Kidney stones : కిడ్నీలో రాళ్ళు ఎందుకు ఏర్పడుతాయి? ఈ చిన్న పొరపాటు కూడా కారణమేనా?
Kidney stones: శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి అనేక ముఖ్యమైన విధుల్నీ నిర్వహిస్తాయి. అయితే.. ఈ మధ్యకాలంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం సర్వసాధారణం అయిపోయింది. ఇంతకీ కిడ్నీల్లో రాళ్లు ఎందుకు ఏర్పడుతాయి? కారణామేంటీ? వివరంగా తెలుసుకుందాం..

నీళ్లు తక్కువ తాగడం
కిడ్నీ స్టోన్స్ రావడానికి గల కారణాల్లో తక్కువగా నీరు తాగడం కూడా ఒక్కటి. శరీరంలో తగినంత నీరు లేకపోతే, మూత్రవిసర్జన సమయంలో మంటగా అనిపించవచ్చు. ఈ క్రమంగా జరిగితే.. రాళ్లు ఏర్పడుతాయి. కాబట్టి రోజూ కనీసం 8–10 గ్లాసుల నీరు తాగాలి.
అధికంగా ఉప్పు తీసుకోవడం
అధికంగా ఉప్పు తీసుకోవడం (High sodium intake) కూడా కిడ్నీల్లో రాళ్లు (Kidney Stones) ఏర్పడడానికి మరో ప్రధాన కారణం. ఉప్పులో ఉండే సోడియం మూత్రంలో కాల్షియం స్థాయిని పెంచుతుంది, ఇది మూత్రంలో ఇతర ఖనిజాలతో కలిపి రాళ్లుగా మారే అవకాశాన్ని పెంచుతుంది.
ఆక్సలేట్ ఆహారాపదార్థాలు
ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా ఆక్సలేట్ అనే పదార్థం కాల్షియంతో కలిపి రాళ్లుగా మారే ప్రమాదం ఉంటుంది.
ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలు: పాలకూర (Spinach), చాక్లెట్, బీట్రూట్, నట్స్ (almonds, peanuts), సోయా ఉత్పత్తులు. ఈ ఆహారాలను పరిమితంగా తీసుకోవాలి. ఆక్సలేట్ ఉన్న ఆహారాలను కాల్షియం అధికంగా ఉన్న ఆహార పదార్థాలతో కలిపి తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయి.
ప్రోటీన్ ఆహారం
అధికంగా ప్రోటీన్ తీసుకోవడం (especially animal protein) వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే కిడ్నీ సమస్యలున్నవారు వీటిని తీసుకోవడం మరింత హానికరం. ప్రోటీన్ అధికంగా తీసుకోవడం వల్ల యూరియా (urea) అనే వ్యర్థ పదార్థం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది కిడ్నీలపై పని భారం పెంచుతుంది. ప్రోటీన్ మోతాదు ఎక్కువైతే మూత్రంలో కాల్షియం స్థాయి పెరిగి, కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశముంది.
మూత్రాన్ని అదుపు చేయడం
మూత్రాన్ని అదుపు చేయడం (ఆపుకోవడం) కిడ్నీ ఆరోగ్యానికి చాలా హానికరం. ఇది కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి అవకాశం కల్పించడంతో పాటు, ఇతర మూత్ర మార్గ సమస్యలకు కూడా దారి తీస్తుంది.