MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Health
  • Cinnamon Tea: రోజూ దాల్చిన చెక్క టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

Cinnamon Tea: రోజూ దాల్చిన చెక్క టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

Cinnamon Tea Benefits: దాల్చిన చెక్క కేవలం ఒక మసాలా దినుసు మాత్రమే కాదు. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అలాంటి దాల్చిన చెక్కతో తయారుచేసిన టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ పోస్ట్‌లో వివరంగా చూద్దాం. 

2 Min read
Author : Rajesh K
Published : Jul 02 2025, 10:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
దాల్చిన చెక్క టీ
Image Credit : stockPhoto

దాల్చిన చెక్క టీ

భారతీయ వంటల్లో తరచుగా ఉపయోగించే దాల్చిన చెక్క, ఆహార రుచిని పెంపొందించడమే కాకుండా అనేక ఔషధ గుణాలు కలిగి ఉంది. శతాబ్దాలుగా ఇది ఆయుర్వేదంలోనూ, సాంప్రదాయ చికిత్సా పద్ధతుల్లోనూ వాడుతున్నారు. ఇలాంటి ఔషధ గుణాలున్న దాల్చిన చెక్కతో తయారైన టీ తాగడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అవేంటో తెలుసుకుందాం.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు
Image Credit : stockPhoto

షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు

షుగర్ వ్యాధిగ్రస్తులకు దాల్చిన చెక్క టీ ఓ వరం అని చెప్పాలి. ఇది షుగర్ ను సహజంగా నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రధానంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు దాల్చిన చెక్క టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెరను గ్రహించి దాని స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.

Related Articles

Related image1
Cinnamon Water: రోజూ పరగడుపున దాల్చిన చెక్క నీరు తాగితే ఏమౌతుంది?
Related image2
Street Food: స్ట్రీట్‌ ఫుడ్ తింటున్నారా? ఎంత డేంజరో తెలుసా?
36
శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
Image Credit : stockPhoto

శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్

యాంటీఆక్సిడెంట్లు, యాంటీబాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలతో నిండిన దాల్చిన చెక్క టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతూ, జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లకు రక్షణ కల్పిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, అజీర్తి, గ్యాస్, ఉబ్బరం తగ్గించి, జీవక్రియను వేగవంతం చేసి బరువు తగ్గడానికీ సహాయపడుతుంది.

46
 గుండె ఆరోగ్యం
Image Credit : stockPhoto

గుండె ఆరోగ్యం

దాల్చిన చెక్క టీ తాగడం వలన చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గి, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది. దీంతో రక్తనాళాలు బలపడి, గుండెకు రక్షణ కలుగుతుంది. ఇది రక్తనాళాలను బలపరస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచి గుండెజబ్బుల, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే, మహిళల్లో నెలసరి సమయంలో కలిగే కడుపు నొప్పి, కండరాల వేదన, వికారం, వాంతులు వంటి సమస్యలను తగ్గించడంలో దాల్చిన చెక్క టీ ఎంతగానో సహాయపడుతుంది.

56
దాల్చిన చెక్క టీ తయారీ విధానం
Image Credit : stockPhoto

దాల్చిన చెక్క టీ తయారీ విధానం

దాల్చిన చెక్కలో ఉండే అలెర్జీ నిరోధక లక్షణాలు, గర్భాశయ చుట్టూ ఉన్న కండరాలను సడలించడంలో సహాయపడతాయి. దీంతో నెలసరి నొప్పులు, వికారం, కండరాల వేదన తగ్గుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. 

తయారీ విధానం: ఒక పాత్రలో ఒక కప్పు నీరు తీసుకోండి. అందులో ఒక దాల్చిన చెక్క కర్ర లేదా అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి 5–10 నిమిషాలు మరిగించండి. చల్లారిన తర్వాత వడకట్టి, ఒక టీస్పూన్ తేనె లేదా కొద్దిగా నిమ్మరసం కలిపి తాగండి. 

  • షుగర్ ఉన్నవారు తేనె, బెల్లం, పంచదార కలపకుండా నిమ్మరసం మాత్రమే కలిపి తాగాలి. ఇది నెలసరి రోజుల్లో నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.  
66
వైద్య సలహా
Image Credit : stockPhoto

వైద్య సలహా

దాల్చిన చెక్క టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయినా దీనిని  మితంగా ఉపయోగించాలి. ఎందుకంటే ఇందులో ఉండే కూమరిన్ అనే రసాయనం అధికంగా తీసుకుంటే కాలేయానికి హానికరంగా మారవచ్చు, అందుకే గర్భిణీలు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులతో మందులు వాడుతున్నవారు తప్పనిసరిగా వైద్యుని సలహా తీసుకోవాలి.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఆరోగ్యం
ఆహారం
మహిళలు
పురుషులు

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
Cinnamon Water: రోజూ పరగడుపున దాల్చిన చెక్క నీరు తాగితే ఏమౌతుంది?
Recommended image2
Street Food: స్ట్రీట్‌ ఫుడ్ తింటున్నారా? ఎంత డేంజరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved