పైనాపిల్‌లో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ సి, బ్రోమెలైన్ అనే ప్రత్యేక ఎంజైమ్ ఉండటం వల్ల ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. బోలెడంత ఎనర్జీ కూడా.
Image credits: freepik
Telugu
జీర్ణక్రియకు సహాయపడుతుంది
పైనాపిల్‌లో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
Image credits: freepik
Telugu
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
పైనాపిల్‌లో అధిక మోతాదులో ఉండే విటమిన్ సి.. రోగనిరోధక వ్యవస్థను యాక్టివ్‍గా ఉంచుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి శక్తినిస్తుంది.
Image credits: Getty
Telugu
చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది
పైనాపిల్‌లోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి, ముఖ సౌందర్యాన్ని పెంచడానికి సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
శరీర బరువును తగ్గిస్తుంది
పైనాపిల్‌లో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది శరీర బరువును తగ్గించుకోవడానికి బాగా సహాయపడుతుంది. పైనాపిల్ లో ఉండే పీచు శరీరంలో వ్యర్థాలను క్లీన్ చేస్తుంది.
Image credits: Getty
Telugu
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
పైనాపిల్‌లో ఉండే పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రిస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Image credits: Getty
Telugu
కంటి సమస్యలను నివారిస్తుంది
మంచి కంటి చూపుకు అవసరమైన బీటా కెరోటిన్, విటమిన్ ఎ పైనాపిల్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఇది వయసు పెరగడం వల్ల వచ్చే కంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.