- Home
- Life
- Health
- Stroke: స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించే అద్భుత జపనీస్ రహస్యం.. 15 నిమిషాలు ఇలా చేస్తే చాలు
Stroke: స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించే అద్భుత జపనీస్ రహస్యం.. 15 నిమిషాలు ఇలా చేస్తే చాలు
Stroke: ప్రముఖ పోషకాహార నిపుణురాలు శ్వేతా షా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. జపనీయులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ ఒక చిన్న పని చేస్తారు. ఇంతకీ ఆ పని ఏంటంటే.?

అసలు స్ట్రోక్ అంటే ఏంటి?
మారిన జీవనశైలి, జీవన విధానంలో మార్పుల కారణంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ సమస్యలు పెరుగుతున్నాయి. చిన్న వయసులోనే ఈ సమస్య బారినపడుతున్నారు. స్ట్రోక్ అంటే మెదడుకు వెళ్లే రక్త సరఫరా ఒక్కసారిగా ఆగిపోవడం. గుండె ఆరోగ్యం సరిగా లేకపోయినా స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం, ధూమపానం, అధిక బరువు ఇవన్నీ స్ట్రోక్‌కు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.
జపాన్ ప్రజలు పాటించే సంప్రదాయ ఆరోగ్య పద్ధతి
జపాన్ ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజూ ఒక చిన్న అలవాటు పాటిస్తారు. అదే స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ పద్ధతి వినడానికి చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ దీని వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇస్కెమిక్ స్ట్రోక్ అనే రకం ఎక్కువగా రక్తం గడ్డకట్టడం వల్ల వస్తుంది. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికే ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.
స్ట్రోక్ నివారణకు జపానీస్ సీక్రెట్ ఏంటి?
ప్రముఖ పోషకాహార నిపుణురాలు శ్వేతా షా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ విషయాన్ని వెల్లడించారు. జపాన్ ప్రజలు ప్రతిరోజూ తమ పాదాలను వేడి నీటిలో ముంచుతారు. రోజుకు 15 నుంచి 20 నిమిషాల పాటు ఇలా చేయడం వల్ల శరీరంలో అద్భుత మార్పులు కనిపిస్తాయని ఆమె తెలిపారు. ప్రత్యేకంగా 50 ఏళ్లు దాటినవారికి ఇది చాలా ఉపయోగకరమైన అలవాటుగా చెబుతున్నారు.
వేడి నీటిలో పాదాలు ముంచితే కలిగే లాభాలు
వేడి నీరు రక్తనాళాలను విస్తరింపజేస్తుంది. దీని వల్ల రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది. గుండెపై ఉండే ఒత్తిడి తగ్గుతుంది. శారీరక అలసటతో పాటు మానసిక టెన్షన్ కూడా తగ్గుతుంది. వేడి నీటిలో ఒక టీస్పూన్ ఎప్సమ్ ఉప్పు కలిపితే కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. రాత్రి నిద్ర బాగా పడుతుంది. నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి చిట్కాగా నిపుణులు చెబుతున్నారు.
స్ట్రోక్ ముందస్తు లక్షణాలు ఏంటి.?
స్ట్రోక్ అకస్మాత్తుగా రావచ్చు. కానీ శరీరం ముందే కొన్ని సంకేతాలు ఇస్తుంది. అవి గుర్తిస్తే ప్రాణాపాయం తగ్గుతుంది.
స్ట్రోక్ హెచ్చరిక లక్షణాలు
* ఒక్కసారిగా సమతుల్యత కోల్పోవడం
* చూపు మందగించడం
* నవ్వేటప్పుడు ముఖం ఒక వైపు వాలిపోవడం
* రెండు చేతులు పైకెత్తినప్పుడు ఒక చేయి కిందకు జారిపోవడం
* మాట తడబడటం
ఎవరికి ప్రమాదం ఎక్కువ?
* 65 ఏళ్లు దాటిన వృద్ధులు
* ఎక్కువగా ధూమపానం చేసే వారు
* తరచూ మైగ్రేన్, తీవ్రమైన తలనొప్పి ఉన్నవారు.
* రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నవారు

