MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Life
  • Health
  • Milk Benefits: వేడి పాలా? చల్లటి పాలా? ఆరోగ్యానికి ఏది మంచిది?

Milk Benefits: వేడి పాలా? చల్లటి పాలా? ఆరోగ్యానికి ఏది మంచిది?

Milk Benefits: చాలా మందికి ఇళ్లల్లో పెద్దవాళ్లైనా, చిన్నవాళ్లైనా పాలు తాగే అలవాటు ఉంటుంది. రాత్రి తాగితే మంచి నిద్ర పడుతుందని ఫీలవుతాం. అయితే పాలను వేడిగా తాగితే మంచిదా? చల్లగా తాగితే మంచిదా? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే..

2 Min read
Author : Nandini Arava
Published : May 29 2026, 05:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆరోగ్యానికి ఏది మంచిది?
Image Credit : Getty

ఆరోగ్యానికి ఏది మంచిది?

బాడీలో కాల్షియం తగ్గింది అనగానే..మనకు ముందు గుర్తొచ్చేది పాలు. ఏదో ఒక పూట పాలు తాగాలని అనుకుంటాం. పిల్లలకు కూడా పట్టిస్తాం. పాలల్లో కాల్షియం, ప్రోటీన్లు చాలానే ఉంటాయి. బలం వస్తుందని అనుకుంటాం. కానీ పాలను వేడిగా తాగడం మంచిదా? చల్లగా తాగడం మంచిదా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వేడి పాలతో ప్రయోజనాలు
Image Credit : Getty

వేడి పాలతో ప్రయోజనాలు

వేడి పాల వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. రాత్రిపూట వేడి పాలు తాగడం చాలా మంచిది. ఎందుకో తెలుసా  

జీర్ణక్రియకు ఉత్తమం: పాలను వేడి చేసినప్పుడు, అందులోని ప్రోటీన్లు, కొవ్వులు విచ్ఛిన్నమై సులభంగా జీర్ణమవుతాయి. లాక్టోస్ అలర్జీ లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారికి వేడి పాలు తాగడం మంచిది. 

మంచి నిద్రకు సహాయపడుతుంది: వేడి పాలలో 'ట్రిప్టోఫాన్' (Tryptophan) అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మెదడుకు విశ్రాంతినిచ్చి, నిద్రను ప్రేరేపిస్తుంది. రాత్రి పడుకునే ముందు గ్లాసు గోరువెచ్చని పాలు తాగితే, రోజంతా ఉన్న అలసట తీరిపోయి ప్రశాంతంగా నిద్రపడుతుంది. 

తక్షణ శక్తినిస్తుంది: పాలలో కొద్దిగా బాదం లేదా తేనె కలిపి వేడిగా తాగితే, శరీరానికి వెంటనే శక్తి వస్తుంది. జలుబు, దగ్గు ఉంటే, వేడి పాలలో పసుపు కలిపి తాగడం చాలా మంచిది. 

ఇది ముఖ్యం: మరీ వేడి పాలు తాగడం వల్ల నోరు, గొంతులో పుండ్లు ఏర్పడవచ్చు. ఇది దంతాల ఎనామిల్‌ను కూడా దెబ్బతీస్తుంది. ఎప్పుడూ గోరువెచ్చని పాలు తాగడమే సురక్షితం.

34
చల్లటి పాలు గుండెలో మంటను తగ్గిస్తుంది
Image Credit : Getty

చల్లటి పాలు గుండెలో మంటను తగ్గిస్తుంది

చల్లటి పాలు దాహాన్ని తీర్చడమే కాకుండా, శరీరానికి అనేక లాభాలున్నాయి

మీకు గ్యాస్ లేదా అసిడిటీ సమస్య ఉంటే, చల్లటి పాలు తాగడం మంచిది. చల్లటి పాలు కడుపులోని యాసిడ్ తీవ్రతను తగ్గించి, గుండెల్లో మంటను వెంటనే తగ్గిస్తాయి

వేసవిలో శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, చల్లటి పాలు తాగడం వల్ల శరీరం లోపలి నుంచి చల్లబరుస్తుంది. ఇది శరీరంలో నీటిశాతాన్ని కాపాడుకోవడానికి ఉత్తమమైనది. 

చల్లటి పాలు తాగడం, వాటితో ముఖం కడుక్కోవడం వల్ల చర్మానికి మెరుపు వస్తుంది. చర్మ రంధ్రాలను మూయడానికి కూడా ఇది సహాయపడుతుంది. 

సైనస్, ఆస్తమా లేదా తరచుగా జలుబు చేసే సమస్య ఉన్నవారు చల్లటి పాలు తాగకపోవడమే మంచిది. ఇది గొంతు నొప్పి, శ్వాస సమస్యలను పెంచే అవకాశం ఉంది.

44
ఏది బెటర్?
Image Credit : Getty

ఏది బెటర్?

మీకు నిద్ర సమస్యలు ఉన్నా లేదా జీర్ణక్రియను సులభతరం చేసుకోవాలనుకున్నా వేడి పాలను ఎంచుకోవచ్చు. మీకు అసిడిటీ సమస్య ఉన్నా లేదా వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాలనుకున్నా చల్లటి పాలు మంచిది. కాబట్టి ఇది పూర్తిగా మీ శరీర తత్వానికి తగినట్లు చూసుకోవాలి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Related Stories
Recommended image1
Kitchen Hack: వంటగదిలో ఈగలతో విసిగిపోయారా? ఇవి మీ ఇంట్లో ఉంటే అస్సలు కనిపించవు
Recommended image2
Kitchen Hack: కిచెన్ లో ఈ ఒక్క మార్పు చేస్తే చాలు.. నిమిషాల్లో మీ వంట రెడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved