100 గ్రాముల జామలో 228 మి.గ్రా. విటమిన్ సి ఉంటుంది. ఇందులో ఫైబర్, ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.
విటమిన్ సికి బెస్ట్ సోర్స్ ఆరెంజ్. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. చర్మ ఆరోగ్యానికి మంచిది.
విటమిన్ సి పుష్కలంగా లభించే అద్భుతమైన ఫలం ఉసిరికాయ. ఉసిరికాయలు రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, ఇతర ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి ఉపయోగపడుతుంది
100 గ్రా. స్ట్రాబెర్రీలో 59 మి.గ్రా. విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలు, చిగుళ్ళు, కణజాలాలను నిర్వహించడంలో సహాయపడుతుంది.
విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మకాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే.. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉండే నిమ్మ శరీరంలోని కణాలను నష్ట పరిచే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది.