Health Tips: రాత్రిపూట ఈ లక్షణాలుంటే.. హార్ట్, లివర్, కిడ్నీ డేంజర్ లో ఉన్నట్లే!
Health Tips: మనం ఆరోగ్యంగా ఉన్నామో? లేదో? అనేది కొన్ని లక్షణాలను బట్టి చెప్పవచ్చు. గుండె, కిడ్నీ, లివర్ ఈ మూడింటికీ సంబంధించిన ఆరోగ్య సమస్యలుంటే.. రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఏయే లక్షణాలు కనిపిస్తే ఏ ఆరోగ్య సమస్య ఉందో తెలుసుకోండి.

నిర్లక్ష్యం చేయకండి
రాత్రిపూట మూత్ర విసర్జన కోసం పదే పదే లేస్తున్నారా? పడుకున్నతరువాత ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? రాత్రి వేళ చెమటలు పడుతున్నాయా? సరిగ్గా నిద్ర పట్టకపోవడం వల్ల ఇలా జరుగుతుందని అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే.. ఈ లక్షణాలు.. గుండె, కాలేయం, మూత్రపిండాల సమస్యకు సంకేతాలు కావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి.
రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తే
రాత్రిపూట మాత్రమే కనిపించే ఈ సంకేతాలను ప్రజలు చాలా వరకు నిర్లక్ష్యం చేస్తారని వైద్యులు చెబుతున్నారు. కానీ ఇవి గుండెపోటు ప్రారంభ సంకేతాలు కావచ్చు. నిజానికి, రక్త నాళాలలో అడ్డంకి, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD), కాలేయం దెబ్బతినడం వల్ల కూడా సంభవించవచ్చు.
రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జన
రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జన కోసం నిద్రలేవడాన్ని నోక్టురియా అంటారు. ఇది సాధారణ సమస్యే. కానీ, గుండెపోటు లేదా మూత్రపిండాల వ్యాధికి ప్రారంభ సంకేతం కూడా .
వైద్యులు ఏమన్నారంటే..
అపోలో ఆసుపత్రి సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ బి. కోల్హరి అభిప్రాయం ప్రకారం.. రాత్రి పడుకున్నప్పుడు ద్రవం రక్తంలో కలిసి మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ అవుతుంది. తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది. రోగికి మూత్రపిండ సంబంధిత సమస్యలు ఉంటే మూత్రపిండాలు వాటి ఫిల్టరింగ్ సామర్థ్యాన్ని కోల్పోతాయి. దీనివల్ల పగలు , రాత్రి తేడా లేకుండా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రి పూట ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.
మూత్రపిండాల సమస్య
రాత్రిపూట ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయడం అనేది గుండె వైఫల్యం లేదా మూత్రపిండాల సమస్యలకు సంకేతం కావచ్చు. గుండె సరిగా పనిచేయకపోతే, శరీరంలో ద్రవం పేరుకుపోతుంది. కిడ్నీ దానిని తొలగించడానికి ఎక్కువ పని చేస్తాయి. దీనివల్ల రాత్రి ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.
గుండె సమస్య
రాత్రిపూట ఊపిరి ఆడకపోవడం అనేది ఊపిరితిత్తులలో ద్రవం చేరడం వల్ల, గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయలేకపోవడం వల్ల రావచ్చు. దీనినే కార్డియోజెనిక్ పల్మనరీ ఎడెమా అంటారు.
చెమట పడుతుంటే..
రాత్రిపూట మీకు ఎక్కువగా చెమట పడుతుంటే.. ఇది రక్త నాళాలలో అడ్డంకికి లక్షణం. ఈ సమయంలో మీకు ఛాతి నొప్పి, అధిక ఒత్తిడి, బిగుతు అనిపిస్తే, గుండె సమస్య లేదా అధిక రక్తపోటు రావచ్చు. ఇలాంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం వహించకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.