Drinking Water Before Brushing: ఉదయం బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
Drinking Water Before Brushing: ఉదయం నిద్ర లేచిన తర్వాత బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా కడుపులోకి చేరి జీర్ణ సమస్యలు, ఇన్ఫెక్షన్లు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణులు చెబుతున్న ఆ పూర్తి వివరాలు మీకోసం.

పరగడుపున నీళ్లు తాగే అలవాటు ఉందా? ఈ తప్పు మాత్రం అస్సలు చేయకండి
రోజూ ఉదయం నిద్రలేవగానే పరగడుపున మంచి నీళ్లు తాగడం బాడీకి చాలా మంచిదని మన ఇంట్లో పెద్దవాళ్లతో పాటు కొంతమంది హెల్త్ ఎక్స్‌పర్ట్స్ కూడా చెప్తుంటారు. డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి, బాడీని రీఫ్రెష్ చేయడానికి, డైజెషన్ సిస్టమ్‌ను యాక్టివ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ హ్యాబిట్.
కానీ ఇక్కడే ఒక చిన్న పాయింట్ మిస్ అవుతున్నామని తాజాగా పలు పరిశోధనలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించాయి. పొద్దున్నే లేవగానే కాస్త కూడా లేట్ చేయకుండా, నోరు కూడా కడుక్కోకుండా డైరెక్ట్‌గా నీళ్లు తాగేస్తున్నారా? ఐతే మీరు కచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిందే. నోటి పరిశుభ్రత పాటించకుండా నీళ్లు తాగితే ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాత్రంతా నోటిలో ఏం జరుగుతుందో తెలుసా?
మనం రాత్రి హాయిగా నిద్రపోతున్నప్పుడు మన నోటిలో లాలాజలం ఊరడం చాలా వరకు తగ్గిపోతుంది. ఈ టైమ్‌లోనే అసలు కథ మొదలవుతుంది. నోటిలో లాలాజలం తగ్గడం వల్ల దంతాల మధ్య, చిగుళ్ల పైన, నాలుక పైన హానికరమైన బ్యాక్టీరియా, మైక్రో ఆర్గనిజమ్స్ చాలా స్పీడ్‌గా పెరిగిపోతాయి.
ఉదయాన్నే లేవగానే బ్రష్ చేయకుండా లేదా నోరు శుభ్రం చేసుకోకుండా నీళ్లు తాగినప్పుడు, ఆ రాత్రంతా పేరుకుపోయిన బ్యాక్టీరియా, టాక్సిన్స్ అన్నీ ఆ నీటితో పాటు నేరుగా మన పొట్టలోకి వెళ్ళిపోతాయి.
కడుపులో ఇన్ఫెక్షన్లు, జీర్ణ సమస్యల ముప్పు
ఈ బ్యాక్టీరియా నేరుగా జీర్ణాశయంలోకి వెళ్లడం వల్ల మన జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. దీనివల్ల అజీర్తి, కడుపులో మంట, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వెంటాడుతాయి. అంతేకాకుండా, బాడీ ఇమ్యూనిటీ పవర్ తగ్గడంతో పాటు మెటబాలిజం రేట్ కూడా పడిపోతుంది.
రోజూ బ్రష్ చేయకుండా నీళ్లు తాగే అలవాటు ఉంటే, దీర్ఘకాలంలో కడుపులో బ్యాక్టీరియా కౌంట్ పెరిగి ఇన్ఫెక్షన్లు లేదా అల్సర్లు వచ్చే రిస్క్ చాలా ఎక్కువ. పైగా ఉదయం పూట లాలాజలంలో ఉండే సహజ ఖనిజాలు దంతాలకు రక్షణగా నిలుస్తాయి, కానీ ఈ చెత్త బ్యాక్టీరియాని క్లీన్ చేయకుండా నీళ్లు తాగితే పంటి ఎనామిల్ బలహీనపడి దంతక్షయం ఏర్పడుతుంది.
ఎక్స్‌పర్ట్స్ చెప్తున్న సరైన పద్ధతి ఇదే
ఉదయాన్నే నీళ్లు తాగడం గుడ్ హ్యాబిటే, కాకపోతే కరెక్ట్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. నిద్రలేచిన వెంటనే ఫస్ట్ నోటిని బాగా పుక్కిలించి, తేలికగా బ్రష్ చేసుకోవడం లేదా కనీసం మంచి నీళ్లతో నోటిని క్లీన్‌గా కడుక్కోవడం చేయాలి. ఆ తర్వాతే పరగడుపున ఒకటో రెండో గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగాలి.
ఇలా బ్రష్ చేశాక నీళ్లు తాగడం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్, మలినాలు బయటకు పోతాయి. మలబద్ధకం పోయి చర్మం నాచురల్‌గా గ్లో అవుతుంది. ఈ చిన్న కేర్ తీసుకుంటే చాలు, ఎలాంటి రోగాలు దరిచేరకుండా మిమ్మల్ని మీరు సేఫ్‌గా ఉంచుకోవచ్చు.





