మొబైల్ ఎక్కువగా చూస్తే పిల్లలకు మాటలు రావా..? సైన్స్ ఏం చెబుతోంది..?
ఏదైనా పనిలో ఉండగా పిల్లలు డిస్టర్బ్ చేస్తుంటే లేదా ఏడుస్తుంటే తల్లులు మొబైల్ ఫోన్ ఇస్తుంటారు… ఇలా తరచూ చేయడంతో సెల్ ఫోన్ పిల్లలకు అలవాటుగా మారే ప్రమాదం ఉంది. ఇది పిల్లలకు ఎంత ప్రమాదకరమో తెెలుసా?

ఆల్ఫా తరంపై కనీసం జాలి చూపండి..!
1997-2012 మధ్య పుట్టిన వ్యక్తులను జెన్ z అంటున్నారు.
మొబైల్ వ్యసనం వల్ల వీరి మేథో శక్తి తగ్గిపోయిందని అంతర్జాతీయంగా వెలువడ్డ వార్తను అందరూ చదివారు.
మరి ఆల్ఫా తరం సంగతేంటి?
2013- 2025 మధ్య పుట్టిన వ్యక్తులను ఆల్ఫా తరం అంటారు.
మొబైల్ ఫోన్ పసి వయస్సు వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. కారణం .. వారి కపాలం పెద్దవారి తో పోలిస్తే యాభై శాతం మాత్రమే మందంగా ఉంటుంది.
దీనితో మొబైల్ రేడియేషన్ వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. స్మార్ట్ ఫోన్ వచ్చేటప్పటికి జెన్ z తరం వారు కాస్త పెరిగి పెద్ద అయ్యారు.
ఆల్ఫా తరం వారికి పసివయస్సులోనే చేతికి సెల్ ఫోన్ వచ్చి చేరింది.
మొబైల్ ఫోన్ చేతికి వస్తే అది కచ్చితంగా వ్యసనంగా మారుతుంది . లిమిటెడ్ స్క్రీన్ టైం అనేది ఆచరణ సాధ్యం కాని విషయం. డోపామైన్ ఊబిలోకి దిగడమే కానీ బయటకు రావడం సులభం కాదు.
మీ పిల్లల చేతికి మొబైల్ ఇచ్చారో... ఈ ప్రమాదం తప్పదు
రెండేళ్ళ వయస్సులోనే బిడ్డ చేతికి సెల్ ఫోన్ ఇచ్చేస్తున్న తల్లులు... దీంతో ఈ పసి కందులు వర్చువల్ ఆటిజం బారిన పడుతున్నారు.
అంటే బుద్ధి మాంద్యత .
మాటలు రావు .
సెల్ ఫోన్ తీసేస్తే గుక్కపట్టి ఏడుస్తారు.
అన్నం తినరు .
చేతికి అందిన వస్తువును విసిరి కొడుతారు .
అటెన్షన్ డెఫిషిట్ హైపర్ ఆక్టివిటీ డిజార్డర్ అనే సమస్య వీరికి వచ్చేస్తుంది.
గతంలో కూడా ఈ సమస్య ఉండేది .
కానీ లక్షల్లో ఒకరికి.... కారణం జన్యు పరమయినది.
ఇప్పుడు?
మీరు థెరపీ క్లినిక్ కు వెళ్ళండి. "ఇంతమందికి ఈ సమస్య ఉందా??? .. నాకు తెలియదే?" అని షాక్ అవుతారు .
ఒక సెషన్ కు ఇంత అని చెప్పి కొన్ని నెలల పాటు థెరపీ తీసుకొని వేలల్లో ఖర్చు పెట్టి .."అమ్మయ్య .. మన బిడ్డకు లక్షణాలు తగ్గాయి .. మాటలు వచ్చాయి" అని బయటకు వస్తారు.
లక్షణాల తీవ్రత తగ్గింది .. కానీ ఆ బిడ్డకు మిగతా వారి స్థాయిలో IQ ఉంటుందా ?
తెలుసుకొనే ప్రయత్నం చెయ్యండి .
మీ పిల్లల గురించి ఈ నిజాలు తెలుసుకొండి
నేడు ప్రతిదీ వ్యాపారం.
నిజాలు బయటకు రావు .
నిజాలు తెలుసుకోవాలంటే కాస్త ప్రయత్నం చెయ్యాలి .
గత పదేళ్లుగా టీచింగ్ వృత్తిలో ఉన్న పది మందిని కలవండి .
గ్రామీణ పాఠశాలలు .. ప్రభుత్వ పాఠశాలలు , బడ్జెట్ బడులు, సిబిఎస్సీ , ఇంటర్నేషనల్ .. ఇలా అన్ని రకాల బడుల్లో... పాఠాలు చెబుతున్న టీచర్స్ ను కలవండి.
కింద ఇచ్చిన విషయాలు నిజామా? కాదా?? అని అడగండి .
1. అధిక శాతం పిల్లల్లో హైపర్ ఆక్టివిటీ కనిపిస్తుంది.
2. కనీసం మూడు నిముషాలు ఏకాగ్రతతో పాఠాలు వినరు. పక్క పిల్లలను డిస్టర్బ్ చేస్తారు. క్లాస్ పై ద్రుష్టి పెట్టకపోవడం వల్ల ఎంత బాగా పాఠం చెప్పినా అర్థం కాదు.
3. గ్రహణ శక్తి తగ్గి పోయింది. వరుసగా మూడు పనులు చెప్పండి. ఒకటొదే చేస్తారు. వరుసగా మూడు విషయాలు గ్రహించే స్థాయిని కూడా వారు కోల్పోయారు. ఒకప్పుడు ఏకసంతాగ్రాహులు ఉండేవారు. ఒక్కసారి చెబితే విని గుర్తు పెట్టుకొనే పవర్. ఇప్పుడు? శతావధానం. అంటే ఒకేసారి వంద మందితో వ్యవహరించే శక్తి . ఇప్పుడు ?
కళ్ళు తెరిచి నిజాన్ని గ్రహించండి .
4. జ్ఞాపక శక్తి తగ్గిపోయింది . కారు నంబర్స్ చెబుతున్నాడని సంతోషపడకండి
మొబైల్ మీ బిడ్డల జీవితాన్ని నాశనం చేస్తుంది.
ఇది అసలు సమస్యే కాదని మెజారిటీ తల్లితండ్రులు ప్రవర్తిస్తున్నారు. దీని వల్ల ఆల్ఫాతరం... అంటే నేడు బడిలో చదువుతున్న పిల్లల భవిషత్తు అంధకారంలో పడిపోయింది . ఒకటో పదో కుటుంబాలకు చెందిన సమస్య అయితే వేరు.
ఇది ఒక తరానికి చెందిన సమస్య .
సామజిక సంక్షోభం .
మిగతా విషయాలు ఎలా వున్నా కనీసం పసి కందులపై జాలి దయ చూపండి .
ఇక్కడి దాకా చదివాక ఏమి చెయ్యాలి అని మీరు అనుకొంటున్నారా ?
అంటే మొబైల్ ఫోన్ మీ ఇంగిత జ్ఞానాన్ని కూడా దోచేసింది.
మొబైల్ ఫోన్ పిలల్లకు ఇవ్వకూడదు .
ఆల్రెడీ ఇచ్చి ఉంటే నచ్చ చెప్పి తీసెయ్యండి .
లేకపోతె మీ బిడ్డ జీవితాన్ని అది నాశనం చేస్తుంది .
ఇది శాపం కాదు... సైన్స్.

