MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు.. తింటే ఆ సమస్యలన్నీ దూరం..

వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు.. తింటే ఆ సమస్యలన్నీ దూరం..

Immunity: వర్షాకాలంలో తేమ వాతావరణం, వర్షపు నీరు కారణంగా ప్రజలు తరచూ ఆరోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ఈ వ్యాధులకు చెక్ పెట్టాలంటే.. మనలో రోగనిరోధక శక్తిని బలపరిచే ఆహారాన్ని తీసుకోవాలి. మనలో రోగ నిరోధక శక్తి పెంచే సూపర్ ఫుడ్  గురించి తెలుసుకుందాం.

2 Min read
Author : Rajesh K
Published : Jun 18 2025, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు
Image Credit : Pixabay

రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు

వర్షాకాలంలో  ప్రజలు తరచూగా ఆరోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ముఖ్యంగా జలుబు, జ్వరం, ఇతర అంటు వ్యాధులు వస్తాయి. ఆ సమస్యలకు చెక్ పెట్టాలంటే.. మెరుగైన రోగనిరోధక శక్తి అవసరం. వర్షాకాలంలో రోగనిరోధకశక్తి పెంపొందించుకోవాలంటే కొన్ని రకాల పండ్లు తినాలని నిపుణులు అంటున్నారు. మరి ఏయే పండ్లు తినాలని సూచిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
జామ
Image Credit : social media

జామ

జామ పేదవాడి ఆపిల్. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, లైకోపీన్ అధికంగా ఉంటాయి. షుగర్ పేషంట్స్ కు ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే..ఇన్ఫెక్షన్ రాకుండా సహాయపడుతుంది. 

36
బేరి పండు
Image Credit : social media

బేరి పండు

బేరి పండులో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. జలుబు, ఫ్లూ లక్షణాలతో పోరాడటంలో సహాయపడుతుంది. బేరి పండ్లలో ఉండే ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో,  శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఈ పండ్లలో ఉండే  పొటాషియం రక్తపోటును నియంత్రించి,  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

46
ఆరెంజ్
Image Credit : Getty

ఆరెంజ్

ఆరెంజ్ లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయి, తద్వారా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం అవుతుంది. ఆరెంజ్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  కాబట్టి మీ రెగ్యులర్ డైట్‌లో ఆరెంజ్ ను చేర్చుకోండి.

56
బొప్పాయి
Image Credit : Pixabay

బొప్పాయి

విటమిన్ సి అధికంగా ఉండే బొప్పాయి తెల్ల రక్త కణాల పనితీరును మెరుగుపరుచుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇందులో పాపైన్ వంటి జీర్ణ ఎంజైమ్‌లు కూడా ఉన్నాయి, ఇవి వాపును తగ్గిస్తాయి, జీర్ణక్రియకు సహాయపడతాయి.

66
దానిమ్మ పండు
Image Credit : Pixabay

దానిమ్మ పండు

యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలతో నిండిన దానిమ్మ పండ్లు బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సహాయపడతాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. దానిమ్మ పండ్లలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఆరోగ్యం
ఆహారం
మహిళలు
పురుషులు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
Food: వీటిని నానపెట్టిన తర్వాతే వండాలి, ఎందుకో తెలుసా?
Recommended image2
Vitamin C rich fruits: విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు ఇవే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved