MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Health
  • Liver Health: కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటికి దూరంగా ఉండాల్సిందే..

Liver Health: కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటికి దూరంగా ఉండాల్సిందే..

Liver Health: కాలేయం ఆరోగ్యం దెబ్బతినడానికి ఆల్కహాల్ మాత్రమే కారణం కాదు. కొన్ని ఆహారాలు కూడా లివర్‌ హెల్త్ ను పాడుచేస్తాయి. అలాంటి కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం.

2 Min read
Author : Rajesh K
Published : Jul 20 2025, 10:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
 ఆహారపు అలవాట్లు
Image Credit : Getty

ఆహారపు అలవాట్లు

లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తప్పనిసరి. అనారోగ్యకర,  తప్పుడు ఆహారపు అలవాట్లు లివర్‌ హెల్త్ పై తీవ్ర ప్రభావం చూపుతాయి. కాలేయ ఆరోగ్యానికి హాని చేసే ఆహారాల గురించి తెలుసుకుందాం:

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
నూనెలో వేయించిన ఆహారాలు
Image Credit : Getty

నూనెలో వేయించిన ఆహారాలు

నూనెలో వేయించిన ఆహారాలు అనారోగ్యకరమైన కొవ్వుతో లివర్‌ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇవి ఫ్యాటి లివర్‌కు దారితీయవచ్చు. అందుకే ఈ ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. 

Related Articles

Related image1
Liver : మీలో లక్షణాలున్నాయా? అయితే.. కాలేయ సమస్య కావచ్చు!
Related image2
Liver Health: మీ లివర్ ని హెల్దీగా మార్చే కూరగాయలు ఇవి..!
38
అధిక చక్కెర ఆహారాలు, పానీయాలు
Image Credit : Getty

అధిక చక్కెర ఆహారాలు, పానీయాలు

చక్కెర కలిగిన ఆహారాలు, పానీయాలలో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. ఈ ఫ్రక్టోజ్ వేగంగా కొవ్వుగా మారుతుంది. దీనివల్ల నాన్-అల్కహాలిక్ ఫ్యాటి లివర్ డిసీజ్ (NAFLD) అనే సమస్య పెరుగుతుంది. ఇలాంటి ఆహారాలను తరచూ తీసుకుంటే, లివర్‌లో కొవ్వు గడ్డకట్టినట్లుగా చేరి దీర్ఘకాలికంగా లివర్ పనితీరును మందగిస్తుంది.  

48
ప్రాసెస్ చేసిన ఫుడ్
Image Credit : Getty

ప్రాసెస్ చేసిన ఫుడ్

అనారోగ్యకరమైన కొవ్వు కలిగిన ప్రాసెస్ చేసిన ఆహారాలు అంటే.. ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, ప్రీఫ్యాక్డ్ ఫుడ్, ఫ్రోజన్ స్నాక్స్ తరచుగా తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ (NAFLD) ప్రమాదం పెరుగుతుంది. ఇవి లివర్‌లో కొవ్వు పేరుకుపోయేలా చేసి, లివర్ కణజాలాన్ని దెబ్బతీస్తాయి. దీర్ఘకాలంగా ఇలా జరిగితే లివర్ ఇన్ఫ్లమేషన్, ఫైబ్రోసిస్, సిరోసిస్ వంటి తీవ్ర సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. 

58
 రెడ్ మీట్
Image Credit : Asianet News

రెడ్ మీట్

రెడ్ మీట్ అంటే బీఫ్, మటన్, పోర్క్  అధికంగా తీసుకోవడం వల్ల లివర్‌పై ఒత్తిడి పెరిగి, కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. ఇందులో సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉండటంతో ఫ్యాటీ లివర్, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబ్టటి రెడ్ మీట్ వినియోగాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేండి. 

68
కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్
Image Credit : Getty

కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్

కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే  అన్నం, వైట్ బ్రెడ్, పాస్తా వంటివి లివర్ ఆరోగ్యానికి మంచివి కావు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. ఇవి లివర్‌పై ఒత్తిడి తెచ్చి ఇన్‌సులిన్ రిజిస్టెన్స్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలకు దారితీస్తాయి. 

78
ఉప్పు
Image Credit : Getty

ఉప్పు

ఉప్పు (సోడియం) అధికంగా తీసుకోవడం కాలేయానికి హానికరం, ముఖ్యంగా నాన్-అల్కహాలిక్ ఫ్యాటి లివర్ వ్యాధి ఉన్నవారు అధిక ఉప్పు ఆహారం తీసుకునే లివర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో వాపు, ఫైబ్రోసిస్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజువారీ ఉప్పు వినియోగాన్ని తగ్గించడం మేలు. 

88
గమనిక:
Image Credit : Getty

గమనిక:

ఆరోగ్య నిపుణుడు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేయండి.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఆరోగ్యం
ఆహారం
మహిళలు
పురుషులు

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
Liver : మీలో లక్షణాలున్నాయా? అయితే.. కాలేయ సమస్య కావచ్చు!
Recommended image2
Liver Health: మీ లివర్ ని హెల్దీగా మార్చే కూరగాయలు ఇవి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved