MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Health: క‌డుపులో గ్యాస్‌కి త‌ల‌నొప్పికి మ‌ధ్య‌ ఉన్న‌ సంబంధం ఏంటో తెలుసా.?

Health: క‌డుపులో గ్యాస్‌కి త‌ల‌నొప్పికి మ‌ధ్య‌ ఉన్న‌ సంబంధం ఏంటో తెలుసా.?

Health: త‌ల‌నొప్పి రావ‌డానికి ఎన్నో కార‌ణాలు ఉంటాయి. అయితే జీర్ణ సమస్యల వల్ల తలనొప్పి వ‌స్తుంద‌ని మీకు తెలుసా.? దీనినే గ్యాస్ట్రిక్ హెడెక్‌ అంటారు. ప్రతి తలనొప్పి టెన్షన్ వల్లనే వస్తుందని అనుకోవడం తప్పు. కొన్ని సందర్భాల్లో అసలు కారణం కడుపులో ఉంటుంది 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 18 2026, 05:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గ్యాస్ వల్ల తలనొప్పి ఎలా వస్తుంది?
Image Credit : Gemini AI

గ్యాస్ వల్ల తలనొప్పి ఎలా వస్తుంది?

మన కడుపు, మెదడు మధ్య గట్టి సంబంధం ఉంది. దీనిని గ‌ట్ బ్రెయిన్ కనెక్షన్ అంటారు. అజీర్ణం, ఎసిడిటీ, గ్యాస్ ఎక్కువగా ఉండటం వంటి సమస్యలు వచ్చినప్పుడు శరీరం ప్రతిస్పందిస్తుంది. కొందరిలో ఈ అసౌకర్యం తలనొప్పిగా బయటపడుతుంది. మసాలా ఆహారం, టైమ్‌కు భోజనం చేయకపోవడం, ఎక్కువ టీ–కాఫీ, ఒత్తిడి ఇవన్నీ ఈ సమస్యను పెంచుతాయి.

25
సాధారణ గ్యాస్ట్రిక్ తలనొప్పి, గ్యాస్ట్రిక్ మైగ్రేన్ తేడా
Image Credit : Istocks

సాధారణ గ్యాస్ట్రిక్ తలనొప్పి, గ్యాస్ట్రిక్ మైగ్రేన్ తేడా

బెంగళూరులోని బెంగ‌ళూరు గ్యాస్ట్రో సెంట‌ర్ రిపోర్ట్ ప్ర‌కారం గ్యాస్ట్రిక్ హ‌డెక్‌, గ్యాస్ట్రిక్ మైగ్రేన్ రెండు వేర్వేరు. గ్యాస్ట్రిక్ హెడెక్ తేలికపాటి లేదా నిరంతర నొప్పి ఉంటుంది. అలాగే కడుపు ఉబ్బరం, అజీర్ణంతో కలిసి ఉంటుంది. గ్యాస్ట్రిక్ మైగ్రేన్‌లో తీవ్రమైన నొప్పి ఉంటుంది. కాంతి, శబ్దం అసహనం, మలబద్ధకం, వాంతులు ఉండవచ్చు. రెండింటికీ మూల కారణం జీర్ణ సమస్యలే.

Related Articles

Related image1
హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కానుంది.. ఫ్యూచ‌ర్ సిటీతో ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్‌ ఖాయం
Related image2
ఈ ఉద్యోగానికో దండంరా అనిపిస్తోందా.? ఇలా చేస్తే ఉన్న ఊరిలోనే నెల‌కు ల‌క్ష ఆదాయం ప‌క్కా
35
ఎప్పుడు ప్రమాద సూచనగా భావించాలి?
Image Credit : our own

ఎప్పుడు ప్రమాద సూచనగా భావించాలి?

ఎప్పుడో ఒకసారి తలనొప్పి వస్తే పెద్దగా ఆందోళన అవసరం లేదు. కానీ వారానికి రెండుసార్లకంటే ఎక్కువ తలనొప్పి, కారణం లేకుండా బరువు తగ్గడం, తరచూ వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటే ఇది కేవలం గ్యాస్ సమస్య కాకపోవచ్చు. క్రానిక్ గ్యాస్ట్రైటిస్, పెప్టిక్ అల్సర్, గాల్‌బ్లాడర్ వ్యాధి, ఇర్రిటేబుల్ బవెల్ సిండ్రోమ్, జీఈఆర్‌డీ వంటి సమస్యల సూచన కావచ్చు.

45
డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Image Credit : our own

డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

ఇంట్లో మందులు వేసుకుని మానిపోతుందనుకోవడం సరికాదు. తరచూ తిరిగి వచ్చే తలనొప్పి, ఇంట్లో ట్రీట్‌మెంట్‌తో ఉపశమనం లేకపోవడం, తీవ్రమైన కడుపు సమస్యలు వంటివి ఎక్కువ‌గా క‌నిపిస్తే వెంట‌నే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలవాలి. అవసరమైతే ఎండోస్కోపీ వంటి పరీక్షల ద్వారా జీర్ణ వ్యవస్థ పరిస్థితి తెలుసుకుంటారు. చికిత్సలో కేవలం పెయిన్‌కిల్లర్లు కాదు, జీర్ణ వ్యవస్థ సరిచేయడమే ప్రధాన లక్ష్యంగా ఉంటుంది.

55
గ్యాస్ట్రిక్ తలనొప్పి నుంచి ఎలా కాపాడుకోవాలి?
Image Credit : our own

గ్యాస్ట్రిక్ తలనొప్పి నుంచి ఎలా కాపాడుకోవాలి?

ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే కొన్ని సూచ‌న‌లు పాటించాల‌ని నిపుణులు చెబుతున్నారు. టైమ్‌కు భోజనం చేయాలి, తక్కువ మసాలా, తేలికపాటి ఆహారం తీసుకోవాలి, రోజుకు సరిపడా నీరు తాగాలి, ఒత్తిడిని నియంత్రించాలి, ఎక్కువ టీ, కాఫీ తగ్గించాలి.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాల‌ను కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచ‌న‌లు పాటించ‌డ‌మే ఉత్త‌మం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
మొబైల్ ఎక్కువగా చూస్తే పిల్లలకు మాటలు రావా..? సైన్స్ ఏం చెబుతోంది..?
Recommended image2
Skipping Dinner: 11 రోజులపాటు రాత్రిపూట భోజనం మానేస్తే ఏమవుతుందో తెలుసా?
Recommended image3
Alcohol: నిమ్మ‌కాయ చ‌ప్ప‌రిస్తే తాగిన మ‌త్తు దిగుతుందా.? అస‌లేంటీ లాజిక్
Related Stories
Recommended image1
హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కానుంది.. ఫ్యూచ‌ర్ సిటీతో ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్‌ ఖాయం
Recommended image2
ఈ ఉద్యోగానికో దండంరా అనిపిస్తోందా.? ఇలా చేస్తే ఉన్న ఊరిలోనే నెల‌కు ల‌క్ష ఆదాయం ప‌క్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved