MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Liver Health: మీ లివర్ ని హెల్దీగా మార్చే కూరగాయలు ఇవి..!

Liver Health: మీ లివర్ ని హెల్దీగా మార్చే కూరగాయలు ఇవి..!

మనం ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఆరోగ్యకరమైన ఆహారం కచ్చితంగా తీసుకోవాలి.ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయలు తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుందని మీకు తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 09 2025, 04:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే...
Image Credit : Getty

లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే...

కాలేయం శరీరంలో అతిపెద్ద అంతర్గత అవయవం. ఇది రక్తాన్ని ఫిల్టర్ చేయడం, పోషకాలు, వ్యర్థ పదార్థాలు, టాక్సిన్స్ ని బయటకు పంపడం వంటి పనులు చేస్తుంది. జీవక్రియ, జీర్ణక్రియ, రోగనిరోధక వ్యవస్థ పనితీరు పరంగా కూడా ఇది ముఖ్యమైన భాగంగా పనిచేస్తుంది.

ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ఫాలో అవ్వకపోయినా, మద్య పానం అలవాటు ఉన్నా, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకున్నా.. లివర్ దెబ్బతింటుంది. అయితే.. మనం తీసుకునే ఆహారంలో కొన్ని రకాల కూరగాయలను చేర్చడం వల్ల .. మన లివర్ ని సహజంగా డీటాక్స్ చేయవచ్చు. మరి, ఆ కూరగాయలు ఏంటో తెలుసుకుందామా...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఆకు కూరలు..
Image Credit : Getty

ఆకు కూరలు..

పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో క్లోరోఫిల్ సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో ఉన్న హానికర పదార్థాలను గ్రహించి కాలేయంపై పడే ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫైబర్, విటమిన్లు, ఖనిజాల పరంగా పోషకాలు ఎక్కువగా లభించడంతో, ఇవి శరీరానికి చాలా బాగా సహాయపడతాయి. బరువు నియంత్రణతో పాటు గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు వంటి వ్యాధుల అవకాశాన్ని తగ్గించడంలో సహకరిస్తాయి.

36
బ్రోకలీ..
Image Credit : Getty

బ్రోకలీ..

బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ లాంటి కూరగాయలు గ్లూటాథియోన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌ను అందిస్తాయి. ఇది శరీరం నుంచి హానికర పదార్థాలను తొలగించే శక్తివంతమైన ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. సల్ఫర్ సమ్మేళనాలు, విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉండటంతో ఇవి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బ్రోకలీ, కాలీఫ్లవర్‌లలో కలిగే కోలిన్ పదార్థం కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది.

46
వెల్లుల్లి
Image Credit : Getty

వెల్లుల్లి

వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు లివర్ లోని డిటాక్స్ ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్ ని బయటకు పంపే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. పచ్చివెల్లుల్లి ఉపయోగిస్తే ప్రయోజనం మరింత ఉంటుంది. వంటల్లో, పాస్తాల్లో, సూప్‌లలో వెల్లుల్లిని చేర్చడం ద్వారా కాలేయానికి మేలు కలుగుతుంది.

56
క్యారెట్
Image Credit : stockPhoto

క్యారెట్

క్యారెట్లు బీటా కెరోటిన్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో విటమిన్ A గా మారి కాలేయాన్ని రక్షించడంలో సహాయపడతాయి. క్యారెట్ రసం లేదా స్మూతీ రూపంలో తీసుకుంటే డిటాక్స్ ప్రక్రియ వేగవంతం అవుతుంది.

66
బీట్‌రూట్
Image Credit : Social Media

బీట్‌రూట్

బీట్‌రూట్ లో ఉండే బీటాలైన్లు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి కాలేయంలో డిటాక్స్ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. బీట్‌రూట్ జ్యూస్ లేదా సలాడ్‌లలో భాగంగా తీసుకోవడం ద్వారా శక్తివంతమైన డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. పర్యావరణంలోని హానికర పదార్థాలను శరీరం నుండి తొలగించడంలో బీట్‌రూట్ సహాయపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సిగరెట్ లేకుండా మల విసర్జన కావడం లేదా? కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
Recommended image2
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image3
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Related Stories
Recommended image1
Health tips: వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్ కంట్రోల్ కావడం పక్కా!
Recommended image2
Iron Rich Food: రక్తం తక్కువగా ఉందా? రోజూ తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved