MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • Child Psychology: పిల్లల్ని ఎక్కువగా పొగుడుతున్నారా? వాళ్లు ఎలా మారిపోతారో తెలుసా?

Child Psychology: పిల్లల్ని ఎక్కువగా పొగుడుతున్నారా? వాళ్లు ఎలా మారిపోతారో తెలుసా?

చాలామంది పేరెంట్స్ పిల్లల్ని పొగడటం ద్వారా వారి ప్రేమను వ్యక్తంచేస్తుంటారు. పిల్లలు చిన్న విజయాలు సాధించినా.. చాలా బాగా చేశావు, నువ్వు బెస్ట్ అని చెప్తుంటారు. కానీ పిల్లల్ని అతిగా పొగడటం కూడా మంచిది కాదంటున్నారు సైకాలజీ నిపుణులు. ఎందుకో చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Mar 20 2026, 06:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పిల్లల్ని అతిగా పొగిడితే ఏమవుతుంది?
Image Credit : Twitter

పిల్లల్ని అతిగా పొగిడితే ఏమవుతుంది?

పిల్లల్ని ప్రోత్సహించడం, వారి విజయాలను గుర్తించడం ప్రతి తల్లిదండ్రుల సహజ స్వభావం. కానీ సైకాలజీ ప్రకారం అతిగా పొగడటం పిల్లల వ్యక్తిత్వ వికాసంపై ఊహించని ప్రభావం చూపించవచ్చు. అతిగా పొగడటం వల్ల పిల్లల్లో ఫిక్డ్ మైండ్ సెట్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. దానివల్ల వారు ఓడిపోయే పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒకసారి విఫలం అయితే, తాము అంత గొప్పవాళ్లం కాదనే భావనతో వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది.

25
పొగడ్త కోసమే..
Image Credit : gemini ai

పొగడ్త కోసమే..

అతిగా పొగడటం పిల్లల్లో బాహ్య ప్రోత్సాహంపై ఆధారపడే అలవాటును పెంచుతుంది. అంటే, వారు ఏ పని చేసినా “నన్ను ఎవరు పొగడతారా?” అనే ఆలోచనతో చేస్తారు. ఫలితంగా, వాళ్లు తమకు ఇష్టమైన పనులను కూడా స్వతంత్రంగా చేయకుండా, ప్రశంస కోసం మాత్రమే ప్రయత్నిస్తారు. ఇది దీర్ఘకాలంలో సృజనాత్మకతను, స్వతంత్ర ఆలోచనలను తగ్గించే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Relationship Tips: ఈ 5 సంకేతాలు కనిపిస్తే మీ రిలేషన్‌షిప్ ప్రమాదంలో ఉన్నట్లే!
Related image2
Child Psychology: పిల్లల్ని బెదిరించి చదివిస్తే సక్సెస్ అవుతారా? సైకాలజీ ఏం చెబుతోంది?
35
ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం
Image Credit : Getty

ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం

అతిగా పొగడటం వల్ల పిల్లల్లో అహంకారం, ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లలు తమ గురించి ఏర్పరచుకునే భావన చాలా వరకు తల్లిదండ్రుల మాటలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి చిన్న విషయానికీ అధికంగా పొగిడితే, వారు తమ సామర్థ్యాన్ని అసలు స్థాయికంటే ఎక్కువగా అంచనా వేయడం ప్రారంభిస్తారు. తర్వాత వాస్తవ జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు, వాటిని తట్టుకోలేక నిరాశ చెందే ప్రమాదం ఉంటుంది.

45
కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యం
Image Credit : Getty

కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యం

సైకాలజీ ప్రకారం పిల్లలు తప్పులను సహజంగా అంగీకరించే వాతావరణం లేకపోతే, పిల్లలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి వెనకడుగు వేస్తారు. వారు విఫలం అయితే తమపై ఉన్న మంచి అభిప్రాయం తగ్గిపోతుందనే భయం వారిలో కలుగుతుంది. ఇది వారి నేర్చుకునే సామర్థ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తుంది.

55
ప్రశంస విధానాన్ని మార్చుకోవడం..
Image Credit : freepik

ప్రశంస విధానాన్ని మార్చుకోవడం..

నిపుణుల ప్రకారం ప్రశంస విధానాన్ని మార్చుకోవాలి. పిల్లల వ్యక్తిత్వాన్ని కాకుండా, వారి కృషిని ప్రశంసించడం చాలా అవసరం.“నువ్వు చాలా తెలివైనవాడివి” అని చెప్పడం కంటే “నువ్వు చాలా కష్టపడి ఈ పని పూర్తి చేశావు” అని చెప్పడం మంచిది. ఇలా చేయడం ద్వారా పిల్లలు ప్రయత్నానికి విలువ ఇస్తారు. ఓడిపోయినా మళ్లీ ప్రయత్నిస్తారు. పిల్లలకు నిజాయతీతో కూడిన ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి. వారు చేసిన పనిలో లోపాలు ఉంటే, వాటిని సున్నితంగా తెలియజేయాలి. ఇలా చేయడం వల్ల వారు వాస్తవాన్ని అర్థం చేసుకొని, తమను తాము మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిన్నారుల సంరక్షణ
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Child Psychology: పిల్లల్ని బెదిరించి చదివిస్తే సక్సెస్ అవుతారా? సైకాలజీ ఏం చెబుతోంది?
Recommended image2
Crocs Health Risks: పిల్లలు వేసుకునే ఈ చెప్పుల్లో విషం..బయటపడ్డ అసలు నిజం!
Recommended image3
Kids Health: పిల్లలకు అస్సలు ఇవ్వకూడని ఫుడ్స్, తల్లులు తప్పక తెలుసుకోవాలి
Related Stories
Recommended image1
Relationship Tips: ఈ 5 సంకేతాలు కనిపిస్తే మీ రిలేషన్‌షిప్ ప్రమాదంలో ఉన్నట్లే!
Recommended image2
Child Psychology: పిల్లల్ని బెదిరించి చదివిస్తే సక్సెస్ అవుతారా? సైకాలజీ ఏం చెబుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved