MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Cumin Water: 11 రోజులపాటు ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే కలిగే 5 లాభాలు ఇవే!

Cumin Water: 11 రోజులపాటు ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే కలిగే 5 లాభాలు ఇవే!

మనం పాటించే కొన్ని చిన్న చిన్న మంచి అలవాట్లు, మన ఆరోగ్యానికి పెద్ద మేలు చేస్తాయి. ముఖ్యంగా 11 రోజులపాటు ఖాళీ కడపుతో జీలకర్ర నీరు తాగడం వల్ల శరీరంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Kavitha G
Published : Feb 03 2026, 03:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
జీలకర్ర నీరు తాగడం వల్ల కలిగే లాభాలు
Image Credit : Getty

జీలకర్ర నీరు తాగడం వల్ల కలిగే లాభాలు

జీలకర్రను మనం దాదాపు అన్ని రకాల వంటల్లో వాడుతుంటాం. జీలకర్ర చుడ్డానికి చిన్నగా ఉన్నా, ఆరోగ్యానికి మాత్రం పెద్దమేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగడం వల్ల శరీరంలో ఊహించని మార్పులు జరుగుతాయని వివరిస్తున్నారు. వరుసగా 11 రోజుల పాటు జీలకర్ర నీరు తాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలేంటో చూద్దాం.

26
మెరుగైన జీర్ణక్రియ
Image Credit : Getty

మెరుగైన జీర్ణక్రియ

ఆరోగ్య నిపుణుల ప్రకారం జీలకర్రలో ఉండే సహజ నూనెలు, యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. 11 రోజులు వరుసగా ఉదయాన్నే జీలకర్ర నీరు తాగితే గ్యాస్, పొట్ట ఉబ్బరం, మలబద్ధకం వంటి సాధారణ జీర్ణ సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ముఖ్యంగా ఆలస్యంగా భోజనం చేసే వారు లేదా ఎక్కువగా కూర్చొని పని చేసేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని నిపుణలు చెబుతున్నారు.

Related Articles

Related image1
Junk Food Skin Effects: 30 రోజులు జంక్ ఫుడ్ మానేస్తే మీ ముఖంలో కనిపించే 5 మార్పులు ఇవే!
Related image2
Chicken: చికెన్‌ని వండేముందు కడుగుతున్నారా? ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి
36
జీవక్రియ రేటు
Image Credit : our own

జీవక్రియ రేటు

నిపుణుల ప్రకారం జీలకర్ర నీరు, జీవక్రియ రేటును పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దానివల్ల ఆహారం నుంచి పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారు 11 రోజులు ఈ అలవాటు పాటిస్తే మంచి ఫలితాలు చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

46
షుగర్ లెవల్స్
Image Credit : our own

షుగర్ లెవల్స్

కొన్ని పరిశోధనల ప్రకారం జీలకర్రలో ఉండే కొన్ని సమ్మేళనాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. దానివల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది డయాబెటిస్‌కు చికిత్స కాదు అనే విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. షుగర్ వ్యాధి ఉన్నవారు మందులు మానేయకుండా, డాక్టర్ సలహాతో జీలకర్ర నీటిని తాగవచ్చని చెబుతున్నారు.

56
ఈ సమస్యలు దూరం
Image Credit : our own

ఈ సమస్యలు దూరం

జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి.. కణాల నష్టాన్ని, ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాదు 11 రోజుల పాటు వరుసగా ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగడం వల్ల కొంతమందిలో తలనొప్పి, చిన్న చిన్న శరీర నొప్పులు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

66
శరీరానికి తేమ
Image Credit : our own

శరీరానికి తేమ

ఉదయం లేవగానే గోరువెచ్చని జీలకర్ర నీరు తాగడం వల్ల రాత్రంతా విశ్రాంతిలో ఉన్న శరీరానికి తేమ అందుతుంది. ఇది కిడ్నీలు, కాలేయం పనితీరుకు సహకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే జీలకర్ర నీటిని ఎలా తాగాలి అనే విషయంలో కూడా నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ జీలకర్రను రాత్రంతా నానబెట్టి, ఉదయం మరిగించి గోరువెచ్చగా తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ మోతాదులో తాగడం మంచిది కాదని, అలాగే గర్భిణీలు, తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు లేదా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ముందుగా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిదని హెచ్చరిస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Health: ఉద‌యం లేవ‌గానే నీరు తాగమ‌ని ఎందుకు చెప్తారో తెలుసా.? వీరికి మాత్రం డేంజ‌ర్
Recommended image2
Health: మ‌గ‌వారు అందుకు పనికి రార‌ని ఎలా తెలుస్తుంది.? బయట నుంచి చూసి చెప్పొచ్చా
Recommended image3
Health: 30 ఏళ్ల‌లో హైబీపీ వ‌స్తే దేనికి సంకేత‌మో తెలుసా.? వెంట‌నే అల‌ర్ట్ అవ్వాల్సిందే..
Related Stories
Recommended image1
Junk Food Skin Effects: 30 రోజులు జంక్ ఫుడ్ మానేస్తే మీ ముఖంలో కనిపించే 5 మార్పులు ఇవే!
Recommended image2
Chicken: చికెన్‌ని వండేముందు కడుగుతున్నారా? ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved