MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • Diabetes Care: షుగర్ పేషెంట్స్ బీ అలర్ట్.. కాలి గాయాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..

Diabetes Care: షుగర్ పేషెంట్స్ బీ అలర్ట్.. కాలి గాయాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..

Foot Care Tips for Diabetes: వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటంతో డయాబెటిస్ ఉన్నవారికి పాదాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. వీటి వల్ల గాయాలు, చర్మ సమస్యలు తలెత్తవచ్చు. అందుకే ఈ వర్షాకాలంలో డయాబెటిక్ రోగులు ఈ జాగ్రత్తలు పాటించాలి:

2 Min read
Author : Rajesh K
Published : Jul 03 2025, 01:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 చిన్న నిర్లక్ష్యం   పెద్ద సమస్య
Image Credit : google

చిన్న నిర్లక్ష్యం- పెద్ద సమస్య

వర్షాకాలం ప్రారంభం కాగానే వాతావరణంలో తేమ పెరిగి, వ్యాధులు సోకే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి ఈ సీజన్ సవాలుతో కూడినదే. వర్షాకాలంలో రక్తంలో చక్కెర స్థాయిల్లో ఊహించని మార్పులు రావడం, ఇన్ఫెక్షన్లు, పాద గాయాలు, చర్మ సమస్యలు, మూత్ర సంబంధిత ఇబ్బందులు మొదలైనవీ ఎక్కువగా కనిపిస్తాయి. శరీర రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటంతో చిన్న గాయాలు కూడా పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. 

అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు ఈ కాలంలో తమ ఆహారం, జీవనశైలి, పాదాల శుభ్రత విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపాలి. ప్రతిరోజూ గ్లూకోజ్ స్థాయిలను చెక్ చేయడం, తేమ గల ప్రదేశాలు నివారించడం,  గాయాలు కాకుండా జాగ్రత్తలుతీసుకోవాలి. లేకపోతే చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యకు దారితీస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆరోగ్య సమస్యలు
Image Credit : Getty

ఆరోగ్య సమస్యలు

వర్షాకాలంలో డయాబెటిస్ పేషెంట్స్ తమ ఆరోగ్యం గురించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో వాతావరణ తేమ పెరగడం వల్ల ఫంగస్, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల పెరుగుదల వేగంగా జరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం..  డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల రోగాలు ఎక్కవగా వచ్చే అవకాశముంది. ముఖ్యంగా పాదాల్లో గాయాలు ఉంటే అవి త్వరగా వచ్చే ప్రమాదం ఉంటుంది, దీని వలన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

35
గ్లూకోజ్ స్థాయిపై ప్రభావం
Image Credit : Getty

గ్లూకోజ్ స్థాయిపై ప్రభావం

వర్షాకాలంలో డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయి ఊహించని మార్పులకు లోనయ్యే ప్రమాదం ఉంది. వాతావరణం తేమతో ఉండటంతో శరీరంపై ప్రభావం పడుతుంది, ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ కాలంలో వారు తమ బ్లడ్ షుగర్ లెవెల్‌ను నిరంతరం పరిశీలించుకోవాలి. అలాగే వైద్యుడు సూచించిన మందులను నిబంధనల ప్రకారం, సరిగ్గా సమయానికి తీసుకోవడం కీలకం.

ఆహార అలవాట్ల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా వర్షాకాలంలో  పండ్లు, తాజా కూరగాయలు, ప్రోటీన్లు, ఫైబర్, అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అధిక ఉప్పు, సరిగా ఉడకని పదార్థాలు, స్ట్రీట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.  

45
 జాగ్రత్తలు
Image Credit : Getty

జాగ్రత్తలు

వర్షాకాలంలో డయాబెటిస్ ఉన్నవారికి పాదాల సంరక్షణ కోసం పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు ఇవే:

చెప్పులు లేకుండా నడవడం మానుకోండి – తడిచిన నేలపై నడవడం వల్ల చిన్న గాయాలు జరగవచ్చు, ఇవి త్వరగా ఇన్ఫెక్షన్‌లకు దారితీస్తాయి.

కాళ్ళను శుభ్రంగా ఉంచుకోండి – బయటి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళను సబ్బుతో శుభ్రంగా కడుకోవాలి.  పూర్తిగా పొడిగా ఆరబెట్టాలి.

గోళ్ళ శుభ్రత – కాలి వేళ్ల గోళ్ళను క్రమం తప్పకుండా కత్తిరించి శుభ్రంగా ఉంచుకోవాలి, ఎందుకంటే గోళ్ళలో బ్యాక్టీరియా పెరిగే అవకాశముంది.

నాణ్యమైన చెప్పులు ధరించండి – పాదాలకు గాయాలు కాకుండా సౌకర్యవంతమైన చెప్పులను  ధరించాలి.  

తడి లేకుండా సాక్స్ ధరిచేయండి – పాదాలు పూర్తిగా ఆరిన తర్వాతే సాక్స్ ధరించాలి. తడి సాక్స్ వల్ల ఫంగస్ రావొచ్చు.  

55
ముందస్తు జాగ్రత్తలు
Image Credit : Getty

ముందస్తు జాగ్రత్తలు

వర్షాకాలంలో డయాబెటిస్ ఉన్నవారు పాటించాల్సిన మరికొన్ని కీలక ఆరోగ్య సూచనలు ఇవే:

హైడ్రేషన్: తేమతో కూడిన వాతావరణం ఉన్నా శరీరం నీటి కొరతకు లోనవ్వకూడదు. అందుకే తగినంత నీరు తాగాలి. ఆకుకూరల రసం, నిమ్మరసం వంటి ఆరోగ్యకరమైన పానీయాలు కూడా తీసుకోవాలి.

వ్యాయామం: ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేయడం అలవాటుగా మార్చుకోవాలి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచి, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

చెకప్: ప్రతి మూడు నెలలకు ఒకసారి HbA1c సహా డయాబెటిస్ టెస్టులు చేయించుకోవడం చాలా అవసరం. ఇలా చేయడం వల్ల డయాబెటిస్ స్థాయిని అంచనా వేసి, అవసరమైన మార్పులు చేసుకోవచ్చు.

పాదాల పరిశీలన: వర్షాకాలంలో రోజూ పాదాలను తనిఖీ చేయాలి. పాదాల్లో రక్త ప్రసరణ తక్కువగా ఉన్నప్పుడు చర్మం రంగు మార్పులు, అలర్జీలు, గాయాలు వంటి సమస్యలు కనిపించవచ్చు.కాబట్టి ప్రారంభ దశలోనే గుర్తించడం అవసరం.

ఈ సూచనలు పాటించడం ద్వారా వర్షాకాలంలో డయాబెటిక్ ఫుట్ ఇన్ఫెక్షన్లు నుంచి రక్షణ పొందవచ్చు.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఆరోగ్యం
ఆహారం
మహిళలు
పురుషులు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
Diabetes Symptoms: ఈ లక్షణాలు కనిపిస్తే షుగర్ వచ్చినట్లేనా?
Recommended image2
Diabetes: పరగడుపున ఈ సూపర్ ఫుడ్స్‌ తింటే.. షుగర్ ఇట్టే తగ్గుతుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved