MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Health
  • Health tips: వీటిలో ఏ ఒక్కటి తిన్నా.. బీపి, షుగర్ కంట్రోల్లో ఉండటం పక్కా!

Health tips: వీటిలో ఏ ఒక్కటి తిన్నా.. బీపి, షుగర్ కంట్రోల్లో ఉండటం పక్కా!

ప్రస్తుతం చాలామంది బీపీ, షుగర్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే రోజూ ఖాళీ కడుపుతో కొన్ని పదార్థాలను తీసుకోవడం ద్వారా.. కొద్ది రోజుల్లోనే బీపీ, షుగర్ నార్మల్ అవుతుందట. మరి ఆ పదార్థాలేంటో తెలుసుకుందామా..

2 Min read
Author : Kavitha G
Published : Jul 02 2025, 04:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
బీపి, షుగర్ అదుపులో ఉండాలంటే?
Image Credit : Getty

బీపి, షుగర్ అదుపులో ఉండాలంటే?

ప్రస్తుతం షుగర్ వ్యాధి సాధారణం అయిపోయింది. అయితే షుగర్ ఒక్క రోజులో వచ్చేది కాదు. చాలా కాలం పాటు రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో లేకపోవడం వల్లే ఈ సమస్య వస్తుంది. అలాగే హై బీపీ సమస్యతో కూడా చాలా మంది బాధపడుతుంటారు. 

మీరు కూడా ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ రెండింటినీ అదుపులో ఉంచుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. వీటిని రోజూ ఖాళీ కడుపుతో తీసుకుంటే షుగర్, బీపీ అదుపులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఉసిరికాయ:
Image Credit : stockPhoto

ఉసిరికాయ:

ఉసిరికాయ అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. బీపీ, షుగర్ తగ్గించుకోవడానికి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరికాయ తినవచ్చు. లేదా జ్యూస్‌లా తాగవచ్చు. ఉసిరికాయలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఉసిరికాయను ఖాళీ కడుపుతో తీసుకుంటే మెటబాలిజం మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  

Related Articles

Related image1
Dry Fish: హార్ట్, షుగర్ పేషెంట్లు ఎండు చేప తింటే ఏమవుతుందో తెలుసా?
Related image2
Sugar Free Sweets: ఈ స్వీట్లను షుగర్ పేషెంట్లు కూడా తినచ్చు!
37
మెంతులు:
Image Credit : Getty

మెంతులు:

మెంతులు.. రక్తంలో చక్కెర స్థాయిని, అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మెంతుల్లో కరిగే, కరగని ఫైబర్లు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా నానబెట్టిన మెంతులను తింటే బీపి, షుగర్ తగ్గుతుంది.

47
అవిసె గింజలు:
Image Credit : instagram

అవిసె గింజలు:

అవిసె గింజల్లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బీపీ, షుగర్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుతాయి. రోజూ ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నీటిలో అవిసె గింజల పొడి కలిపి తాగవచ్చు. లేదా స్మూతీస్‌లో కలిపి తీసుకోవచ్చు.

57
దాల్చిన చెక్క, మిరియాలు:
Image Credit : stockPhoto

దాల్చిన చెక్క, మిరియాలు:

దాల్చిన చెక్క రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా అడ్డుకుంటుందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే మిరియాలు శరీరంలో పోషకాల శోషణకు సహాయపడతాయి. ఈ రెండూ కలిపి తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఒక గ్లాసు వేడి నీటిలో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, చిటికెడు మిరియాల పొడి కలిపి ఖాళీ కడుపుతో తాగాలి.

67
పసుపు, నిమ్మరసం:
Image Credit : Getty

పసుపు, నిమ్మరసం:

పసుపు.. రక్తంలో షుగర్ లెవెల్స్, బీపీ రెండింటినీ అదుపులో ఉంచుతుంది. పసుపుతో నిమ్మరసం కలిపి తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఒక గ్లాసు పసుపు నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి.. రోజూ ఖాళీ కడుపుతో తాగితే బీపీ, షుగర్ అదుపులో ఉంటాయి.

77
దానిమ్మ రసం:
Image Credit : iSTOCK

దానిమ్మ రసం:

దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గించి బీపీని అదుపులో ఉంచుతాయి. రోజూ ఖాళీ కడుపుతో దానిమ్మ రసం తాగితే బీపీ, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.

గమనిక

ఆహారంలో మార్పులు చేసుకునే ముందు సంబంధిత వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
చిట్కాలు మరియు ఉపాయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
Dry Fish: హార్ట్, షుగర్ పేషెంట్లు ఎండు చేప తింటే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
Sugar Free Sweets: ఈ స్వీట్లను షుగర్ పేషెంట్లు కూడా తినచ్చు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved