MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Health
  • Head lice: త‌ల‌లో పేనుల‌కు మ‌నిషిన చంపే శ‌క్తి ఉంటుందా.? షాకింగ్ సంఘ‌ట‌న

Head lice: త‌ల‌లో పేనుల‌కు మ‌నిషిన చంపే శ‌క్తి ఉంటుందా.? షాకింగ్ సంఘ‌ట‌న

Head lice: త‌ల‌లో పేనులు క‌నిపించ‌డం స‌ర్వ‌సాధార‌ణం. అయితే ఇవి మ‌నిషి మ‌ర‌ణానికి కార‌ణ‌మ‌వుతాయంటే మీరు న‌మ్ముతారా.? తాజాగా ఒడిశాలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న గురించి తెలిస్తే క‌చ్చితంగా న‌మ్మాల్సిందే. 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 19 2026, 02:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పూరిలో విషాద సంఘ‌ట‌న
Image Credit : Gemini AI

పూరిలో విషాద సంఘ‌ట‌న

ఒడిశాలోని పూరి పట్టణానికి సమీపంలోని చంపాగ్రా ప్రాంతానికి చెందిన ఆరో తరగతి విద్యార్థిని లక్ష్మీప్రియ కొంతకాలంగా తీవ్రమైన తల పేనుల సమస్యతో బాధపడుతోంది. మొదట ఇది సాధారణ సమస్యగా భావించిన కుటుంబ సభ్యులు ఇంటి చిట్కాలు ప్రయత్నించారు. వేప రసం, నూనెలు, మార్కెట్లో లభించే షాంపూలు వాడినా ఉపశమనం ల‌భించ‌లేదు. తలలో తీవ్రమైన దురద, గాయాలు, దుర్వాసన మొదలయ్యాయి. పరిస్థితి మరింత దిగజారడంతో ఆమె అకస్మాత్తుగా రక్తం వాంతి చేయడం ప్రారంభించింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను పూరి మెడిక‌ల్ కాలేజీకి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినా బాలిక ప్రాణాలు నిలుపలేకపోయారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పేనులు నిజంగా ప్రాణాలకు ప్రమాదమా?
Image Credit : our own

పేనులు నిజంగా ప్రాణాలకు ప్రమాదమా?

సాధారణంగా తల పేనులు ప్రాణాంతకమయ్యే అవకాశం చాలా తక్కువ. ఇవి తల చర్మంపై జీవిస్తూ రక్తాన్ని పీలుస్తాయి. దురద, అసౌకర్యం కలిగిస్తాయి. అయితే దీర్ఘకాలం చికిత్స లేకుండా వదిలేస్తే సమస్య తీవ్రమవుతుంది. పదేపదే గోకడం వల్ల తల చర్మం చీలిపోతుంది. ఆ గాయాల ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. అత్యంత అరుదైన సందర్భాల్లో ఈ ఇన్ఫెక్షన్ రక్తంలోకి చేరి సెప్టిసీమియా అనే ప్రమాదకర స్థితికి దారి తీస్తుంది. సెప్టిసీమియా అంటే శరీరంలో ఇన్ఫెక్షన్ విస్తరించి అవయవాల పనితీరు దెబ్బతినే పరిస్థితి. ఇది వేగంగా తీవ్రరూపం దాల్చితే ప్రాణాపాయం కలిగిస్తుంది.

Related Articles

Related image1
మీరు కూడా ఈ అమ్మాయిలా నెల‌కు రూ. 3 ల‌క్ష‌లు సంపాదించాలా.? ఇలా ఆలోచించండి
Related image2
గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో ర‌చ్చ చేస్తున్న హార్ధిక్ పాండ్యా.. స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఫొటో పోస్ట్ చేస్తూ..
35
ఈ బాలికకు ఇలా ఎందుకు జరిగింది?
Image Credit : our own

ఈ బాలికకు ఇలా ఎందుకు జరిగింది?

కోల్‌కతాకు చెందిన చర్మవ్యాధి నిపుణుడు ఎమ్‌.పాల్‌ వివరించిన ప్రకారం, పేనులు తలపై గాయాలు కలిగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. గోకడం వల్ల ఏర్పడే గాయాలు ఎక్కువైతే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ రక్తంలోకి చేరితే సెప్టిసీమియా వచ్చే అవకాశం ఉంటుంది. శరీర అవయవాలు క్రమంగా పనిచేయడం ఆగిపోతాయి. రక్తహీనత కూడా పెరిగితే పరిస్థితి మరింత క్లిష్టమవుతుంది. లక్ష్మీప్రియ విషయంలో తలపై తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఏర్పడి, అది రక్తంలోకి చేరి పరిస్థితి విషమించిందని ప్రాథమిక సమాచారం సూచిస్తోంది. పూర్తి వైద్య రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఖచ్చితమైన కారణం వెల్లడవుతుంది.

45
నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరం?
Image Credit : our own

నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరం?

పేనులు సాధారణంగా పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తాయి. చాలామంది తల్లిదండ్రులు దీనిని చిన్న సమస్యగా తీసుకుంటారు. కానీ లక్షణాలు ఎక్కువకాలం కొనసాగితే నిర్లక్ష్యం చేయకూడదు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి:

* తీవ్రమైన దురద

* తలపై గాయాలు

* చర్మం ఎర్రబడటం

* దుర్వాసన రావ‌డం

* జ్వరం

* అసాధారణ అలసట

ప్రారంభ దశలో చికిత్స తీసుకుంటే పెద్ద ప్రమాదం తప్పించుకోవచ్చు.

55
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Image Credit : our own

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పిల్లల్లో పేనుల సమస్య ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలి.

* బట్టలు, బెడ్ షీట్లు, దిండుల కవర్లు, తువ్వాళ్లు వేడి నీటిలో ఉతకాలి.

* దువ్వెనలు, హెయిర్ యాక్సెసరీలు ఇతరులతో పంచుకోరాదు.

* ఒకరికి ఉంటే అందరూ పరీక్షించుకోవాలి. అవసరమైతే ఒకేసారి మందులు వాడాలి.

* ఓవర్-ది-కౌంటర్ మందులు ఉపయోగించే ముందు డాక్టర్ సలహా మంచిది.

* ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే వాటి పరిశుభ్రత కూడా చూసుకోవాలి.

మొత్తం మీద పేనులు సాధారణ సమస్యే అయినా, దీర్ఘకాలం నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారి తీసే అవకాశం ఉంది. అయితే ప్రతి పేను కేసు ప్రాణాంతకం కాదు. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే ప్రమాదాన్ని పూర్తిగా నివారించవచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
మీరు కూడా ఈ అమ్మాయిలా నెల‌కు రూ. 3 ల‌క్ష‌లు సంపాదించాలా.? ఇలా ఆలోచించండి
Recommended image2
గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో ర‌చ్చ చేస్తున్న హార్ధిక్ పాండ్యా.. స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఫొటో పోస్ట్ చేస్తూ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved