తరచూ గొడవలు కారణంగా శారీరిక సుఖానికి దూరమయ్యరా.? తిరిగి ఎంజాయ్ చేయాలంటే..
Quarrelling: భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోతే, వారి మధ్య సరైన అనురాగం, అనుబంధం ఉండవు. ఒకరిపై ఒకరు కోపంతో ఉన్నప్పుడు లేదా తిట్టుకుంటూ ఉన్నప్పుడు లైంగిక వాంఛలు కలగడం అసాధ్యం.

కేవలం శారీరకమైనది మాత్రమే కాదు
భార్యాభర్తల మధ్య అనుబంధం కేవలం శారీరకమైనది మాత్రమే కాదు. అది మానసికమైన బంధం కూడా. దంపతుల మధ్య తలెత్తే గొడవలు, అవి వారి లైంగిక జీవితంపై చూపించే ప్రభావం గురించి డాక్టర్ సమరం ఇలా అన్నారు.
అనుబంధం, లైంగిక జీవితం:
భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోతే, వారి మధ్య సరైన అనురాగం, అనుబంధం ఉండవు. ఒకరిపై ఒకరు కోపంతో ఉన్నప్పుడు లేదా తిట్టుకుంటూ ఉన్నప్పుడు లైంగిక వాంఛలు కలగడం అసాధ్యం. సుఖం అనేది కేవలం శారీరక ప్రక్రియ మాత్రమే కాదు, అది మనసులకు సంబంధించినది. మనసులో ద్వేషం ఉన్నప్పుడు శరీరంలో సంతోషాన్ని కలిగించే 'డోపమైన్' వంటి హార్మోన్లు విడుదల కావు. కాబట్టి, దాంపత్యం మధురంగా ఉండాలంటే దంపతులిద్దరూ పరస్పరం గౌరవించుకోవాలి.
గొడవలకు ప్రధాన కారణాలు:
చాలా మంది దంపతుల మధ్య గొడవలకు ప్రధాన కారణం ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం. ముఖ్యంగా పురుషులు అబద్ధాలు చెప్పడం వల్ల భార్యలకు వారి మాటలపై నమ్మకం పోతుంది. అలాగే, దంపతుల మధ్య 'పూర్ కమ్యూనికేషన్' ఉండటం వల్ల సమస్యలు పెరుగుతాయి. మనసులో ఏముందో స్పష్టంగా చెప్పుకోకపోవడం వల్ల అపార్థాలు తలెత్తుతాయి.
ఎమోషనల్ కనెక్ట్:
దంపతులు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యం. భార్యకు అనారోగ్యం చేసినప్పుడు లేదా తలనొప్పిగా ఉన్నప్పుడు భర్త ఆమెను పట్టించుకోకపోతే, అది ఆమె మనసును గాయపరుస్తుంది. కనీసం చేయి పెట్టి జ్వరం ఉందో లేదో చూడటం లేదా 'డాక్టర్ దగ్గరికి వెళ్దామా' అని అడగడం వంటి చిన్న చిన్న పలకరింపులు కూడా వారి మధ్య ప్రేమను పెంచుతాయి. ఒకరిపై ఒకరు కన్సర్న్ చూపకపోతే ఆ దాంపత్యం వ్యర్థమవుతుందని డాక్టర్ సమరం హెచ్చరించారు.
ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ
భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, చిన్న చిన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకున్నప్పుడే వారి జీవితం హాయిగా, ఉత్సాహంగా ఉంటుందన్నారు.

