MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Isabgol Benefits: దీన్ని నీళ్లల్లో నానబెట్టి తాగితే పొద్దున్న కల్లా మీ మలబద్ధకం పరార్, షుగర్ కంట్రోల్ లో ఉంటుంది

Isabgol Benefits: దీన్ని నీళ్లల్లో నానబెట్టి తాగితే పొద్దున్న కల్లా మీ మలబద్ధకం పరార్, షుగర్ కంట్రోల్ లో ఉంటుంది

Isabgol Benefits: తిన్న తిండి జీర్ణం కాక పొద్దున్నే మలబద్ధకంతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. దాని కోసమని ఆ మందులు, ఈ మందులు వేసేసుకుంటారు. అవన్నీ కాకుండా ఇదొక్కటి రాత్రి పూట నానబెట్టి తాగితే ఉదయాని కల్లా కడుపు క్లియర్ అయిపోతుంది. 

2 Min read
Author : Nandini Arava
Published : May 26 2026, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మీ మలబద్ధకం పరార్
Image Credit : Pinterest

మీ మలబద్ధకం పరార్

చాలా మంది సమయానికి భోజనం చేయరు. నీళ్లు సరిగ్గా తాగరు. ఆకలేస్తే దొరికింది కదా అని ఫాస్ట్ ఫుడ్ తినేస్తారు. ఒక్కోసారి పిజ్జాలు, బర్గర్లు తింటుంటారు. అవి తిన్నాక జీర్ణం కాక ఇబ్బంది పడుతుంటారు. పొద్దున్నే మలబద్ధకంతో రోజంతా భారంగా ఉంటారు. చేసే పని మీద దృష్టి ఉండదు. ఆకలిపుట్టదు, చికాకు, కోపం..ఇలా అవస్థలు పడుతుంటారు. ఇలాంటి సమస్యలకు ఇంట్లోనే ఒక చిన్న చిట్కా ఉంది. దాన్ని రాత్రి పూట నీటిలో నానబెట్టి పొద్దునే తాగితే అన్ని సమస్యలు పరార్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చూడటానికి గొంద్ లానే ఉంటుంది
Image Credit : Pinterest

చూడటానికి గొంద్ లానే ఉంటుంది

ఇసబ్‌గోల్ (Psyllium Husk) అనేది ఒక మొక్క గింజల పొట్టు. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. నీటిలో కలిసిన తర్వాత జెల్‌లా మారుతుంది. చూడటానికి అచ్చం గొంద్ లానే ఉంటుంది. ఇది పేగుల్లో మలాన్ని సాఫ్ట్‌గా మార్చి బయటకు వెళ్లేందుకు సహాయపడుతుంది. 

Related Articles

Related image1
Home Decor: ఇకపై పాత చున్నీలు పారేయకండి..ఇలా చేస్తే ఇంటికి లగ్జరీ ఇంటీరియర్ లుక్ గ్యారెంటీ
Related image2
Kitchen Hack: కిచెన్ లో ఈ ఒక్క మార్పు చేస్తే చాలు.. నిమిషాల్లో మీ వంట రెడీ
35
అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది
Image Credit : Social Media

అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది

కేవలం జీర్ణక్రియకే కాకుండా బరువు నియంత్రణలో కూడా ఇసబ్‌గోల్ (Psyllium Husk) ఉపయోగపడుతుంది. దీన్ని తీసుకున్న తర్వాత ఎక్కువసేపు ఆకలి అనిపించదు. దీంతో అనవసరంగా తినే అలవాటు తగ్గుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్‌లో దీన్ని చేర్చుకుంటున్నారు. చూసేందుకు నువ్వు పొట్టులా ఉంటుంది. దీనిని సైలియం పొట్టు అని కూడా అంటారు.

45
షుగర్ కంట్రోల్‍లో ఉంటుంది
Image Credit : Pinterest

షుగర్ కంట్రోల్‍లో ఉంటుంది

అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఇసబ్‌గోల్(Psyllium Husk) సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీంతో షుగర్ ఒక్కసారిగా పెరగకుండా ఉండొచ్చు. కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా ఇది మేలు చేస్తుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. 

55
వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం
Image Credit : Pinterest

వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం

సాధారణంగా ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు లేదా పాలలో ఒకటి నుంచి రెండు చెంచాల ఇసబ్‌గోల్ కలిపి తీసుకుంటారు. చాలామంది రాత్రి పడుకునే ముందు దీనిని తీసుకోవడం అలవాటు చేసుకుంటారు. అయితే దీన్ని తీసుకున్న తర్వాత తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. లేకపోతే కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యం కలగొచ్చు. లేకపోతే రాత్రి పూట గ్లాస్ నీళ్లలో పటికబెల్లం, ఈ ఇసబ్ గోల్(Psyllium Husk) వేసి నానబెట్టి పొద్దున్నే ఆ నీరు తాగితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి.

అయితే ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా ఉపయోగపడకపోవచ్చు. ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా చిన్నపిల్లలకు ఇవ్వాలనుకుంటే ముందుగా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. సరైన మోతాదులో వాడితే ఇసబ్‌గోల్ ఆరోగ్యానికి మంచి సహజ సహాయకుడిగా పనిచేస్తుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Chicken Biryani: 30 నిమిషాల్లో ఘుమఘుమలాడే పొట్లం బిర్యానీ.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
Recommended image2
Jaggery: బెల్లం ఎలా తింటున్నారు..? ఇలా తింటేనే ప్రయోజనం ఉంటుంది
Recommended image3
Barley Water: ఉదయాన్నే బార్లీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Related Stories
Recommended image1
Home Decor: ఇకపై పాత చున్నీలు పారేయకండి..ఇలా చేస్తే ఇంటికి లగ్జరీ ఇంటీరియర్ లుక్ గ్యారెంటీ
Recommended image2
Kitchen Hack: కిచెన్ లో ఈ ఒక్క మార్పు చేస్తే చాలు.. నిమిషాల్లో మీ వంట రెడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved