Street Food: స్ట్రీట్ ఫుడ్ తింటున్నారా? ఎంత డేంజరో తెలుసా?
Street Food: రోడ్డు పక్కన ఉండే చిన్న చిన్న స్టాళ్లలో లభించే బజ్జీలు, స్నాక్స్ బలే రుచిగా ఉంటాయి కాదా. ఇక సువాసనతో ముక్కుపుటాలు అదిరిపోవాల్సిందే. ఇలాంటి ఫుడ్ ను చూస్తే.. ఎవరూ కూడా నిగ్రహంగా ఉండలేరు. మనకే తెలియకుండ అడుగులు వాటి వైపు పడిపోతుంటాయి. అయితే రోడ్డుపక్కన దొరికే ఈ చిరుతిళ్లు ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కావు. వాటి తయారీలో పరిశుభ్రత, నాణ్యత లోపం కొట్టొంచినట్టు కనిపిస్తుంది. ఈ తరుణంలో అత్యంత కలుషితమైన స్ట్రీట్ ఫుడ్ లభించే టాప్ 10 దేశాల జాబితా మీ కోసం..

స్ట్రీట్ ఫుడ్
స్ట్రీట్ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టమే. కానీ, అన్ని దేశాలలో రుచికరమైన, ఆరోగ్యకరమైన స్ట్రీట్ ఫుడ్ దొరకదు. కొన్ని దేశాలలో స్ట్రీట్ ఫుడ్ చాలా కలుషితంగా ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్ తినడంలో నంబర్ 1 గా ఉన్న భారతదేశంలోనే.. అత్యంత కలుషితమైన స్ట్రీట్ ఫుడ్ అందించే దేశం అని మీకు తెలుసా?
ఇండియన్ స్ట్రీట్ ఫుడ్
భారతదేశం: స్ట్రీట్ ఫుడ్ కల్చర్ కు ఫేమస్ భారత్. జనసాంద్రత, పరిమిత మౌలిక సదుపాయాల కారణంగా పరిశుభ్రత సమస్యలు ఏర్పడుతాయి. ఇది కాలుష్య ప్రమాదాలకు దారితీస్తుంది. ఇక్కడ కొన్ని చోట్ల ప్రజలు చాలా స్ట్రీట్ ఫుడ్ ను తయారు చేసున్నారంట.
బంగ్లాదేశ్ స్ట్రీట్ ఫుడ్
బంగ్లాదేశ్: ఆహారం రుచికరంగా ఉన్నప్పటికీ, నీటి నాణ్యత, పారిశుధ్య నిర్వహణ లోపాల కారణంగా బంగ్లాదేశ్ డర్టీయేస్ట్ స్ట్రీట్ ఫుడ్ జాబితాలో రెండవ స్థానంలో ఉంది.
ఈజిప్ట్ స్ట్రీట్ ఫుడ్
ఈజిప్ట్: కోషారి వంటి ప్రసిద్ధ వంటకాలను ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు, కానీ తాజా పదార్థాలు, పరిశుభ్రత లేకపోవడం వల్ల ఇక్కడి ఫుడ్ డర్టీయేస్ట్ స్ట్రీట్ ఫుడ్ జాబితాలో మూడవ స్థానంలో ఉంది.
పాకిస్తాన్: చాట్, సమోసా వంటి తినుబండారాలకు ప్రసిద్ధి చెందింది, కానీ పరిశుభ్రతపై దృష్టి పెట్టరు. అంతేకాక ఇక్కడ నీటి సరఫరా కూడా సరిగా ఉండదు.
నైజీరియా: సూయ వంటి ప్రసిద్ధ వీధి ఆహారం దొరుకుతున్నప్పటికీ, ఆహార నిర్వహణ, పరిసరాల కాలుష్యం కారణంగా ఈ దేశం డర్టీయేస్ట్ స్ట్రీట్ ఫుడ్ జాబితాలో ఐదవ స్థానంలో ఉంది.
ఇండోనేషియా: సాటే, నాసి గోరెంగ్ వంటి వంటకాలకు ప్రసిద్ధి చెందిన ఇండోనేషియాలో అపరిశుభ్రమైన వంట ప్రదేశాలు, కలుషిత నీటి వాడకం ఎక్కువగా ఉంటాయి.
ఫిలిప్పీన్స్: బలూట్ వంటి వీధి ఆహారాలకు ప్రసిద్ధి చెందిన ఫిలిప్పీన్స్‌లో కూడా ఆహార పరిశుభ్రత, ఆహార నిల్వ సరిగా ఉండవు. అంతేకాకుండా శుభ్రత కూడా సరిగా ఉండదు.
థాయిలాండ్: జనసాంద్రత కలిగిన ఆహార మార్కెట్‌లకు ప్రసిద్ధి చెందిన థాయిలాండ్‌లో పరిశుభ్రత లోపాలున్నాయనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి.
హైతీ: గ్రియోట్ వంటి వీధి ఆహారం ప్రసిద్ధి చెందింది, కానీ శుద్ధ నీరు, పరిశుభ్రమైన మౌలిక సదుపాయాల కొరత కారణంగా ఆహారం తినడానికి భయపడుతారు.
మెక్సికో: చెత్త వీధి ఆహార జాబితాలో 10వ స్థానంలో ఉంది. మెక్సికో. టాకోలు, టమేల్‌లకు ప్రసిద్ధి చెందిన ఈ దేశంలో శుభ్రమైన వంట ప్రదేశాలు లేవు.