Kidney health: కిడ్నీలకు హాని కలిగించే చెడు అలవాట్లు ఇవే..
health-life Jun 19 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
నీరు ఎక్కువగా/తక్కువగా తాగడం
తగినంత నీరు తాగకపోవడం, అతిగా తాగడం కిడ్నీలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి రోజూ తగినంత నీరు తాగాలి. లేకపోతే వ్యర్థాలు పేరుకుపోయి కిడ్నీల్లో రాళ్లు లేదా ఇన్ఫెక్షన్స్ రావొచ్చు.
Image credits: Getty
Telugu
ఉప్పు, పంచదార అతిగా వాడటం
మన తీసుకునే ఆహారపదార్థాల్లో అతిగా ఉప్పు, పంచదార వాడటం వల్ల కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆహారంలో ఉప్పు, పంచదార తగ్గించాలి. లేకపోతే కిడ్నీలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది.
Image credits: Getty
Telugu
ప్రాసెసింగ్ ఫుడ్
చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ తదితర ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీల ఆరోగ్యం దెబ్బ తినవచ్చు. తాజా పండ్లు, కూరగాయలు, ఇంటి భోజనం తినడం ఆరోగ్యానికి మేలు.
Image credits: Getty
Telugu
ధూమపానం
ధూమపానం రక్తనాళాలకు హాని కలిగిస్తుంది. రక్త ప్రసరణను నెమ్మదింపజేస్తుంది. తద్వారా కిడ్నీల ఆరోగ్యం వైఫల్యం చెందుతుంది.
Image credits: Getty
Telugu
మద్యపానం
మద్యం ఎక్కువగా తాగడం వల్ల మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది, వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి మద్యపానాన్ని మానుకోవడం వల్ల కిడ్నీల ఆరోగ్యానికి, శరీర ఆరోగ్యానికి మంచిది.