Telugu

Mangoes: అతిగా మామిడి పండ్లు తింటే లావవుతారా?

Telugu

అసలు నిజం ఏంటంటే...

సమ్మర్లో మాత్రమే దొరికేది మామిడిపండు. అందుకే దొరికిన 2 నెలలు లాగించేస్తారు. కానీ చాలా మందికి చిన్న భయం ఉంటుంది. బరువుతు పెరుగుతామేమో అని. అసలు నిజం ఏంటంటే...

Image credits: Our own
Telugu

మామిడి పండ్లలో ఫ్యాట్ లేదు!

చాలా మంది మామిడి పండ్లలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. కానీ నిజానికి ఇందులో కొలెస్ట్రాల్ లేదా ఫ్యాట్ అస్సలు ఉండవు.

Image credits: stockPhoto
Telugu

క్యాలరీలు ముఖ్యం

ఒక మామిడి పండులో దాదాపు 150 క్యాలరీలు ఉంటాయి. కాబట్టి, మీరు తినే ఆహారంతో పాటు అదనంగా ఎక్కువ మామిడి పండ్లు తింటే బరువు పెరిగే అవకాశం ఉంది.

Image credits: Getty
Telugu

ఎలా తింటే లావవ్వరు?

మీరు బరువు పెరగకూడదు అనుకుంటే, మామిడి పండును భోజనంతో పాటు కాకుండా...ఉదయం లేదా సాయంత్రం ఒక స్నాక్‌లా విడిగా తినండి. అప్పుడు బరువు పెరగరు

Image credits: stockPhoto
Telugu

జ్యూస్‌లు వద్దు.. ముక్కలే తినాలి

జ్యూస్ లేదా మిల్క్‌షేక్ రూపంలో తాగితే ఫైబర్ పోయి, క్యాలరీలు పెరుగుతాయి. అందుకే ముక్కలుగా కోసుకుని తినడమే ఆరోగ్యం. జ్యూస్ లో మళ్లీ షుగర్ కలుపుతారు కాబట్టి.. జ్యూస్ తాగకపోవడమే బెటర్

Image credits: Our own
Telugu

రాత్రి పూట తినొద్దు

రోజుకు ఒకటి తింటే బరువు పెరగరు. పైగా ఇందులో విటమిన్-సి, ఫైబర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంకో విషయం ఏంటంటే..బరువు తగ్గాలనుకునే వారు రాత్రి పూట మామిడి పండ్లు తినకపోవడమే మంచిది.

Image credits: Instagram

Thyroid Cancer: ఇవి తెలుసుకుంటే థైరాయిడ్ క్యాన్సర్‍కు చెక్ పెట్టొచ్చు

Bad Breath: నోటి దుర్వాసన పోగొట్టే వంటింటి పదార్థాలు ఇవిగో!

Apricots: ఇవి తింటే చాలు..చూస్తుండగానే బరువు తగ్గిపోతారు

Tea: రోజూ టీ తాగుతున్నారా? ఈ విషయాలు తెలిస్తే షాకవుతారు!