ఈ 5 రకాల ఫుడ్స్ మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే అంతే.. రోగాలు కొని తెచ్చుకున్నట్టే
ఫుడ్ వేస్ట్ చేయకూడదని మధ్యాహ్నం ఎప్పుడో వండిన కూర, రైస్ రాత్రి వేడి చేసి తింటుంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదని, ముఖ్యంగా కొన్ని పదార్థాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే రోగాలు కొని తెచ్చుకున్నట్టేనని డాక్టర్లు చెబుతున్నారు. పదే పదే వేడి చేయకూడని 5 రకాలు ఫుడ్ ఐటమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టీ, కాఫీని మళ్లీ మళ్లీ వేడిచేయకూడదు
మన ఇంటికి చుట్టాలు, స్నేహితులు వచ్చారనుకోండి వెంటనే వారికి టీ, కాఫీ ఇస్తుంటాం కదా. కాని ఒక్కోసారి పొద్దున్న ఎప్పుడో పెట్టిన టీ మిగిలిపోయి ఉంటుంది. దాన్ని కాస్త వేడి చేసి సర్వ్ చేసేస్తుంటారు. అలాగే టీ దుకాణాల్లో కూడా ఎప్పుడో పెట్టిన టీని పదే పదే వేడి చేసి ఇస్తుంటారు. ఎంత టేస్టీగా ఉందో అనుకుంటూ తాగేస్తుంటాం. కాని వాస్తవానికి పదే పదే వేడి చేసే టీ, కాఫీల్లో పోషకాలన్నీ ఆవిరైపోతాయట. టీ ఆకుల్లో, కాఫీ గింజల్లో ఉండే రుచి కూడా మారిపోతుంది. అంతేకాకుండా హానికరమైన బ్యాక్టీరియా తయారై శరీరంలోకి చేరి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.
బంగాళాదుంపలతో వికారం, వాంతులు
బంగాళాదుంపలను కూడా పదేపదే వేడి చేసి తినడం మంచిది కాదు. పొద్దున్న మిగిలిపోయిందని, సాయంత్రం పూట వేడిగా ఉండాలని కొందరు కూరలను మళ్లీ వేడిచేస్తుంటారు. ఇలాంటి వాటిలో బంగాళా దుంప కూర ఉంటే అస్సలు వేడి చేయకూడదు. దీని వల్ల బంగాళాదుంపలో ఉండే నైట్రేట్స్ శరీరానికి బలం ఇవ్వకపోగా, అనేక ఆరోగ్య సమస్యలు తెస్తాయి. పదే పదే వేడి చేసిన బంగాళాదుంపలు తింటే వికారం, వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది.
కోడి గుడ్డుతో ఎసిడిటీ, ఉబ్బరం
ఎక్కువ వినియోగించే నాన్ వెజ్ లో కోడి గుడ్డు ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఫ్రై అంటే అప్పటికప్పుడు కోడిగుడ్డు పగలగొట్టి వేస్తారు కాని.. బిర్యానీలు, కర్రీలకైతే బాయిల్ చేసిన ఎగ్స్ ని ఎక్కువగా వాడతారు. అయితే బాయిల్ చేసిన ఎగ్స్ ని పదేపదే వేడి చేసి తింటే కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.
పాలకూరతో డేంజర్
పాలకూరలో చాలా పోషకాలు ఉంటాయి. అందుకే పాలకూరను తరచూ కూరల్లో ఉపయోగిస్తారు. పాలకూర పప్పు, వేపుడు, పాలక్ పన్నీర్ కర్రీ ఇలా రకరకాలుగా తయారు చేస్తారు. అయితే పదే పదే వేడి చేయడం వల్ల అందులో ఉండే నైట్రేట్స్ విషపూరితమైపోతాయి. నైట్రేట్స్ కడుపులో ఉండే అమినో యాసిడ్స్ తో కలిసి క్యాన్సర్ కారకాలుగా మారే ప్రమాదం ఉంది.
మష్రూమ్స్ తో గుండె జబ్బులు..
మష్రూమ్స్ లో ఎన్ని పోషకాలు ఉంటాయో, వాటిని సరిగ్గా ఉపయోగించపోతే అంతటి ప్రమాదాన్ని కూడా తెస్తాయి. మష్రూమ్స్ ను ఎక్కువగా రెస్టారెంట్స్, దాబాల్లో వినియోగించడం చూస్తుంటాం. అయితే వాటిని పదేపదే వేడి చేయడం వల్ల తెల్లగా ఉండేవి కాస్తా రంగు మారిపోతాయి. రుచి కూడా మారిపోయి కడుపులో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. తిన్న ఆహారం డైజస్ట్ కాకపోవడం లాంటి సమస్యలతో పాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.