Diabetes Symptoms: ఈ లక్షణాలు కనిపిస్తే షుగర్ వచ్చినట్లేనా?
health-life Jun 12 2025
Author: Rajesh K Image Credits:Asianet News
Telugu
నల్లటి మచ్చలు
మెడ లేదా చంకలలో నల్లటి మచ్చలు కనిపిస్తే డయాబెటిస్ కావచ్చు. ఈ పరిస్థితిని అకాంథోసిస్ నైగ్రికన్స్ అంటారు. ఇవి సాధారణంగా ప్రీ-డయాబెటిక్ లేదా టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారిలో కనిపిస్తాయి.
Image credits: Getty
Telugu
రాత్రి భోజనం తర్వాత ఆకలి
కడుపు నిండుగా తిన్నతర్వాత కూడా మళ్లీ ఏదైనా తినాలనే కోరిక కలుగడం డయాబెటిస్ లక్షణం కావచ్చు. దీనిని డయాబెటిక్ హైపర్‌ఫేజియా లేదా పాలీఫేజియా అని కూడా అంటారు.
Image credits: Getty
Telugu
పొడిబారిన చర్మం
పొడి చర్మం, నల్లటి మచ్చలు రావడం డయాబెటిస్ లక్షణాలు కావచ్చు. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడం వల్ల చర్మం పొడిబారి, దురద, కొన్నిసార్లు నల్లటి మచ్చలు ఏర్పడవచ్చు.
Image credits: Getty
Telugu
చూపు మందగించడం
ఉదయం లేచినప్పుడు చూపు మసకబారినట్లు అనిపించడం లేదా వస్తువులు స్పష్టంగా కనిపించకపోవడం డయాబెటిస్ లక్షణం కావొచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల ఈ మార్పులు సంభవిస్తాయి.
Image credits: Getty
Telugu
బరువు తగ్గడం
ఏ కారణం లేకుండా బరువు తగ్గడం డయాబెటిస్ లక్షణం కావచ్చు.
Image credits: Getty
Telugu
అతిగా ఆకలి, దాహం
అతిగా ఆకలి, దాహం, అతిగా మూత్ర విసర్జన కూడా డయాబెటిస్ లక్షణాలు కావచ్చు.
Image credits: Getty
Telugu
అలసట, నీరసం
అలసట, నీరసం, చేతులు, కాళ్ళు మొద్దుబారడం, నొప్పి కూడా డయాబెటిస్ లక్షణం కావచ్చు.
Image credits: Getty
Telugu
జాగ్రత్త:
పైన చెప్పిన లక్షణాలు ఉంటే, స్వయంగా వ్యాధి నిర్ధారణ చేసుకోకుండా డాక్టర్ ని సంప్రదించండి. వారి సలహా తర్వాత మాత్రమే వ్యాధి నిర్ధారణ చేసుకోండి.