- Home
- Technology
- Tips
- Beauty tips: వయసు పెరిగినా అందంగా కనిపించాలంటే ఈ బ్యూటీ ప్రోడక్టులు ట్రై చేయాల్సిందే!
Beauty tips: వయసు పెరిగినా అందంగా కనిపించాలంటే ఈ బ్యూటీ ప్రోడక్టులు ట్రై చేయాల్సిందే!
వయసు పెరుగుతున్నకొద్దీ చర్మంపై ముడతలు రావడం, కాంతిహీనంగా మారడం సహజం. అయితే క్రమం తప్పకుండా కొన్ని బ్యూటీ ప్రోడక్టులను ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. అవేంటో.. ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.

సన్ స్క్రీన్
ఏ సీజన్ అయినా చర్మానికి సన్‌స్క్రీన్ రాసుకోవడం మర్చిపోవద్దు. 30 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి సన్‌స్క్రీన్ ఉపయోగించడం మంచిది. అది ముఖంపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. సూర్యకిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవడానికి సహాయపడుతుంది.
విటమిన్ సి సీరం..
సన్‌స్క్రీన్‌తో పాటు విటమిన్ సి సీరం కూడా ఉపయోగించవచ్చు. దీన్ని ప్రతిరోజూ ఉపయోగించడం ద్వారా ముఖంపై మచ్చలు తగ్గిపోతాయి. అయితే దీన్ని ఉపయోగించే ముందు.. ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత, మాయిశ్చరైజర్ రాసుకునే ముందు 2-3 చుక్కల సీరం రాసుకోవాలి.
నైట్ క్రీమ్..
చాలామంది పగటిపూట ముఖానికి క్రీములు రాసుకుంటారు. కానీ చర్మ సమస్యలను తగ్గించడానికి రాత్రిపూట నైట్ క్రీమ్ లు రాసుకోవడం మంచిది. నైట్ క్రీమ్ రాసుకుంటే అది చర్మంపై చల్లని ప్రభావాన్ని చూపుతుంది.
హైలురోనిక్ యాసిడ్ ఉన్న మాయిశ్చరైజర్..
వయసు పెరిగేకొద్దీ చర్మ సంరక్షణ ఉత్పత్తులను మార్చుకోవడం అవసరం. 30 ఏళ్లు దాటిన తర్వాత హైలురోనిక్ యాసిడ్ ఉన్న మాయిశ్చరైజర్‌ను ఉపయోగిస్తే చర్మం మరింత కాంతివంతంగా కనిపిస్తుంది.
డార్క్ సర్కిల్స్..
30 ఏళ్లు దాటిన తర్వాత కళ్ల కింద నల్లటి వలయాలు కనిపించడం ప్రారంభమవుతుంది. దానివల్ల ముఖం అందం తగ్గిపోతుంది. కాబట్టి కళ్లకు ప్రతిరోజూ కంటి క్రీమ్ ఉపయోగించడం మంచిది. ఇది మీ చర్మాన్ని నల్లటి వలయాలు, చిన్న చిన్న గీతలు, వాపు నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.