Health tips: ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 రకాల డైట్ ప్లాన్స్ అస్సలు పాటించద్దు!
బరువు తగ్గడానికి చాలామంది రకరకాల డైట్ ప్లాస్స్ ఫాలో అవుతుంటారు. వాటిలో ఆరోగ్యానికి మేలు చేసే వాటికన్నా చెడు చేసేవే ఎక్కువ ఉన్నాయంటున్నారు నిపుణులు. ఆరోగ్యంగా ఉండాలంటే పొరపాటున కూడా ఈ 5 రకాల డైట్ ప్లాన్స్ పాటించకూడదని చెబుతున్నారు. అవేంటో చూసేయండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఈ డైట్ అస్సలు ఫాలో కావద్దు!
బరువు తగ్గడానికి ప్రస్తుతం అనేక రకాల డైట్ ప్లాన్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని… ఆరోగ్యానికి మేలు చేయకపోగా.. హాని కలిగిస్తున్నాయి. కాబట్టి అలాంటి డైట్ ప్లాన్ పాటించకపోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. మరి దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే పాటించకూడని కొన్ని ప్రమాదకరమైన డైట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
తక్కువ ఉప్పు తినడం
తక్కువ ఉప్పు తినడం అధిక రక్తపోటు ఉన్నవారికి మంచిది. కానీ వైద్యుల సలహా లేకుండా తక్కువ ఉప్పు లేదా ఉప్పు లేని ఆహారం తీసుకోవడం హానికరం. ఉప్పు శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడుతుంది. నరాల పనితీరుకు, కండరాల సంకోచానికి సహాయపడుతుంది. ఉప్పును పూర్తిగా తగ్గిస్తే శరీరంలో సోడియం తగ్గిపోతుంది. దీనివల్ల అలసట, కండరాల నొప్పులు, అనారోగ్యం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత ఉప్పు తీసుకోవడం అవసరం.
కొవ్వు పదార్థాలు
కొందరు బరువు తగ్గడానికి తమ ఆహారంలో కొవ్వు పదార్థాలను పూర్తిగా తగ్గిస్తారు. కానీ నట్స్, అవకాడో వంటి వాటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు, హార్మోన్ ఉత్పత్తికి అవసరం. తీసుకునే ఫుడ్ లో కొవ్వును తగ్గిస్తే శరీరంలో కొవ్వు ఆమ్లాలు తగ్గిపోతాయి. దీనివల్ల చర్మం పొడిబారుతుంది. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అలసట వస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వైద్యుల సలహా తీసుకుని కొవ్వు పదార్థాలు తినడం మంచిది.
తక్కువ కేలరీలు ఉన్న ఆహారం
బరువు తగ్గడానికి కొందరు తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం లేదా కొన్ని రోజులు ఆహారం తినకుండా ఉంటారు. కానీ ఈ అలవాటు శరీరంలో కండరాలు, నీటిని తగ్గించి బరువు తగ్గిస్తుంది కానీ కొవ్వు తగ్గదు. జీవక్రియ రేటు కూడా తగ్గుతుంది. తగినంత పోషకాలు లేకపోతే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి తగిన మోతాదులో కేలరీలు తీసుకోవడం మంచిది.
పండ్ల రసాలు
కేవలం పండ్ల రసాలనే ఎక్కువగా తీసుకుంటే కాలేయం, మూత్రపిండాల్లోని విష పదార్థాలు తొలగిపోతాయి. కానీ పోషకాహార లోపం, ఇతర సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ డైట్ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ ఫైబర్ ఉన్న కూరగాయలు, తృణధాన్యాలను తగిన మోతాదులో తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
క్యాబేజీ సూప్
కొందరు ఎక్కువగా క్యాబేజీ సూప్ తీసుకుని.. ఇతర ఆహారాలు తగ్గించి బరువు తగ్గుతారు. ఈ డైట్‌లో బరువు తగ్గడానికి కారణం శరీరంలో పోషకాలు, నీరు తక్కువగా ఉండటమే. ఈ డైట్ ప్లాన్ వల్ల శరీరం శక్తిని కోల్పోతుంది. పోషకాలు అసమతుల్యం అవుతాయి. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఈ డైట్ తర్వాత మళ్లీ పాత ఆహారపు అలవాట్లకు తిరిగి వస్తే బరువు పెరుగుతారు.
నిపుణుల మాట..
ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఇలాంటి హానికరమైన డైట్ ప్లాన్స్ పాటించకూడదని నిపుణులు చెబుతున్నారు. సమతుల్య ఆహారం, వ్యాయామం, మంచి నిద్ర వంటివి బరువు తగ్గడానికి సహాయపడతాయని సూచిస్తున్నారు.