MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Traditional Indian Food: సంప్రదాయ ఆహారంతోనే ఆరోగ్యం.. వీటిని రోజూ తింటే ఎన్నో లాభాలు..

Traditional Indian Food: సంప్రదాయ ఆహారంతోనే ఆరోగ్యం.. వీటిని రోజూ తింటే ఎన్నో లాభాలు..

Traditional Indian Food: మన పూర్వీకుల ఆహారపు అలవాట్ల వైపు మళ్ళీ మనం ఆకర్షితులవుతున్నాం. ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి,  ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ఈ  పురాతన వంటకాలను వారి డైట్ లో భాగం చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ ఆహారపదార్థాలేంటీ ?  

3 Min read
Rajesh K
Published : Jul 05 2025, 09:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
 చిరుధాన్యాలు
Image Credit : stockPhoto

చిరుధాన్యాలు

ఒకప్పుడు పేదవారి ఆహారంగా భావించబడిన చిరుధాన్యాలను ఇప్పుడు ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తున్నారు. అందుకే చాలా మంది తమ డైట్ లో చిరు ధాన్యాలను భాగం చేసుకుంటున్నారు. వీటిని  'కొత్త బంగారు ధాన్యాలు' (New Golden Grains) అనే పేరుతో ప్రాచుర్యంలోకి తీసుకవస్తున్నారు. గోధుమ, వరితో పోలిస్తే చిరుధాన్యాల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. 

ఇందులో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అలాగే, వీటిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (Low Glycemic Index) కలిగి ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారికి  చిరుధాన్యాలు బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు.  

చిరుధాన్యాల్లో ప్రోటీన్, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీర బలాన్ని, ఎముకల ఆరోగ్యాన్ని,  రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడతాయి. అందుకే, గోధుమ, వరిపై మాత్రమే ఆధారపడకుండా, చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. 

26
నెయ్యి
Image Credit : stockPhoto

నెయ్యి

ఒకప్పుడు నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందనీ దూరం పెట్టే వారు. కానీ, ఇప్పుడు ఆరోగ్యకర ఆహారంగా తమ డైట్ లో భాగం చేసుకుంటున్నారు. నెయ్యిలో విటమిన్ A, D, E, K లాంటి ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్ల ఆరోగ్యం (A), ఎముకల బలం (D), చర్మ సంరక్షణ (E),  రక్తం గడ్డకట్టే ప్రక్రియ (K)కు ఎంతగానో ఉపయోగపడుతుంది.  

అలాగే.. నెయ్యి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో ఉండే మోనోశాచురేటెడ్,  పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ మెదడు అభివృద్ధికి, నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అదనంగా, నెయ్యి ఎముకలను బలపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. సరిగ్గా, మితంగా తీసుకుంటే, నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 

Related Articles

Related image1
Iron Rich Food: రక్తం తక్కువగా ఉందా? రోజూ తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్!
Related image2
Street Food: స్ట్రీట్‌ ఫుడ్ తింటున్నారా? ఎంత డేంజరో తెలుసా?
36
కొబ్బరి నూనె
Image Credit : stockPhoto

కొబ్బరి నూనె

ఒకప్పుడు వంటలలో దూరంగా పెట్టిన కొబ్బరి నూనెను ఇప్పుడు ఆరోగ్య పరమైన నూనెగా పరిగణిస్తారు. ఈ నూనెలో అధికంగా సంతృప్త కొవ్వులు (Saturated Fats) ఉంటాయనే కారణంతో ఆరోగ్యానికి హానికరం అనే భావన ఉండేది. కానీ, పరిశోధనల ప్రకారం.. కొబ్బరి నూనెలో ఉండే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MCTs) శరీరంలో తక్షణ శక్తిని ఇస్తుంది. నిలువున్న కొవ్వును తగ్గించి బరువు తగ్గడంలో సహాయపడతాయి.

అలాగే ఈ నూనె చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచడంలో సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరచడంలో, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలతో శరీరాన్ని రక్షించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అంతేకాక, జుట్టు,  చర్మ ఆరోగ్యానికి కూడా కొబ్బరి నూనె ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆయిల్‌ను మితంగా, సరిగ్గా వాడితే జీవనశైలిలో గణనీయమైన మార్పును తీసుకురాగలదు.

46
 పసుపు
Image Credit : stockPhoto

పసుపు

పసుపు.. కేవలం ఒక మసాలా మాత్రమే కాదు, ఇదొక శక్తివంతమైన ఔషధ మూలిక. ఇందులో ఉండే కర్కుమిన్ (Curcumin) అనేది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ,  యాంటీఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉండి, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించే శక్తిని కలిగి ఉంటుంది. రోజూ పసుపును పాలు లేదా నీటిలో కలిపి తాగితే శరీరం శుభ్రంగా ఉండి, ఆరోగ్యం మెరుగవుతుంది. 

56
 వేపాకు
Image Credit : stockPhoto

వేపాకు

వేపాకు చేదుగా ఉన్నప్పటికీ, దానిలో దాగి ఉన్న ఔషధ గుణాలు ఎన్నో. ఇది సహజంగా రక్తాన్ని శుద్ధి చేయడంలో, చర్మవ్యాధుల నివారణలో, క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది.  మొటిమలు, దురద, తామర వంటి సమస్యలకు వేపాకు ఉత్తమ సహాయకారి. 

డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా వేపాకు దోహదపడుతుంది. వేపాకు క్రిమిసంహారిణి.. ఇంట్లోకి కీటకాలు రాకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. వేప నూనె, వేప పొడి వంటి రూపాల్లో లభ్యమవుతుంది. సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో వేప కు ప్రత్యేక స్థానముంది.

66
తులసి
Image Credit : stockPhoto

తులసి

తులసి కేవలం పవిత్ర మొక్క మాత్రమే కాదు, శక్తివంతమైన ఔషధ మూలిక. దీనిని 'మూలికల రాణి'గా పిలుస్తారు. ఇది జలుబు, జ్వరం, దగ్గు, ఆస్తమా వంటి సమస్యల నుండి క్యాన్సర్ వంటి రుగ్మతల వరకూ ఉపశమనం కలిగించగలదు. తులసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఉత్తేజంగా ఉంచుతాయి. రోజూ తులసి ఆకులు తినడం లేదా తులసి టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఆహారం
ఏషియానెట్ న్యూస్
ఆరోగ్యం
మహిళలు
పురుషులు

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved