MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • మీ పిల్లల్లో ఈ లక్షణాలున్నాయా..? ADHD సమస్య ఉన్నట్లే.. అంటే ఏమిటో తెలుసా?

మీ పిల్లల్లో ఈ లక్షణాలున్నాయా..? ADHD సమస్య ఉన్నట్లే.. అంటే ఏమిటో తెలుసా?

ADHD... అంటే అటెన్షన్ డెఫిషిట్ హైపర్ ఆక్టివిటీ డిజార్డర్. ఇది చిన్నపిల్లల్లో కనిపించే సమస్య. దీనికి కారణాలేంటి, లక్షణాలేంటి, ఎలా కంట్రోల్ చేయవచ్చు..? తదితర వివరాలను ఇక్కడ చూద్దాం. 

3 Min read
Author : Amarnath Vasireddy
Published : Mar 14 2026, 05:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నిజాలకు పాతరేస్తే..?
Image Credit : AI

నిజాలకు పాతరేస్తే..?

అదొక సంచలన ఘటన.

రెండు నెలల క్రితం అందరూ దాని గురించే మాట్లాడుకున్నారు.

ఇప్పుడు మరచిపోయారు .

ఆ సంఘటన గురించి నిజాలు బయటకు రావు .

దీని వల్ల సమాజానికి జరిగే నష్టం లేదు .

వ్యక్తుల... వ్యక్తిగత జీవితాలు .

కాలక్షేపం కోసం .. అవతలి వారి జీవితాల్లోకి తొంగి చూసి గుసగుసలు పోవడం ఒక రకమయిన మానసిక రోగం.

మన చుట్టూరా జరిగే ఘటనలనుంచి మనం ఏమి గ్రహించాలి..?.. మన జీవితాలను ఎలా మలచుకోవాలి..? అనే కోణంలోనే మనం ఆలోచించాలి.

అంతకు మించి కుతూహలం చూపడం మంచిది కాదు.

"అది ఏ ఘటన?" .." అందులో నిజాలేవి ".. లాంటి కామెంట్స్ పెట్టకండి.

చెప్పాలి అనుకొంటే నేరుగా చెప్పేసే వాడిని కదా..?

నా ఫోకస్ అది కాదు.

సంచలనాలు .. మిస్టరీలు... నరాలు చిట్లిపోవడాలు .. కావాలనుకొంటే యూట్యూబ్ వీడియోలు దొరుకుతాయి.

మనం- మన జీవితాలు అనే కోణం లోనే నా పోస్ట్ లు ఉంటాయి.

ఇంత క్లియర్ గా చెప్పినా "ఓ ఆ కేసా ? ఏమి జరిగింది" .. లాంటి కామెంట్స్ వస్తే బ్లాక్ చేస్తాను. నా పోస్ట్ లను చూసే అవకాశం కోల్పోతారు.

వ్యక్తిగత విషయాల్లో నిజాలు బయటకు రాకపోతే ఏమీ నష్టం లేదు కానీ .. అందరి జీవితాలకు సంభందించిన విషయాల్లో నిజాలకు సమాధి కడితే ఏమి జరుగుతుందో చెబుతాను .. చదవండి.

24
ADHD అంటే ఏమిటి..?
Image Credit : freepik

ADHD అంటే ఏమిటి..?

ADHD అంటే అటెన్షన్ డెఫిషిట్ హైపర్ ఆక్టివిటీ డిజార్డర్.

ఈ సమస్య ఉన్న పిల్లలు నింపాదిగా ఒక చోట కూర్చోరు.

ఏకాగ్రత కు వీరు వెయ్యి మైళ్లు దూరం .

ఒకేసారి నాలుగైదు పనులు చేస్తారు.

ఉదాహరణకు మీరు వారికి అన్నం తినిపించాలి అని చూస్తే ఒక ముద్ద పెట్టుకొని పరుగెత్తుతారు. బీరువా ఓపెన్ చేసి అందులో వస్తువులను కింద పడేస్తారు.

మీరు బీరువా దగ్గరకు వెళ్లి ఆ వస్తువులను చూపితే అక్కడ వుండరు. కిచెన్ కు పరుగెత్తుతారు.

అక్కడ ఉన్న కాయగూరల్ని కింద పడేస్తారు. ఇంట్లో మిగతా పిల్లలుంటే వారిని గీరు తారు...గిచ్చుతారు.. కొడతారు.

పరుగెత్తుతారు...దూకుతారు.

నిద్ర పోతున్నప్పుడు తప్పించి మిగతా సమయాల్లో నరకం చూపుతారు. ధర్మ రాజు లాంటి వ్యక్తి కూడా నిగ్రహం కోల్పోయేలా వీరి ప్రవర్తన ఉంటుంది.

ఇరవై ఏళ్లుగా బడిలో పాఠాలు చెబుతున్న ఏ టీచర్ నైనా అడగండి.. అప్పట్లో అసలు ఈ మాటే వినిపించేది కాదు. ఇలాంటి పిల్లలు ఎక్కడో లక్షల్లో ఒకరు.

ఇప్పుడు ..ప్రతి క్లాసులో ఇద్దరు ముగ్గురు.

పాఠం వినరు. బ్లాక్ బోర్డుపై రాయాలని అటు తిరిగేలోగా పక్క పిల్లాడిని గిల్లి, రక్కేసి ఉంటారు.

ఆ పిల్లాడి పేరెంట్స్ కంప్లైంట్.

ఈ పిల్లాడి పేరెంట్స్ కూడా మనల్నే తప్పుపడుతారు .

"క్లాసులో మీరే చూసుకోవాలి కదా ? "అని అడుగుతారు.

దేవుడు నాకేమైనా తలవెనుక కళ్ళు ... ముప్పై పొడవాటి చేతులు పెట్టాడా..? ప్రతి విద్యార్థి దగ్గర కూర్చోలేను కదా..? క్షణంలో అవతలి వారిని రక్కేస్తే ఏమి చెయ్యాలి..? విసుగు వచ్చేస్తుంది. ఉద్యోగం వదిలి పారిపోవాలి అనిపిస్తుంది" అంటారు.

Related Articles

Related image1
Parenting Psychology: పేరెంట్స్ స్ట్రెస్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా?
Related image2
Parenting Tips for Boys: కొడుకును ఎలా పెంచాలి? ఈ తప్పులు అస్సలు చేయోద్దు
34
పెరుగుతున్నADHD కేసులు
Image Credit : Getty

పెరుగుతున్నADHD కేసులు

గత పదేళ్లుగా ముఖ్యంగా గత అయిదేళ్లుగా ADHD సమస్య తీవ్రమయ్యింది .

పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇవ్వడం. ఇంట్లో ఎప్పడూ వైఫై ఆన్ లో ఉండడం.. మనుషుల మధ్య సామజిక సంభందాలు బలహీనం కావడం.. ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం.. స్ట్రెస్ పెరగడం.. గర్బిణీ స్త్రీలు ఉదరానికి దగ్గర గా లాప్ టాప్ పెట్టుకొని వాడడం .. ఇవీ దీనికి కారణాలు.

కారణాలు తెలిస్తే .. పరిష్కారం తెలుస్తుంది.

నిజాల్ని ఒప్పేసుకొంటే సెల్ ఫోన్ .. డేటా కనెక్షన్ స్మార్ట్ టీవీ .. ఓటిటి .. ఇలా చాలామందికి నష్టం.

కాబట్టి నిజాన్ని బయటకు రానివ్వరు.

"ఒకప్పుడు కూడా ADHD ఉండేది. కాకపోతే ఇప్పుడు టెస్టింగ్ అవగాహన పెరిగింది కాబట్టి కేసులు పెరిగినట్టు కనిపిస్తుంది"అని కట్టు కథ అల్లేశారు.

ఓరి నీ అసాధ్యం కూలా.

లక్షలాది మంది టీచర్స్ మొఖాన ఉమ్మేస్తారు అని భయం కూడా లేక పొతే ఎలా ?

వైఫై .. సెల్ ఫోన్ .. స్మార్ట్ టీవీ .. ఒటిటి.. జంక్ ఫుడ్ కు... ADHDకి సంబంధమే లేదు .. అని తేల్చేస్తే..?

అమెరికాలో ఇదే జరుగుతోంది .

వీటన్నింటికీ దూరం జరిగితే కొంతలో కొంత మెరుగుపడే ఛాన్స్.

కానీ బడా కంపెనీల చేతుల్లో కీలుబొమ్మగా మారిన సైన్స్ ఒప్పుకోదు.

44
పిల్లల్లో పెరిగిన హైపర్ యాక్టివిటీ...
Image Credit : ChatGpt AI

పిల్లల్లో పెరిగిన హైపర్ యాక్టివిటీ...

ప్రతి క్లాసులో ఇద్దరో ముగ్గురో హైపర్ ఆక్టివిటీ పిల్లలు.

టీచర్స్ ఏమి చేయగలుగుతారు..?

అమెరికాలో ఇలాంటి పిల్లలకు బడుల్లో మెడిసిన్ ఇస్తున్నారు .

ఈ మందులు రెండు రకాలు. స్టిములంట్ మెడిసిన్. నాన్ స్టిములంట్.

రిటలిన్ , ADDERALL అనేవి మొదటి కోవ.

వీటి సైడ్ ఎఫెక్ట్స్..

గుండె వేగంగా కొట్టుకొంటుంది. బిపి పెరుగుతుంది. పెరుగుదల దెబ్బతింటుంది. నిద్ర సరిగా పట్టదు. ఇరిటబిలిటీ మరింత పెరుగుతుంది.

STRATTERA నాన్ స్టిములంట్.

ఆలోచనలు చేంజ్.. వాంతులు .. కళ్ళు తిరగడం.. బిపి పెరగడం .. కొన్ని కేసుల్లో లివర్ పాడైపోవడం.. ఆత్మహత్య ఆలోచనలు. ఇదీ దీని సైడ్ ఎఫెక్ట్స్

మందు వేయకపోతే వారు బడిల.. క్లాసులో.. కూర్చోరు.

మందేస్తే ఆరోగ్యం నాశనం .

ఒక్కసారి మందు ఇస్తే దాని కారణంగా నిద్ర పట్టదు.

చిరాకు పడతారు .

చిరాకు తగ్గించడానికి ఇచ్చే మందు చిరాకును తెప్పిస్తుంది .

మందువేస్తె మళ్ళీ మళ్ళీ వెయ్యాలి .

సమస్య మరింత జటిలం

రాస్తుంటే నాకు ఏడుపు వస్తుంది.

నిజాలకు పాతరవేస్తే అది మన జీవితాలకు సమాధి కడుతుంది.

About the Author

AV
Amarnath Vasireddy
వాసిరెడ్డి అమర్‌ నాథ్‌ ప్రముఖ విద్యావేత్త. తన విద్యా సంస్థలతో వేలాది మంది IAS, IPS, గ్రూప్-Iతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను దేశానికి అందించారు. విద్యవేత్తగా, మీడియా విశ్లేషకుడిగా, పిల్లల మనస్తత్వవేత్తగా, మానవతావాదిగా, సంస్కరణవాదిగా, కాలమిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. సోషియాలజీ, ఆంత్రోపాలజీలో ఎమ్‌.ఏ, ఎమ్‌ ఫిల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అమర్ నాథ్‌ స్లేట్- ది స్కూల్‌కి ఛైర్మన్‌గా ఉంటున్నారు. ఈయన్ను Amarnath_vasireddy@yahoo.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
జీవనశైలి
ఆరోగ్యం
చిన్నారుల సంరక్షణ
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Pi Day: ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా.? ‘పై’ మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
Recommended image2
కట్టెల పొయ్యికి సమాధి కట్టిన ఓ ఆధునిక సమాజమా... ఇక అనుభవించు..!
Recommended image3
అన్నీ ఉన్నాయ‌ని అహంకారం చూపితే జీవితం ఇలాగే మారుతుంది.. క‌ళ్లు తెరిపించే కాకి క‌థ‌
Related Stories
Recommended image1
Parenting Psychology: పేరెంట్స్ స్ట్రెస్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా?
Recommended image2
Parenting Tips for Boys: కొడుకును ఎలా పెంచాలి? ఈ తప్పులు అస్సలు చేయోద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved