MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Ajwain Water: 7 రోజులపాటు ఖాళీ కడుపుతో వాము వాటర్ తాగితే కలిగే 5 లాభాలు ఇవే!

Ajwain Water: 7 రోజులపాటు ఖాళీ కడుపుతో వాము వాటర్ తాగితే కలిగే 5 లాభాలు ఇవే!

ఆరోగ్యానికి మేలు చేసే వంటింటి పదార్థాల్లో వాము ఒకటి. ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన వాము వాటర్ ని రోజూ ఉదయాన్నే ఖాళీకడుపుతో తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో మీకు తెలుసా? ముఖ్యంగా 7 రోజులపాటు తాగితే కలిగే 5 లాభాల గురించి ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Feb 06 2026, 03:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వాము వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు
Image Credit : Getty

వాము వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

వాములో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వాములో ఉండే థైమాల్ అనే సహజ సమ్మేళనం జీర్ణ ఎంజైమ్‌ల విడుదలను ప్రోత్సహించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని వాము వాటర్ తాగితే అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హెవీ ఫుడ్ తీసుకునే వారికి వాము వాటర్ చాలా మంచిదని వివరిస్తున్నారు.

26
పేగుల ఆరోగ్యానికి..
Image Credit : Getty

పేగుల ఆరోగ్యానికి..

ఆయుర్వేద నిపుణుల ప్రకారం వాము ఉష్ణ గుణం కలిగి ఉంటుంది. వరుసగా 7 రోజులు వాము వాటర్ తీసుకోవడం వల్ల పేగుల కదలికలు సమతుల్యం అవుతాయి. చిన్నపిల్లలకు కూడా వాము నీటిని స్వల్ప మోతాదులో ఇస్తే గ్యాస్ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే మోతాదు విషయంతో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

Related Articles

Related image1
Cumin Water: 11 రోజులపాటు ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే కలిగే 5 లాభాలు ఇవే!
Related image2
Fenugreek Water: 11 రోజులపాటు మెంతుల నీళ్లు తాగితే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!
36
శ్వాసకోశ సమస్యలు దూరం
Image Credit : Getty

శ్వాసకోశ సమస్యలు దూరం

వాము యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. వాము వాటర్ తాగడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా వాతావరణ మార్పులకు ఎక్కువగా లోనయ్యేవారికి ఈ వాటర్ మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

46
త్వరగా బరువు తగ్గడానికి..
Image Credit : Getty

త్వరగా బరువు తగ్గడానికి..

పోషకాహార నిపుణుల ప్రకారం వాము వాటర్ మెటబాలిజాన్ని స్వల్పంగా పెంచి కొవ్వు కరగడానికి తోడ్పడుతుంది. ఇది ఆకలిని నియంత్రించి, ఎక్కువగా తినే అలవాటును తగ్గిస్తుంది. అయితే సమతుల్య ఆహారం, వ్యాయామంతో కలిపి ఈ వాటర్ తీసుకుంటే తక్కువ టైంలో మంచి ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

56
బలమైన రోగనిరోధక శక్తి
Image Credit : stockPhoto

బలమైన రోగనిరోధక శక్తి

వాములోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. వరుసగా 7 రోజులు వాము వాటర్ తీసుకోవడం వల్ల చిన్నచిన్న ఇన్ఫెక్షన్లను శరీరం సమర్థంగా ఎదుర్కొంటుంది. ముఖ్యంగా తరచూ జలుబుతో బాధపడేవారు, వాతావరణ మార్పులకు ఇబ్బంది పడేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

66
తయారీ విధానం..
Image Credit : stockPhoto

తయారీ విధానం..

వాము వాటర్ తయారీ విషయానికి వస్తే, ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ వాము వేసి రాత్రంతా నానబెట్టాలి. వాటిని ఉదయాన్నే మరిగించి వడగట్టి, గోరువెచ్చగా ఖాళీ కడుపుతో తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. కావాలంటే రుచి కోసం కొంచెం తేనె లేదా నిమ్మరసం కలుపుకోవచ్చని చెబుతున్నారు. గర్భిణీలు, అల్సర్ సమస్యలు ఉన్నవారు వాము వాటర్ తాగే ముందు డాక్టర్‌ సలహా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Menstrual Health: పీరియడ్స్‌లో మలబద్ధకమా? ఈ టిప్స్ పాటిస్తే సమస్య దూరం
Recommended image2
Soaked Almonds: రోజూ గుప్పెడు నానబెట్టిన బాదం తింటే ఏమవుతుందో తెలుసా?
Recommended image3
Malaika Arora Fitness: మలైకా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే
Related Stories
Recommended image1
Cumin Water: 11 రోజులపాటు ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే కలిగే 5 లాభాలు ఇవే!
Recommended image2
Fenugreek Water: 11 రోజులపాటు మెంతుల నీళ్లు తాగితే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved