MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Health
  • Garikapati Controversy: గరికపాటి గుడ్డు వివాదం.. అసలు పిల్లలకు ఎగ్ ఎందుకు అవసరం?

Garikapati Controversy: గరికపాటి గుడ్డు వివాదం.. అసలు పిల్లలకు ఎగ్ ఎందుకు అవసరం?

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు బడి పిల్లలు, గుడ్డుపై చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతున్నాయో మనం చూస్తునే ఉన్నాం. ఇంతకీ పిల్లలకు నిజంగా గుడ్డు అవసరమేనా? వారి ఎదుగుదలకు గుడ్డు ఏ విధంగా సహాయపడుతుందో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Mar 25 2026, 11:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పిల్లల ఎదుగుదలకు గుడ్డు అవసరమా?
Image Credit : Asianet News

పిల్లల ఎదుగుదలకు గుడ్డు అవసరమా?

తాజాగా ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు స్కూల్ పిల్లలకు గుడ్డు ఎందుకు ఇవ్వాలి వంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కొందరు పాజిటివ్‍గా, మరికొందరు నెగిటివ్‍గా స్పందిస్తున్నారు. అయితే పిల్లలకు నిజంగా గుడ్డు అవసరం లేదా? అసలు గుడ్డు పిల్లల ఎదుగుదలకు ఎలా ఉపయోగపడుతుంది? ఒకవేళ వారికి రోజుకో గుడ్డు అందించకపోతే ఏమవుతుంది? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
6 గ్రాముల ప్రోటీన్
Image Credit : Getty

6 గ్రాముల ప్రోటీన్

ఆరోగ్య నిపుణుల ప్రకారం పిల్లల ఆరోగ్యానికి గుడ్డు చాలా ముఖ్యం. గుడ్డు ఎందుకు అంత పవర్‌ఫుల్ ఫుడ్ అనేది చాలామందికి పూర్తిగా తెలియదు. పిల్లల ఎదుగుదల, మెదడు అభివృద్ధి, శరీర శక్తి వంటి వాటికి గుడ్డు ఒక పూర్తి ఆహారంగా పనిచేస్తుంది. గుడ్డు ప్రోటీన్‌కి అద్భుతమైన సోర్స్. పిల్లల శరీరం వేగంగా పెరుగుతున్న సమయంలో ప్రోటీన్ చాలా అవసరం. గుడ్డులో ఉండే హై-క్వాలిటీ ప్రోటీన్ కండరాల నిర్మాణానికి, టిష్యూ రిపేర్‌కు సహాయపడుతుంది. ఒక గుడ్డు దాదాపు 6 గ్రాముల ప్రోటీన్‍ని ఇస్తుంది. ఇది చిన్నపిల్లల డైలీ అవసరాల్లో ముఖ్యమైన భాగాన్ని పూర్తిచేస్తుంది.

36
మెదడు అభివృద్ధికి..
Image Credit : Getty

మెదడు అభివృద్ధికి..

అంతేకాదు గుడ్డులో చోలిన్ అనే న్యూట్రియెంట్ ఉంటుంది. ఇది మెదడు అభివృద్ధికి చాలా ముఖ్యం. పిల్లలు చదువులో బాగా రాణించాలంటే, వారి మెమరీ పవర్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే చోలిన్ చాలా అవసరం. అందుకే గుడ్డు తినే పిల్లల్లో ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం మెరుగ్గా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

46
ముఖ్యమైన విటమిన్లు
Image Credit : Getty

ముఖ్యమైన విటమిన్లు

గుడ్డులో విటమిన్ A, D, E, B12 లాంటి ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. విటమిన్ D ఎముకల బలానికి అవసరం. పిల్లలలో బలహీనమైన ఎముకలు, రికెట్స్ లాంటి సమస్యలు రాకుండా ఉండటానికి గుడ్డు సహాయపడుతుంది. అలాగే విటమిన్ A కళ్ల ఆరోగ్యానికి మంచిది. స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉన్న ఈ కాలంలో ఇది చాలా ఉపయోగకరం.

56
రక్తహీనత దూరం
Image Credit : Getty

రక్తహీనత దూరం

గుడ్డులో ఉండే ఐరన్ కూడా చాలా ముఖ్యమైనది. పిల్లల్లో అనీమియా (రక్తహీనత) చాలా కామన్ సమస్య. గుడ్డు తినడం వల్ల హీమోగ్లోబిన్ స్థాయి మెరుగుపడుతుంది. దీంతో పిల్లలు యాక్టివ్‌గా ఉంటారు. చిన్నపిల్లలకు రోజుకు ఒక గుడ్డు సేఫ్‌గా ఇవ్వచ్చు. ఇది వాళ్లకు అవసరమైన ఎనర్జీని ఇస్తుంది.

66
పూర్తి పోషణ కోసం..
Image Credit : Getty

పూర్తి పోషణ కోసం..

గుడ్డు అందరికీ అందుబాటులో ఉండే ఆహారం. ఎక్కువ ఖర్చు చేయకుండా మంచి పోషకాలు ఇవ్వగలిగే ఫుడ్. పాలు, పండ్లు, కూరగాయలతో పాటు గుడ్డును డైలీ డైట్‌లో చేర్చితే పిల్లలకు పూర్తి పోషణ లభిస్తుంది. పిల్లలు గుడ్డు తినడానికి ఆసక్తి చూపకపోతే ఆమ్లెట్, బాయిల్డ్ ఎగ్, ఎగ్ భుర్జీ, ఎగ్ దోస, ఎగ్ రైస్ లాంటివి చేసి ఇస్తే వాళ్లు ఇష్టంగా తింటారు.

అయితే గుడ్డును ఎప్పుడూ బాగా ఉడికించి ఇవ్వాలి. పచ్చి గుడ్డు లేదా సగం ఉడికిన గుడ్లు పిల్లలకు ఇవ్వడం మంచిది కాదు. అలాగే, ఎవరికైనా ఎగ్ అలెర్జీ ఉంటే డాక్టర్ సలహా తీసుకోవాలి. మొత్తంగా చెప్పాలంటే గుడ్డు పిల్లల ఆరోగ్యానికి ఒక సూపర్ ఫుడ్. ఇది చిన్నదైనా, అందించే లాభాలు చాలా పెద్దవి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Related Stories
Recommended image1
Healthy Night Routine: రాత్రిపూట ఇవి చేస్తే మీ జీవితం మారిపోవడం పక్కా!
Recommended image2
Child Psychology: పిల్లల్ని ఎక్కువగా పొగుడుతున్నారా? వాళ్లు ఎలా మారిపోతారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved