MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Hair Care: 5 నిమిషాల్లో తెల్ల జుట్టును నల్లగా మార్చే అద్భుతమైన చిట్కాలు..

Hair Care: 5 నిమిషాల్లో తెల్ల జుట్టును నల్లగా మార్చే అద్భుతమైన చిట్కాలు..

Hair Care: బ్యూటీ పార్లర్‌కి వెళ్లి జుట్టుకి రంగు వేసుకోవడానికి సమయం లేదా?  నెరిసిన జుట్టుతో బయటకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారా? కేవలం 5 నిమిషాల్లో తెల్లని జుట్టు నల్లగా మార్చుకోండి. అత్యవసరంగా బయటకు వెళ్ళేటప్పుడు ఈ చిట్కాలను ఉపయోగించండి. 

2 Min read
Author : Rajesh K
Published : Jul 02 2025, 08:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
తెల్లని జుట్టును నల్లగా

తెల్లని జుట్టును నల్లగా

ఈ రోజుల్లో చాలామందికి జట్టు తెల్లగా మారడం చూస్తున్నాం. వయసు పెరగడం వల్ల మాత్రమే కాకుండా, మానసిక ఒత్తిడి, జన్యుపరమైన కారణాలు, పోషకాహార లోపం వంటి అనేక కారణాల వల్ల చిన్న వయస్సులోనే జట్టు తెల్లగా మారుతుంది. తాత్కాలికంగా నెరిసిన జుట్టును దాచడానికి కొన్ని తక్షణ పరిష్కారాలు ఉన్నాయి. ఉదాహరణకు: హెయిర్ కలర్ స్ప్రేలు, మస్కరా లేదా ఐబ్రో పెన్సిల్, టచ్-అప్ స్టిక్స్, కాజల్ లేదా కృష్ణ తిలకం వంటివి. ఇవి తాత్కాలికమే అయినా, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడతాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
హెయిర్ మస్కారా – తక్షణ పరిష్కారం

హెయిర్ మస్కారా – తక్షణ పరిష్కారం

ఇది తెల్ల జుట్టును తాత్కాలికంగా దాచడానికి అత్యంత సులభమైన, వేగవంతమైన పరిష్కారాల్లో ఒకటి. మస్కారా లాగా ఉండే ఈ స్టిక్‌ను నేరుగా తెల్ల జుట్టుపై అప్లై చేస్తే వెంటనే ఫలితం కనిపిస్తుంది. అయితే.. తలస్నానం చేస్తే రంగు పోవచ్చు, లేదా వర్షం లేదా చెమట వల్ల రంగు పోతుంది.  

37
రూట్ కన్సీలర్ స్ప్రే :

రూట్ కన్సీలర్ స్ప్రే :

తెల్లని జుట్టును నల్లగా మార్చేందుకు రూట్ కన్సీలర్ స్ప్రే ఒక ఉత్తమ పరిష్కారం. జుట్టు కుదుళ్లలో  కనిపించే తెల్ల జుట్టుపై  సుమారు 6–8 అంగుళాల దూరం నుండి స్ప్రే చేయాలి. దీంతో తెల్ల జుట్టు చిటికెలో నల్లగా మారుతుంది. అయితే.. తక్కువ పరిమాణంలో స్ప్రే చేయడం ఉత్తమం. అధికంగా స్ప్రే చేస్తే జుట్టు అట్ట కట్టినట్లు కనిపించవచ్చు. ఇది కూడా తాత్కాలిక పరిష్కారమే, ఒక్కసారి తలస్నానంతో పోతుంది. అత్యవసర సమయాల్లో ఈ స్ప్రే చాలా సులభంగా ఉపయోగించవచ్చు. 

47
కలర్ డ్రై షాంపూ

కలర్ డ్రై షాంపూ

ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కలర్ డ్రై షాంపూలు తెల్ల జుట్టును తాత్కాలికంగా దాచడంలోనూ, జుట్టును ఒత్తుగా, నిగనిగలాడేలా మార్చేందుకు సహాయపడతాయి. తెల్ల జుట్టు ఉన్న ప్రాంతాల్లో స్ప్రే చేసి, వెంట్రుక కుదుళ్లలో మసాజ్ చేయండి. జుట్టుకు కొత్త రూపాన్ని ఇస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

57
 హెయిర్ కలరింగ్ పౌడర్ :

హెయిర్ కలరింగ్ పౌడర్ :

తెల్ల జుట్టును నల్లగా మర్చేందుకు హెయిర్ కలరింగ్ పౌడర్ ఒక చక్కటి ఎంపిక. తక్కువ మొత్తంలో తెల్ల జుట్టును తాత్కాలికంగా కవర్ చేయడానికి దీని వాడుతారు.  పౌడర్ రూపంలో ఉండే ఈ ప్రాడక్ట్ ను బ్రష్‌ ద్వారా తెల్ల జుట్టుపై అప్లై చేయాలి. ఇది న్యాచురల్ ఫినిష్‌ను ఇస్తుంది. అయితే.. దీని అప్లై చేసేటప్పుడు లేదా తరువాత బట్టలపై పడే ప్రమాదం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. వర్షం లేదా చెమటవలన రంగు కరిగిపోయే అవకాశం ఉంది.  తలస్నానం చేసిన వెంటనే పొతుంది. అత్యవసర సమయంలో వేగంగా, సహజంగా తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు ఇది ఒక చక్కని తాత్కాలిక పరిష్కారం.

67
హెయిర్‌లైన్ పెన్సిల్ :

హెయిర్‌లైన్ పెన్సిల్ :

నుదుటి అంచున లేదా చెవుల పైన ఉన్న తెల్ల జుట్టును దాచడానికి ఈ పెన్సిళ్ళు ఉపయోగపడతాయి. పెన్సిల్‌ని తెల్ల జుట్టు ఉన్న చోట రాస్తే సరిపోతుంది. చిన్న చిన్న వైట్ ప్యాచ్ లను కవర్ చేయడానికి బెటర్ ఛాయిస్.  అధికంగా ఉపయోగిస్తే కృత్రిమంగా కనిపించే ప్రమాదం ఉంటుంది. తాత్కాలిక అవసరాలకు ఇది సులభమైన పరిష్కారం.

77
ఈ విషయాలు గమనించండి

ఈ విషయాలు గమనించండి

  • మీ జుట్టు రంగుకు దగ్గరగా ఉండే రంగు ఎంచుకోవడం చాలా ముఖ్యం. వేరే రంగు కృత్రిమంగా కనిపించవచ్చు. మార్కెట్లో అనేక షేడ్స్ అందుబాటులో ఉన్నాయి. మీ చర్మం, కనుబొమ్మలకు సెట్ అయ్యే రంగుకు ఎంపిక చేసుకోండి.  
  • ఈ ఉత్పత్తులను ఎప్పుడూ పొడి జుట్టుపై మాత్రమే ఉపయోగించాలి. తడి జుట్టుపై ఉపయోగిస్తే మరకలు పడే ప్రమాదం ఉంటుంది.
  • జుట్టు అలంకరణ పూర్తయిన తర్వాత వీటిని ఉపయోగించడం మంచిది. లేకపోతే, హెయిర్ బ్రష్ లేదా దువ్వెన ఉపయోగించినప్పుడు రంగు పోవచ్చు. 
  • ఈ పద్ధతులన్నీ తాత్కాలికమైనవని గుర్తుంచుకోండి. ఒక్కసారి షాంపూతో కడిగితే పోతాయి.  
  •  శాశ్వత పరిష్కారం కోసం హెయిర్ డైలు లేదా సహజమైన హెన్నా వంటివి ఉపయోగించవచ్చు. ఈ సూచనలతో తెల్ల జుట్టును చిటికెలో కవర్ చేసి, మీ ఆత్మవిశ్వాసాన్ని నిలుపుకోండి. 

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
ఫ్యాషన్
ఏషియానెట్ న్యూస్
మహిళలు
పురుషులు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సిగరెట్ లేకుండా మల విసర్జన కావడం లేదా? కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
Recommended image2
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image3
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Related Stories
Recommended image1
Hair Care: కరివేపాకుతో ఇలా చేస్తే.. మీ జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది..!
Recommended image2
Hair Care: నల్లని, ఒత్తైన జుట్టు కోసం.. బియ్యం నీటిని వీటితో కలిపి రాస్తే చాలు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved