MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • Curry Leaves: రోజూ కరివేపాకు తింటే శరీరంలో జరిగే 5 అద్భుతమైన మార్పులు ఇవే!

Curry Leaves: రోజూ కరివేపాకు తింటే శరీరంలో జరిగే 5 అద్భుతమైన మార్పులు ఇవే!

మనం చాలా రకాల వంటల్లో కరివేపాకును వేస్తుంటాం. కానీ చాలామంది వీటిని తినకుండా పక్కన పెట్టేస్తుంటారు. నిజానికి కరివేపాకు ప్రయోజనాలు తెలిస్తే.. ఎవ్వరు దాన్ని పడేయడానికి ఇష్టపడరు. రోజూ కరివేపాకు తింటే కలిగే 5 అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Mar 27 2026, 02:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కరివేపాకు ప్రయోజనాలు
Image Credit : stockPhoto

కరివేపాకు ప్రయోజనాలు

కరివేపాకు ఆరోగ్యానికి మంచిదని తెలిసినా, చాలామంది దాన్ని తినడానికి ఇష్టపడరు. కానీ ఈ చిన్న ఆకులో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. కరివేపాకులో విటమిన్ A, B, C, E లతో పాటు ఐరన్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని రోజూ మితంగా తీసుకోవడం వల్ల శరీరంలో అనేక సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మెరుగైన జీర్ణక్రియ
Image Credit : stockPhoto

మెరుగైన జీర్ణక్రియ

కరివేపాకు జీర్ణవ్యవస్థను శక్తిమంతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. దీనిలో ఉండే ఫైబర్, సహజ ఎంజైమ్‍లు ఆహారాన్ని సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. చాలా మంది డాక్టర్లు భోజనం తర్వాత కొన్ని కరివేపాకు ఆకులు నమలడం వల్ల గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయని సూచిస్తున్నారు.

36
 జుట్టు ఆరోగ్యం
Image Credit : Getty

జుట్టు ఆరోగ్యం

కరివేపాకు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే సహజ పదార్థాల్లో ఒకటి. ఇందులో ఉండే బీటా-కెరోటిన్, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఆయుర్వేద నిపుణుల ప్రకారం కరివేపాకు నూనె లేదా కరివేపాకు పేస్ట్ ఉపయోగించడం వల్ల తల చర్మం ఆరోగ్యంగా ఉండి, తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది. అలాగే లోపల నుంచి పోషణ అందించడం వల్ల జుట్టు దృఢంగా మారుతుంది.

46
కంట్రోల్లో షుగర్ లెవెల్స్
Image Credit : Freepik

కంట్రోల్లో షుగర్ లెవెల్స్

కరివేపాకు డయాబెటిస్ ఉన్నవారికి వరం లాంటిది.ఇందులో ఉండే కొన్ని బయో-యాక్టివ్ సమ్మేళనాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. నిపుణుల సూచనల ప్రకారం, ఉదయం ఖాళీ కడుపుతో 5-6 కరివేపాకులు తినడం వల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండే అవకాశం ఉంది. అయితే ఇది మందులకు ప్రత్యామ్నాయం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

56
బరువు నియంత్రణ
Image Credit : freepik

బరువు నియంత్రణ

కరివేపాకులో ఉండే ఫైబర్ మెటాబాలిజం రేటును పెంచడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో కొవ్వు నిల్వలను తగ్గించడంలో పరోక్షంగా ఉపయోగపడుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం, కరివేపాకు టీ లేదా కరివేపాకు పొడిని వంటల్లో కలిపి తీసుకోవడం ద్వారా బరువు తగ్గే అవకాశం ఉంది. 

66
కంటి, చర్మ ఆరోగ్యం
Image Credit : Getty

కంటి, చర్మ ఆరోగ్యం

కరివేపాకులో విటమిన్ A సమృద్ధిగా ఉండడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అదేవిధంగా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాపాడి, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి. రెగ్యులర్‌గా కరివేపాకు తీసుకునే వారిలో చర్మ సమస్యలు తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు.

నిపుణుల ప్రకారం కరివేపాకు మన ఆరోగ్యానికి మేలు చేసే సహజ ఔషధం. అయితే దీన్ని అధికంగా తీసుకోవడం మంచిది కాదు. రోజూ కొద్ది మోతాదులో తీసుకోవడం, సమతుల ఆహారంతో కలిపి వాడటం మంచిది. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image2
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image3
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Related Stories
Recommended image1
Weight Loss Tips: జిమ్ అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా బరువు తగ్గే 5 టిప్స్ ఇవిగో!
Recommended image2
Gardening Tips: నీటిలో ఈ ఒక్కటి కలిపి చల్లితే చాలు.. వాడిపోయే మొక్కలు కూడా పచ్చగా మారిపోతాయి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved