MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Health
  • Mangoes: మామిడి పండ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుందా? ఎక్కువ తింటే ఏమవుతుంది?

Mangoes: మామిడి పండ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుందా? ఎక్కువ తింటే ఏమవుతుంది?

Mangoes: మామిడి పండ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుందని మన పెద్దలు చెబుతుంటారు? ఇది నిజమేనా? ఎక్కువ తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? వైద్యులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 15 2026, 04:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మామిడి పండ్లు ఇష్టమని లాగించేస్తున్నారా? ఎక్కువ తింటే జరిగేది ఇదే!
Image Credit : Chta GPT

మామిడి పండ్లు ఇష్టమని లాగించేస్తున్నారా? ఎక్కువ తింటే జరిగేది ఇదే!

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మామిడి పండ్ల జాతర వచ్చినట్టే. మామిడి పండు కనిపిస్తే నోరు ఊరాల్సిందే, అస్సలు కంట్రోల్ చేసుకోలేం. అయితే, ప్రతి సమ్మర్ సీజన్‌లోనూ మన ఇంట్లోని పెద్దవాళ్ల నుంచి ఒకే హెచ్చరిక వినిపిస్తూ ఉంటుంది.. అదే "ఎక్కువ మామిడి పండ్లు తినకు, ఒంట్లో వేడి చేస్తుంది!". మరి ఈ మాటల్లో ఎంతవరకు నిజం ఉంది? వైద్యులు ఏం చెబుతున్నారు?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మామిడి పండ్లు నిజంగానే బాడీని హీట్ చేస్తాయా?
Image Credit : Getty

మామిడి పండ్లు నిజంగానే బాడీని హీట్ చేస్తాయా?

మన సాంప్రదాయ ఆహార అలవాట్లలో కొన్ని పదార్థాలను వేడి చేసేవి అని పిలవడం కామనే. కానీ ఆధునిక సైన్స్ దీనిని కొంచెం డిఫరెంట్‌గా చూస్తుంది. "మామిడి పండ్లను సాధారణంగా వేడి చేసే పండుగా చెప్తారు. కానీ సైన్స్ పరంగా చూస్తే, ఒక ఆహారాన్ని అది వేడిదా లేక చల్లనిదా అనేదాని కంటే, దానిలోని కెమికల్ కాంపోజిషన్ బట్టి గుర్తిస్తారని" అని వైద్యులు చెబుతున్నారు.

మామిడి పండ్లలో సహజ చక్కెరలు, మ్యాంగిఫెరిన్ వంటి ప్లాంట్ కాంపౌండ్స్ ఉంటాయి. మనం వీటిని తిన్నప్పుడు జీర్ణక్రియ ప్రక్రియలో భాగంగా శరీరంలో కొద్దిగా వేడి ఉత్పత్తి పెరుగుతుంది. "మామిడి పండ్లు తిన్న వెంటనే శరీరంలో కొంత వేడి పెరిగినట్లు అనిపించినప్పటికీ, జ్వరం వచ్చినప్పుడు పెరిగినట్లుగా అది బాడీ కోర్ టెంపరేచర్ మాత్రం పెంచదు" అని వైద్యులు చెబుతున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే, మామిడి పండ్లు మీ శరీర ఉష్ణోగ్రతను నిజంగా పెంచవు. జీర్ణక్రియ స్పీడప్ అవ్వడం వల్ల వచ్చే లైట్ వార్మ్‌నెస్ మాత్రమే అది. ఇది మనిషిని బట్టి మారుతూ ఉంటుంది.

Related Articles

Related image1
World’s First Vegetarian City: అయోధ్య, వారణాసి కాదు.. గుడ్డు అమ్మినా జైలుకెళ్లే దేశంలోని ఏకైక నగరం ఇదే !
Related image2
Normal Petrol vs Power Petrol: నార్మల్ పెట్రోల్ vs స్పీడ్ vs పవర్ పెట్రోల్ మధ్య ఉన్న తేడాలు ఏంటి? మీ వాహనానికి ఏది బెస్ట్?
35
ఎక్కువ మామిడి పండ్లు తింటే బాడీలో ఏం జరుగుతుంది?
Image Credit : Getty

ఎక్కువ మామిడి పండ్లు తింటే బాడీలో ఏం జరుగుతుంది?

ఒక్క మామిడి పండు తినడానికి, ఒకేసారి కూర్చుని మూడు, నాలుగు పండ్లను లాగించేయడానికి చాలా తేడా ఉంది. మన శరీరం కేవలం ఆ పండుకే కాదు, మనం తినే క్వాంటిటీకి కూడా రియాక్ట్ అవుతుంది. "ఎక్కువ మొత్తంలో మామిడి పండ్లు తినడం వల్ల మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ పండులో ఉండే హై లెవెల్ ఫైబర్, ఫ్రక్టోజ్ వల్ల కడుపు ఉబ్బరం, విరేచనాలు లేదా కడుపు తిప్పడం వంటి సమస్యలు వస్తాయి" అని వైద్యులు చెబుతున్నారు.

45
మామిడి పండ్లను ఎక్కువగా తినడం వల్ల వచ్చే సమస్యలు ఏమిటి?
Image Credit : Getty

మామిడి పండ్లను ఎక్కువగా తినడం వల్ల వచ్చే సమస్యలు ఏమిటి?

  • జీర్ణక్రియ సమస్యలు: ఎక్కువ ఫైబర్, ఫ్రూట్ షుగర్ వల్ల పొట్ట అప్సెట్ అవుతుంది.
  • బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం: మామిడి పండ్లలో సహజంగానే స్వీట్‌నెస్ ఎక్కువ. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది.
  • స్కిన్ రియాక్షన్స్: కొంతమందికి మొటిమలు రావడం లేదా పెదవుల చుట్టూ ఇరిటేషన్ రావడం జరుగుతుంది.
  • బరువు పెరగడం: ఎక్కువ క్వాంటిటీలో తింటే ఇందులో ఉండే క్యాలరీల వల్ల బరువు పెరుగుతారు.
  • దీంతో పాటు చాలామందికి తెలియని మరో విషయం ఉంది. మామిడి పండు తొక్క దగ్గర ఉండే జిగురులో ఉరుషియోల్ వంటి కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి పాయిజన్ ఐవీ అనే మొక్కలో కనిపించే జాతికి చెందినవి. అందుకే కొంతమందికి మామిడి పండు తిన్నప్పుడు పెదవులపై దురద లేదా మంటగా అనిపిస్తుంది.
55
సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మామిడి పండ్లను ఎంజాయ్ చేయడం ఎలా?
Image Credit : Getty

సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మామిడి పండ్లను ఎంజాయ్ చేయడం ఎలా?

సమస్యలు వస్తాయని మామిడి పండ్లను తినడం మానేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం స్మార్ట్‌గా, పద్ధతిగా తినాలి. దాని కోసం.. ఒకేసారి విపరీతంగా తినేయకుండా, రోజుకు ఒక పండు లేదా కప్పు ముక్కలు మాత్రమే తినాలి. దీనిని తిన్నప్పుడు బాడీలో వాటర్ కంటెంట్ బ్యాలెన్స్ చేయడానికి పెరుగు లేదా నానబెట్టిన చియా సీడ్స్ వంటి వాటితో కలిపి తీసుకోవచ్చు. మీకు సెన్సిటివ్ బాడీ ఉంటే, ఖాళీ కడుపుతో మామిడి పండ్లను తినడం మానేయండి. మామిడి పండ్లను తినడానికి కనీసం 30 నిమిషాల ముందు నీళ్లలో నానబెట్టండి. మన పెద్దలు చేసే ఈ పాత పద్ధతి వల్ల పండుపై ఉండే జిగురు తొలగిపోతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం అవగాహన కోసం మాత్రమే. అనారోగ్య సమస్యలు, ఫుడ్ విషయంలో నిపుణుల సూచనలను తీసుకోండి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
World’s First Vegetarian City: అయోధ్య, వారణాసి కాదు.. గుడ్డు అమ్మినా జైలుకెళ్లే దేశంలోని ఏకైక నగరం ఇదే !
Recommended image2
Normal Petrol vs Power Petrol: నార్మల్ పెట్రోల్ vs స్పీడ్ vs పవర్ పెట్రోల్ మధ్య ఉన్న తేడాలు ఏంటి? మీ వాహనానికి ఏది బెస్ట్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved