ఖర్జూరాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను తగ్గించి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఖర్జూరాల్లో ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు, ఫినోలిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ఖర్జూరాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఖర్జూరాల్లో కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచి, ఆస్టియోపొరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
విటమిన్ సి, డి పుష్కలంగా ఉండే ఖర్జూరాలు.. శరీరంలో ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఖర్జూరాలు ఐరన్‌కు మంచి మూలం. ఇవి రక్తహీనతను నివారిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఖర్జూరాలు తినడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
Kids Health: పిల్లల మెమరీ పవర్ పెంచే 7 సూపర్ ఫుడ్స్ ఇవే!
Green Apple: గ్రీన్ ఆపిల్ తినడం వల్ల కలిగే 6 లాభాలు ఇవే!
బరువు తగ్గాలి అనుకునేవారు తప్పకుండా తాగాల్సిన జ్యూస్‌లు ఇవే!
అవిసె గింజలు తింటే కలిగే 6 అద్భుతమైన ప్రయోజనాలు ఇవే!