్ తాగవచ్చు.