Beuty tips: నిమ్మ తొక్కను ఇలా వాడితే ముఖం చిటికెలో మెరిసిపోతుంది!
నిమ్మకాయలే కాదు.. వాటి తొక్కలతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మ తొక్కల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
నిమ్మ తొక్క ప్రయోజనాలు
నిమ్మ తొక్కలు చర్మ ఆరోగ్యానికి మంచి ఔషధంలా పనిచేస్తాయి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన నిమ్మ తొక్కలు.. చర్మాన్ని కాంతివంతం చేసే అనేక గుణాలను కలిగి ఉన్నాయి. ఇవి చర్మ సంరక్షణకు చక్కగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. మరి నిమ్మతొక్కలను ఎలా వాడితే మంచి ఫలితాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం.
కాంతివంతమైన చర్మం
నిమ్మ తొక్కలలోని సిట్రిక్ యాసిడ్ చర్మ కాంతిని పెంచడానికి సహాయపడుతుంది. మృత కణాలను తొలగిస్తుంది. చర్మ రంగును మెరుగుపరుస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
మొటిమలు, మచ్చలు మాయం
నిమ్మ తొక్కల్లో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమలు, మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మాన్నిలోపలి నుంచి శుభ్రం చేస్తాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
చర్మంపై ముడతల తగ్గుదలకు..
నిమ్మ తొక్కలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. ఇవి చర్మం దెబ్బతినకుండా కాపాడుతాయి. ముడతలను తగ్గిస్తాయి. యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
మృదువైన చర్మం
నిమ్మ తొక్కలను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారడం వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.
నిమ్మ తొక్కను ఉపయోగించే విధానం:
నిమ్మ తొక్కల పొడి:
నిమ్మ తొక్కను ఎండబెట్టి.. పొడిగా చేసి, స్కిన్ స్కేర్ ప్రోడక్టుల్లో వాడచ్చు. లేదా నేరుగా ఫేస్ ప్యాకుల్లో ఉపయోగించవచ్చు.
నిమ్మ తొక్కల పేస్ట్:
నిమ్మ తొక్కలను మెత్తగా రుబ్బి, పెరుగు లేదా తేనెతో కలిపి ఫేస్ ప్యాక్‌గా వాడచ్చు.
నిమ్మ తొక్కల నీరు:
నిమ్మ తొక్కలను నీటిలో వేసి మరిగించి.. తర్వాత ఆ నీటిని చర్మంపై టోనర్‌గా వాడచ్చు.
గమనిక:
సున్నితమైన చర్మం ఉన్నవారికి నిమ్మ తొక్కలు పడకపోవచ్చు. కాబట్టి ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.