MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Health
  • High Uric Acid Level: కాకరకాయతో యూరిక్ యాసిడ్‌ కు చెక్ పెట్టండిలా..

High Uric Acid Level: కాకరకాయతో యూరిక్ యాసిడ్‌ కు చెక్ పెట్టండిలా..

Uric Acid: యూరిక్ యాసిడ్ పేరుకుపోయి కీళ్లు, కిడ్నీలలో స్ఫటికాలుగా మారినప్పుడు ఇబ్బందులు మొదలవుతాయి. మన పెరటిలో లభించే  కాకరకాయతో ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి కాకరకాయని ఎప్పుడు?  ఎలా తినాలో తెలుసుకుందాం.

2 Min read
Author : Rajesh K
Published : Jul 09 2025, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యూరిక్ యాసిడ్ – పెరిగితే కలిగే ప్రమాదమే!
Image Credit : Getty

యూరిక్ యాసిడ్ – పెరిగితే కలిగే ప్రమాదమే!

యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో ప్యూరిన్ అనే పదార్థం విచ్ఛిన్నమవడం ద్వారా ఏర్పడే సహజ వ్యర్థ పదార్థం. సాధారణంగా ఇది రక్తం ద్వారా మూత్రపిండాలకు చేరి మూత్రం ద్వారా బయటకు వెళ్తుంది. అయితే శరీరం దీనిని సమర్థవంతంగా బయటకు పంపలేకపోతే, యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగిపోతుంది.

యూరిక్ యాసిడ్ స్థాయి అధికమైతే.. కీళ్ల నొప్పులు (గౌట్), కిడ్నీలో రాళ్లు, బిపి (హై బ్లడ్ ప్రెషర్), గుండె సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయి. ప్రస్తుతం జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిలో ఈ సమస్య తలెత్తుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ స్థాయిని సరైన సమయంలో గుర్తించి, నియంత్రించడం అత్యంత అవసరం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 కాకరకాయతో యూరిక్ యాసిడ్‌ కు చెక్
Image Credit : Getty

కాకరకాయతో యూరిక్ యాసిడ్‌ కు చెక్

యూరిక్ యాసిడ్ సాధారణంగా మూత్రం ద్వారా శరీరం నుండి బయటకు వెళుతుంది. కానీ, ఇది సమర్థవంతంగా బయటకు వెళ్లకపోతే, రక్తంలో దాని స్థాయి పెరిగుతుంది. యూరిక్ యాసిడ్ కీళ్ల మధ్య చేరి నొప్పి, వాపు కలిగిస్తుంది. ముఖ్యంగా పాదాల, మోకాళ్ల, వేళ్ళ కీళ్లలో తీవ్ర నొప్పి కలుగుతుంది. దీనివల్ల కూర్చోవడం, లేవడం వంటి సాధారణ పనులూ కష్టంగా మారతాయి. దీన్ని గౌట్ (Gout) అంటారు. దీని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన కీళ్ల సమస్యగా మారుతుంది

Related Articles

Related image1
Uric Acid Relief: యూరిక్ యాసిడ్‌ను తగ్గించే అద్భుత పండు ఇదే
Related image2
Uric Acid Symptoms: రాత్రివేళ పాదాల్లో నొప్పా? ఆ వ్యాధి కావొచ్చు..
35
అద్భుతమైన ఔషధం
Image Credit : Getty

అద్భుతమైన ఔషధం

ఇలాంటి పరిస్థితుల్లో యూరిక్ యాసిడ్ నియంత్రణ కోసం ప్రకృతి మనకు అందించిన అద్భుతమైన ఔషధం  కాకరకాయ. ఇది కేవలం రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు, యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

రోజూ ఖాళీ కడుపుతో ఒక గ్లాసు కాకరకాయ రసం తీసుకోవడం ద్వారా శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లే ప్రక్రియ వేగవంతమవుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఆంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మూత్రపిండాల పనితీరును మెరుగుపరచి, యూరిక్ యాసిడ్‌ను సహజంగా తొలగించడంలో సహాయపడతాయి. 

45
 కాకరకాయతో చెక్
Image Credit : Getty

కాకరకాయతో చెక్

కాకరకాయలో ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా   మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, కాల్షియం, బీటా కెరోటిన్, విటమిన్ సి లాంటి మినరల్స్‌, విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరక శక్తిని మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

కాకరకాయ జ్యూస్‌ డయాబెటిస్ ఉన్నవారికి ఓ వరం.  ఇందులో ఉండే విటమిన్ A, విటమిన్ C, బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు రక్తంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడంలో, ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచడంలో కీలకంగా పనిచేస్తాయి. రోజూ పరిమిత మోతాదులో కాకరకాయ రసం తాగడం ద్వారా డయాబెటిస్‌తో పాటు యూరిక్ యాసిడ్ లాంటి సమస్యలను నియంత్రించవచ్చు. 

55
యూరిక్ యాసిడ్ తగ్గించడానికి కాకరకాయని ఎలా తినాలి?
Image Credit : Getty

యూరిక్ యాసిడ్ తగ్గించడానికి కాకరకాయని ఎలా తినాలి?

యూరిక్ యాసిడ్ నియంత్రణ కోసం...  ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో అరకప్పు కాకరకాయ జ్యూస్ తాగడం చాలా మంచిది. దీనిలోని సహజ ఔషధ గుణాలు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించి, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

చేదు తగ్గించాలంటే: కాకరకాయ రసంలో కొద్దిగా ఉప్పు లేదా నిమ్మరసం కలిపితే.. రుచి మారుతుంది. అంతే కాకుండా శోషణను కూడా సులభతరం చేస్తుంది.

ఇంకా ఎలా తీసుకోవచ్చు? 

  • కాకరకాయను సాధారణంగా కూరలుగా వండుకుని తీసుకోవచ్చు.
  • వేపుడు చేయకుండా తక్కువ నూనెతో వండటం మంచిది.

గమనిక: కాకరకాయ ఆరోగ్యానికి మంచిదే అయినా, మీకు డయాబెటిస్ లేదా యూరిక్ యాసిడ్ సమస్యలు ఉంటే, డాక్టర్ సలహాతో మోతాదును నిర్ణయించుకోవాలి. ప్రత్యేకించి మందులు తీసుకుంటున్నవారు జాగ్రత్తగా ఉండాలి.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
ఆహారం
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
మహిళలు
పురుషులు

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
Uric Acid Relief: యూరిక్ యాసిడ్‌ను తగ్గించే అద్భుత పండు ఇదే
Recommended image2
Uric Acid Symptoms: రాత్రివేళ పాదాల్లో నొప్పా? ఆ వ్యాధి కావొచ్చు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved