MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Weight Loss Tips: జిమ్ అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా బరువు తగ్గే 5 టిప్స్ ఇవిగో!

Weight Loss Tips: జిమ్ అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా బరువు తగ్గే 5 టిప్స్ ఇవిగో!

ప్రస్తుతం చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. జిమ్‍కి వెళ్లే టైం లేక, బరువు ఎలా తగ్గాలో తెలియక సతమతమవుతున్నారు. అలాంటి వారికోసమే ఈ సింపుల్ టిప్స్. వీటిని క్రమశిక్షణతో పాటిస్తే ఇంట్లోనే ఉంటూ ఈజీగా బరువు తగ్గవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Mar 26 2026, 06:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఈజీగా బరువు తగ్గించే 5 చిట్కాలు
Image Credit : Getty

ఈజీగా బరువు తగ్గించే 5 చిట్కాలు

ప్రస్తుత లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, కూర్చొని చేసే ఉద్యోగాలు, ఇతర కారణాల వల్ల బరువు పెరగడం సాధారణమైపోయింది. అయితే ప్రతి ఒక్కరికీ జిమ్‌కి వెళ్లే సమయం లేదా అవకాశం ఉండకపోవచ్చు. అలాంటి వారు ఈ చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటే ఇంట్లోనే సులభంగా బరువు తగ్గవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.

26
ఒక గ్లాస్ వాటర్ తాగడం
Image Credit : Getty

ఒక గ్లాస్ వాటర్ తాగడం

బరువు తగ్గాలి అనుకునేవారు లంచ్ లేదా డిన్నర్‌కు ముందు ఒక గ్లాస్ నీరు తాగడం మంచిది. ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. తద్వారా ఎక్కువగా తినకుండా సహాయపడుతుంది. నీరు తాగడం వల్ల మెటాబాలిజం కూడా కొంతవరకు పెరుగుతుంది. చాలామంది ఆకలిగా అనిపించినప్పుడు నిజానికి అది దాహం కావచ్చు. కాబట్టి ముందుగా నీరు తాగడం మంచి అలవాటు.

Related Articles

Related image1
Garikapati Controversy: గరికపాటి గుడ్డు వివాదం.. అసలు పిల్లలకు ఎగ్ ఎందుకు అవసరం?
Related image2
Healthy Night Routine: రాత్రిపూట ఇవి చేస్తే మీ జీవితం మారిపోవడం పక్కా!
36
50 శాతం కూరగాయలు
Image Credit : Getty

50 శాతం కూరగాయలు

తినే ఆహారంలో కనీసం 50 శాతం కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి కానీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. దీనివల్ల మధ్యలో తినాలనే కోరిక తగ్గుతుంది. అలాగే కూరగాయలు శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ అందిస్తాయి. ఇలా డైట్‌లో మార్పు చేస్తే బరువు తగ్గడం సులభమవుతుంది.

46
15 నిమిషాల నడక
Image Credit : Getty

15 నిమిషాల నడక

తిన్న వెంటనే 15 నిమిషాలు నడవడం చాలా మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తిన్న వెంటనే పడుకోవడం లేదా కూర్చోవడం వల్ల ఫుడ్, ఫ్యాట్‌గా నిల్వ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. కానీ చిన్నగా నడవడం వల్ల శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. రోజూ ఈ చిన్న అలవాటు పాటిస్తే బరువు తగ్గడంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి.

56
ఇవి తగ్గించడం మంచిది
Image Credit : Getty

ఇవి తగ్గించడం మంచిది

ఫ్రూట్ జ్యూస్, స్నాక్స్, కాఫీ, టీ లాంటి వాటిని తగ్గించడం కూడా చాలా ముఖ్యం. వీటిలో చాలా వరకు అదనపు షుగర్, కేలరీలు ఉంటాయి. ముఖ్యంగా ప్యాకేజ్డ్ జ్యూస్‌లు, స్నాక్స్ తీసుకోవడం వల్ల తెలియకుండానే ఎక్కువ కేలరీలు శరీరంలోకి వెళ్తాయి. కాఫీ, టీ ఎక్కువగా తాగితే కూడా షుగర్, కేలరీలు పెరుగుతాయి. వీటికి బదులు నీరు లేదా సహజమైన ఆహారాలు తీసుకోవడం మంచిది.

66
స్క్రీన్ చూస్తూ తినొద్దు
Image Credit : our own

స్క్రీన్ చూస్తూ తినొద్దు

టీవీ లేదా ఫోన్ చూస్తూ తినడం మంచిది కాదు. మనం స్క్రీన్ చూస్తూ తింటే ఎంత తిన్నామో తెలియదు. దీని వల్ల ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. దీన్ని మైండ్‌లెస్ ఈటింగ్ అంటారు. కాబట్టి తినేటప్పుడు పూర్తిగా ఆహారంపైనే దృష్టి పెట్టాలి. నెమ్మదిగా నమిలి తినడం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది. ఈ చిన్న మార్పు బరువు తగ్గడంలో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఈ సింపుల్ టిప్స్ ని క్రమం తప్పకుండా పాటిస్తే జిమ్‌కు వెళ్లకపోయినా ఈజీగా బరువు తగ్గొచ్చు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Headache: అగ్గిపుల్లతో తలనొప్పి మాయం, అదెలానో తెలుసా?
Recommended image2
Papaya Benefits: బొప్పాయితో బోలెడు లాభాలు.. తెలిస్తే వదలిపెట్టరు
Recommended image3
Garikapati Controversy: గరికపాటి గుడ్డు వివాదం.. అసలు పిల్లలకు ఎగ్ ఎందుకు అవసరం?
Related Stories
Recommended image1
Garikapati Controversy: గరికపాటి గుడ్డు వివాదం.. అసలు పిల్లలకు ఎగ్ ఎందుకు అవసరం?
Recommended image2
Healthy Night Routine: రాత్రిపూట ఇవి చేస్తే మీ జీవితం మారిపోవడం పక్కా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved