MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • మీరు కూడా ఈ అమ్మాయిలా నెల‌కు రూ. 3 ల‌క్ష‌లు సంపాదించాలా.? ఇలా ఆలోచించండి

మీరు కూడా ఈ అమ్మాయిలా నెల‌కు రూ. 3 ల‌క్ష‌లు సంపాదించాలా.? ఇలా ఆలోచించండి

Business Ideas: వ్యాపారం చేయాల‌ని చాలా మందికి ఉంటుంది. అయితే బిజినెస్‌లో న‌ష్టాలు వ‌స్తాయేమో అని వెనుక‌డుగు వేస్తుంటారు. కానీ హ‌రియాణాకు చెందిన ఓ యువ‌తి స్టోరీ తెలుసుకుంటే వ్యాపారంలో ల‌క్ష‌లు కురిపించ‌వ‌చ్చ‌నే న‌మ్మ‌కం మీక్కూడా వ‌స్తుంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 19 2026, 11:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మిల్లెట్‌ స్టార్టప్‌తో యువతి సక్సెస్‌ స్టోరీ
Image Credit : palak.aurora/Instagram

మిల్లెట్‌ స్టార్టప్‌తో యువతి సక్సెస్‌ స్టోరీ

ఉద్యోగం చేస్తూనే వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వారికి ఇది మంచి ఉదాహరణ. హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన పలక్‌ అరోరా అనే యువతి మిల్లెట్‌ ఆధారిత ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ ఉత్పత్తులతో నెలకు సుమారు రూ. 3 లక్షల రూపాయల ఆదాయం సాధిస్తోంది. కేవలం ఆరోగ్యకరమైన ఆలోచనతో మొదలైన ప్రయత్నం ఇప్పుడు విజయవంతమైన బ్రాండ్‌గా మారింది. ఈ కథ కేవలం ఆమె సక్సెస్‌ గురించే కాదు.. మీరు కూడా ఇలాంటి వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అనే దానిపై స్పష్టమైన దారి చూపిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సమస్యను గుర్తించండి.. దాంట్లోనే అవకాశం ఉంటుంది
Image Credit : Asianet News

సమస్యను గుర్తించండి.. దాంట్లోనే అవకాశం ఉంటుంది

ఇప్పటి తరం మహిళలు ఉద్యోగాలు, కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ బిజీగా ఉంటున్నారు. వంటకు ఎక్కువ సమయం కేటాయించడం కష్టమవుతోంది. అందుకే ఇన్‌స్టంట్‌ మిక్సెస్‌, రెడీ టు ఈట్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతోంది. కానీ మార్కెట్లో ఉన్న వాటిలో ప్రిజర్వేటివ్స్‌, కృత్రిమ రంగులు ఎక్కువగా ఉండటం ఆరోగ్యంపై సందేహాలు పెంచుతోంది. పలక్‌ కుటుంబంలో ఆరోగ్య సమస్యలు రావడం ఆమెకు మిల్లెట్స్‌ విలువ తెలిసేలా చేసింది. మార్కెట్లో నాణ్యమైన, ప్రిజర్వేటివ్స్‌ లేని మిల్లెట్‌ ఉత్పత్తులు తక్కువగా ఉన్నాయని గుర్తించింది. అదే ఆమె వ్యాపారానికి బలమైన ఆలోచనగా మారింది.

36
మీరు కూడా ఇలా చేయాలి:
Image Credit : Asianet News

మీరు కూడా ఇలా చేయాలి:

మార్కెట్లో ఉన్న లోటు ఏది గుర్తించండి. వినియోగదారుల సమస్యలు ఏమిటో తెలుసుకోండి. ఆరోగ్య ట్రెండ్స్‌, ఫుడ్‌ అలవాట్లు పరిశీలించండి. సమస్య ఉన్న చోటే వ్యాపార అవకాశాలు ఉంటాయన్న విష‌యాన్ని గుర్తించండి. పలక్‌ ఫుడ్‌ టెక్నాలజీలో ఇంజినీరింగ్‌ చదివినా.. ప్రారంభం మాత్రం తన ఇంటి వంటగదిలోనే చేసింది. రాగులు, జొన్నలు, మొలకెత్తిన పప్పులు కలిపి కొత్త రెసిపీలు తయారు చేసింది. కుటుంబ సభ్యులు, స్నేహితుల అభిప్రాయాలు తీసుకుంది. ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా రెసిపీల్లో మార్పులు చేసింది.

46
మీరు కూడా ప్రారంభించాలంటే:
Image Credit : Asianet News

మీరు కూడా ప్రారంభించాలంటే:

చిన్న స్థాయిలో ట్రయల్స్‌ చేయండి. 3–4 ప్రోడక్ట్స్‌తో మొదలు పెట్టండి. ఫ్రెండ్స్‌, కాలనీలో ట్రయల్‌ సేల్స్‌ చేయండి. కస్టమర్‌ అభిప్రాయాలు నమోదు చేసుకోండి. మొదట్లో పెద్ద పెట్టుబడి అవసరం లేదు. క్వాలిటీ, రుచి కీలకం.

బ్రాండ్‌ నిర్మాణం ఎలా చేయాలి?

పలక్‌ 2021లో తన సంస్థను ప్రారంభించింది. ఆ తర్వాత మిల్లెట్‌ ఆధారిత నూడుల్స్‌, పాస్తా, పులావ్‌ మిక్స్‌, ప్యాన్‌కేక్‌ మిక్స్‌, రాగి సూప్‌, ఫ్లేక్స్‌ వంటి 15కు పైగా ఉత్పత్తులు తీసుకొచ్చింది. ముఖ్యంగా 10 నిమిషాల్లో సిద్ధమయ్యేలా ఉత్పత్తులు డిజైన్‌ చేసింది. మిల్లెట్స్‌ను నానబెట్టే అవసరం లేకుండా తయారీ విధానం. మొలకెత్తించడం, వేయించడం వంటి పద్ధతులతో పోషకాలు కాపాడటం, చిన్న ప్యాక్‌ నుంచి జంబో ప్యాక్‌ వరకు అందుబాటులో తీసుకురావాలి.

56
బ్రాండ్‌ కోసం చేయాల్సింది:
Image Credit : Asianet News

బ్రాండ్‌ కోసం చేయాల్సింది:

సరైన పేరు ఎంపిక. ఆకర్షణీయమైన ప్యాకేజింగ్‌, FSSAI రిజిస్ట్రేషన్‌, స్పష్టమైన లేబెలింగ్‌, వినియోగ‌దారుల‌కు “హెల్దీ + క్విక్‌” అనే స్పష్టమైన సందేశం చేరేలా చూడాలి. బ్రాండ్‌ నమ్మకం పెరిగితే అమ్మకాలు వాటంత‌ట‌వే పెరుగుతాయి.

అమ్మకాలు పెంచాలంటే ఈ వ్యూహాలు ఉపయోగపడతాయి

పలక్‌ తన ఉత్పత్తులను వెబ్‌సైట్‌, సూపర్‌మార్కెట్లు, ఈ-కామర్స్‌ ప్లాట్ ఫామ్స్ ద్వారా విక్రయిస్తోంది. ఫుడ్‌ ఎగ్జిబిషన్స్‌, ఫుడ్‌ ఫెస్టివల్స్‌లో పాల్గొంటూ కస్టమర్లను నేరుగా కలుస్తోంది. ఇందుకోసం సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ ప్రారంభించండి, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ద్వారా డెమో వీడియోలు పెట్టండి, ఆన్‌లైన్‌ మార్కెట్‌ప్లేస్‌లలో లిస్ట్‌ చేయండి, స్థానిక కిరాణా దుకాణాలతో టైఅప్స్ చేసుకోండి, హెల్త్‌ క్లబ్బులు, జిమ్‌లలో ప్రమోషన్‌ చేయండి. ప్రారంభంలో లాభం తక్కువైనా.. దీర్ఘ‌కాలంలో ఆదాయం వేగంగా పెరుగుతుంది. వ్యాపారంలో విజ‌యం సాధించాలంటే.. ఉత్పత్తి నాణ్యతపై రాజీ పడకండి, మార్కెట్‌ ట్రెండ్స్‌ పరిశీలించండి, నిరంతరం కొత్త ఉత్పత్తులు తీసుకురండి, కస్టమర్‌ నమ్మకం సంపాదించండి, చిన్న టీమ్‌తో ప్రారంభించి క్రమంగా విస్తరించండి.

66
ఎంత పెట్టుబ‌డి అవ‌స‌రం.?
Image Credit : Asianet News

ఎంత పెట్టుబ‌డి అవ‌స‌రం.?

చిన్న స్థాయిలో మొదలు పెట్టాలంటే సుమారు రూ. 1–రూ. 3 లక్షల పెట్టుబడి సరిపోతుంది. ఇందులో ముడి సరుకు కొనుగోలు, చిన్న మిక్సింగ్‌ యూనిట్‌, ప్యాకేజింగ్‌ మెటీరియల్‌, లైసెన్సులు, మార్కెటింగ్‌ ఖర్చులు, డిమాండ్‌ పెరిగిన కొద్దీ యూనిట్‌ను విస్తరించవచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image2
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Recommended image3
మీ ద‌గ్గ‌ర పైస‌లు ఉన్నాయా.? ఇలా చేస్తే.. మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం
Related Stories
Recommended image1
హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కానుంది.. ఫ్యూచ‌ర్ సిటీతో ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్‌ ఖాయం
Recommended image2
ఈ ఉద్యోగానికో దండంరా అనిపిస్తోందా.? ఇలా చేస్తే ఉన్న ఊరిలోనే నెల‌కు ల‌క్ష ఆదాయం ప‌క్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved