Lung Health: మీ ఊపిరితిత్తుల్లో సమస్య ఉందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో పరిష్కారం..
Healthy Lungs : వాతావరణ కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆస్తమా, లంగ్ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే. ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే చాలు. అవి లంగ్స్ ఆరోగ్యానికి తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

తులసి
వాయు కాలుష్యం, దుమ్ము, వాహన పొగ, ఫ్యాక్టరీ పొగ వంటి వివిధ కారణాల వల్ల ఊపిరితిత్తుల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఊపిరితిత్తులలో మంట, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు పెరుగుతున్నాయి. ఈ సమస్యలకు తులసి ఉత్తమ పరిష్కారం. ప్రతిరోజూ 10 తులసి ఆకులను నమిలి తింటే.. శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. తులసి ఆకులను రోజూ తింటే.. ఇమ్యూనిటీ పెరుగుతుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రాకుండా తులసి రక్షిస్తుంది.
శొంఠి పొడి
శొంఠి పొడి అంటే.. ఎండు అల్లం. శొంఠి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కు చెక్ పెడుతుంది. శొంఠి పొడి శ్వాసకోశ వ్యవస్థను శుభ్రపరుస్తుంది. అలాగే.. గొంతు వాపు, గొంతు నొప్పు, దగ్గు నుంచి ఉపశమనం కల్పిస్తుంది. ఇలాంటి అద్భుతమైన ఔషద గుణాలు గల శొంఠి పొడిని మీ ఆహారంలో చేర్చుకుంటే.. ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.
పిప్పాలి
ఊపిరితిత్తుల సమస్యకు పెట్టే మరో ఆయుర్వేద ఔషధం పిప్పాలి. పిప్పలి పొడిని పాలతో పాటు తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ పొడిని పాలలో కలిపి తీసుకుంటే.. ఆరోగ్య సమస్యలు దరిచేరవు. పిప్పలిని తేనెతో తీసుకుంటే.. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు దూరమవుతాయట.
అతి మధురం
అతిమధురంలో ఎన్నో ఔషద గుణాలు ఉంటాయి. ఇది ఊపిరితిత్తులను శుభ్రపరచి, శరీర శక్తిని పెంచడంలో సహాయపడే మూలిక. జలుబు, దగ్గు, గొంతు నొప్పు వంటి శ్వాసకోశ సమస్యలను దూరం చేయడానికి అతి మధురం పొడిని పాలల్లో కలిపి తీసుకోవాలి. అతిమధురం ఊపిరితిత్తులలోని వ్యర్థాలను బయటకు పంపి ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. ఊపిరితిత్తులు, గొంతులో పేరుకుపోయిన మందపాటి శ్లేష్మాన్ని కరిగించి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
కర్పూరవల్లి
కర్పూరవల్లి ( Karpooravalli ) అనేది ఓ ఆయుర్వేద మూలిక. దీనిని "ఇండియన్ బొరేజ్" లేదా "మెక్సికన్ పుదీనా" అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలకు చక్కటి పరిష్కారం. ఇది ఊపిరితిత్తుల మంటను తగ్గించడమే కాకుండా, శ్లేష్మం పేరుకుపోకుండా కూడా నిరోధిస్తుంది.