MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Life
  • Health
  • Healthy Teeth: ఈ ఫుడ్స్ తింటే మీ పళ్లు పుచ్చిపోవడం పక్కా.. వీటికి దూరంగా ఉండండి

Healthy Teeth: ఈ ఫుడ్స్ తింటే మీ పళ్లు పుచ్చిపోవడం పక్కా.. వీటికి దూరంగా ఉండండి

Healthy Teeth: పిల్లలు గానీ, పెద్దలు గానీ చాలా మంది ఏదిపడితే అది తినేస్తుంటారు. దానికి సమయం, సందర్భం ఉండదు. అయితే కొన్ని రకాల ఆహారాలు మన పళ్ల ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. పళ్లు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే ఏయే ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం.

2 Min read
Author : Nandini Arava
Published : Mar 16 2026, 06:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
పళ్లను పాడు చేసే ఆహారాలు ఇవే
Image Credit : Getty

పళ్లను పాడు చేసే ఆహారాలు ఇవే

కొందరు ఏది పడితే అది తినేస్తారు. అందుకు టైమూ పాడూ ఉండదు, రాత్రి పూట పడుకునే ముందు స్వీట్స్, చాక్లెట్, ఐస్ క్రీం తినడం, ఉదయం లేవగానే నిమ్మకాయ నీళ్లు తాగితే మంచిదని తెగ తాగేస్తుంటారు. రాత్రి తిన్న తర్వాత సరిగ్గా నోరు కడుక్కోకపోవడం..ఇలా చేస్తుంటారు. దానివల్ల కెవిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంట్లో పిల్లలకు ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.  కొన్ని ఆహార పదార్థాలు పళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అవేంటో వివరంగా చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
సిట్రస్ పండ్లు
Image Credit : Getty

సిట్రస్ పండ్లు

నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పంటి ఎనామిల్‌ను దెబ్బతీసి, పళ్లను పాడు చేస్తుంది. అందుకే వీటిని ఎక్కువగా తినకూడదు. 

37
స్వీట్స్, చాక్లెట్లు
Image Credit : Getty

స్వీట్స్, చాక్లెట్లు

స్వీట్స్ తినడం పళ్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవి దంత క్షయానికి కారణమవుతాయి. అందుకే స్వీట్స్, చాక్లెట్లు, ఐస్‍క్రీంలకు వీలైనంత దూరంగా ఉండాలి. కొందరు సంతోషమొచ్చినా, ఆనందమొచ్చినా ముందు తినేది స్వీట్స్, చాక్లెట్లు. సో వాటికి అవైడ్ చేయాలి.

47
కుకీస్, ఐస్‌క్రీమ్
Image Credit : our own

కుకీస్, ఐస్‌క్రీమ్

కుకీలు, ఐస్‌క్రీమ్‌లు కూడా పళ్ల ఆరోగ్యానికి అంత మంచివి కావు. వీటిలో ఉండే చక్కెర పళ్లను దెబ్బతీస్తుంది. పిల్లలకు ఎక్కువగా బిస్కెట్లు, ఐస్ క్రీంలు ఇవ్వకూడదు. దానికి బదులుగా ఇంట్లో బెల్లంతో చేసే ఏ పదార్థాలైనా ఇవ్వొచ్చు.

57
చిప్స్, పాప్‌కార్న్
Image Credit : Getty

చిప్స్, పాప్‌కార్న్

చిప్స్, పాప్‌కార్న్ లాంటి ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్‌ను కూడా డైట్ నుంచి తీసేయాలి. ఇవి పంటి ఎనామిల్‌కు హాని చేస్తాయి. ఇప్పటి పిల్లలు ఎక్కువగా తినేది ఇవే. ఇవి పళ్లకే కాదు కడుపులోనూ జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. అనేకరోగాలకు కారణమవుతుంది.

67
సోడా
Image Credit : Getty

సోడా

సోడా లాంటి కూల్ డ్రింగ్ ఎక్కువగా తాగడం వల్ల కూడా పళ్లు దెబ్బతింటాయి. వీటిలోని యాసిడ్స్ పళ్లకు హాని చేస్తాయి. వీటికి బదులు కొబ్బరినీళ్లు, సబ్జా వాటర్, చియా వాటర్, మట్టికుండలో నీళ్లు..ఆరోగ్యానికి ఎంతో మంచిది. చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు కూడా పళ్ల ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఇవి నోటిలో బ్యాక్టీరియాను పెంచుతాయి.

77
వైన్, ఆల్కహాల్
Image Credit : Getty

వైన్, ఆల్కహాల్

వైన్‌లోని యాసిడ్ పంటి ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది. దీనివల్ల పళ్లు పసుపు రంగులోకి మారతాయి. అలాగే, అధికంగా ఆల్కహాల్ తాగడం ఆరోగ్యాన్నే కాదు, పళ్లనూ పాడు చేస్తుంది. ధూమపానం, ఆల్కహాల్‍కు దూరంగా ఉండాలి, సర్వ రోగాలకు కారణమిది. సో బీ కేర్ ఫుల్

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
ఆహారం
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
Teeth Whitening: బొగ్గుతో పళ్లను తోమితే ఏమౌతుంది?
Recommended image2
Teeth Care: ఇవి పాటిస్తే లైఫ్ టైం చిరునవ్వు సేఫ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved