MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Pomegranate Peel: దానిమ్మ తొక్కను ఇలా వాడితే ఎన్ని లాభాలో తెలుసా?

Pomegranate Peel: దానిమ్మ తొక్కను ఇలా వాడితే ఎన్ని లాభాలో తెలుసా?

దానిమ్మ.. ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. అయితే దానిమ్మ పండే కాదు.. దాని తొక్క కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందట. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన దానిమ్మ తొక్కను ఎలా వాడితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందో ఇక్కడ చూద్దాం.   

2 Min read
Author : Kavitha G
Published : Jul 08 2025, 02:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Health Benefits of Pomegranate Peel
Image Credit : Pinterest

Health Benefits of Pomegranate Peel

నిపుణుల ప్రకారం.. దానిమ్మ తొక్క చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలు దెబ్బతినడాన్ని నివారిస్తాయి. విటమిన్ సి కణాల పునరుత్పత్తికి సహాయపడుతుంది. మచ్చలు, గాయాలను నయం చేస్తుంది. ఈ తొక్కలను ఫేస్ ప్యాక్ గా వాడితే మొటిమలు, నల్ల మచ్చలు ఈజీగా తగ్గుతాయి. ఇది సహజ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కొల్లాజెన్ ఉత్పత్తికి..
Image Credit : Pinterest

కొల్లాజెన్ ఉత్పత్తికి..

దానిమ్మ తొక్కలోని యాంటీఆక్సిడెంట్లు చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. అంతేకాదు ముందస్తుగా వచ్చే ముడతలను నివారించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. దానిమ్మ తొక్కలో పాలీఫెనాల్స్ అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

దానిమ్మ తొక్కలను టీ లేదా కషాయంగా తయారు చేసుకొని తాగడం ద్వారా గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులోని యాంటీ బాక్టీరియల్ గుణాలు బాక్టీరియా, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.  

35
లివర్ ఆరోగ్యానికి..
Image Credit : Pinterest

లివర్ ఆరోగ్యానికి..

దానిమ్మ తొక్కలో లివర్ ని శుభ్రపరిచే గుణాలు ఉన్నాయి. అంతేకాదు ఇందులోని ఖనిజాలు, ఇతర సమ్మేళనాలు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ తొక్కతో చేసిన టీ రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. అంతేకాదు ఈ తొక్కలో ప్యూనికలగిన్ అనే పాలీఫెనాల్ ఉంది. ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కడుపు, నోరు, రొమ్ము క్యాన్సర్ కణాల వ్యాప్తిని నియంత్రిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 

దానిమ్మ తొక్కలోని యాంటీఆక్సిడెంట్లు మెదడులోని లోపాలను తగ్గించడానికి, అల్జీమర్స్ వంటి మతిమరుపు వ్యాధులను నివారించడానికి సహాయపడతాయి.

45
బరువు తగ్గడానికి..
Image Credit : Pinterest

బరువు తగ్గడానికి..

దానిమ్మ తొక్కలో  ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. దానిమ్మ తొక్కను ఎండలో బాగా ఆరబెట్టి, పొడి చేసి, ఉప్పు, మిరియాలు కలిపి పళ్లు తోముకుంటే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. 

దానిమ్మ తొక్కను బాగా శుభ్రం చేసి, ఆరబెట్టి పొడి చేసి టీ, కషాయం, ఫేస్ ప్యాక్ వంటి వివిధ మార్గాల్లో ఉపయోగించవచ్చు.

55
ఇవి గుర్తుంచుకోండి!
Image Credit : Pinterest

ఇవి గుర్తుంచుకోండి!

దానిమ్మ తొక్కను ఆరబెట్టి పొడి చేసి, గాజు సీసాలో నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఉపయోగించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సిగరెట్ లేకుండా మల విసర్జన కావడం లేదా? కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
Recommended image2
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image3
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Related Stories
Recommended image1
Beauty tips: వయసు పెరిగినా అందంగా కనిపించాలంటే ఈ బ్యూటీ ప్రోడక్టులు ట్రై చేయాల్సిందే!
Recommended image2
Beuty tips: నిమ్మ తొక్కను ఇలా వాడితే ముఖం చిటికెలో మెరిసిపోతుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved