MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Health
  • Chia Seeds: 11 రోజులపాటు ఖాళీ కడుపుతో చియా సీడ్స్ వాటర్ తాగితే కలిగే 5 లాభాలు ఇవే!

Chia Seeds: 11 రోజులపాటు ఖాళీ కడుపుతో చియా సీడ్స్ వాటర్ తాగితే కలిగే 5 లాభాలు ఇవే!

ఆరోగ్యానికి మేలు చేసే సూపర్ ఫుడ్స్ లో చియా సీడ్స్ ముందు వరుసలో ఉంటాయి. ఇవి చూడటానికి చిన్నగా ఉన్నా, వీటి ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం శక్తిమంతమైనవి. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో చియాసీడ్స్ వాటర్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన లాభాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Kavitha G
Published : Feb 14 2026, 05:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Chia Seeds Benefits
Image Credit : our own

Chia Seeds Benefits

11 రోజులపాటు ఖాళీ కడుపుతో చియా సీడ్స్ వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చియా సీడ్స్ లో ఫైబర్, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. నిపుణుల ప్రకారం ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ చియా సీడ్స్ వాటర్ తాగితే శరీరానికి వేగంగా శక్తి అందడమే కాకుండా, జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
మలబద్ధకం దూరం
Image Credit : Getty

మలబద్ధకం దూరం

చియా సీడ్స్‌లో ఉండే అధిక ఫైబర్ కడుపులో జెల్‌లా మారి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఇది మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. 11 రోజులపాటు క్రమం తప్పకుండా చియాసీడ్స్ వాటర్ తీసుకుంటే పేగుల పనితీరు క్రమబద్ధమవుతుందని నిపుణులు చెబుతున్నారు. గట్ హెల్త్ మెరుగుపడితే శరీరంలోని పోషకాలు సరిగ్గా శోషించబడతాయి, తద్వారా అలసట తగ్గి శక్తి పెరుగుతుంది.

Related Articles

Related image1
Cumin Water: 11 రోజులపాటు ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే కలిగే 5 లాభాలు ఇవే!
Related image2
Pumpkin Seeds: 11 రోజులు క్రమం తప్పకుండా గుమ్మడి గింజలు తింటే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!
37
బరువు తగ్గడానికి..
Image Credit : Getty

బరువు తగ్గడానికి..

చియా సీడ్స్‌లో ఉండే ఫైబర్ ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఈ వాటర్ తాగితే రోజంతా ఆకలి నియంత్రణలో ఉంటుంది. చియా సీడ్స్ వాటర్‌ను సమతుల ఆహారం, వ్యాయామంతో కలిపి తీసుకుంటే బరువు తగ్గడం ఈజీ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

47
గుండెకు మేలు
Image Credit : stockPhoto

గుండెకు మేలు

చియా సీడ్స్‌లో సమృద్ధిగా ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గుండెకు మేలు చేస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. 11 రోజులపాటు చియా సీడ్స్ వాటర్ తీసుకోవడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అయితే ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే వీటిని తీసుకోవడం మంచిది.

57
షుగర్ లెవెల్స్
Image Credit : Pinterest

షుగర్ లెవెల్స్

చియా సీడ్స్‌లోని ఫైబర్ కార్బోహైడ్రేట్ల శోషణ వేగాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల భోజనం తర్వాత రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగదు. డయాబెటిస్ ప్రారంభ దశలో ఉన్నవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే మందులు వాడేవారు మాత్రం డాక్టర్ సలహా లేకుండా వీటిని తీసకోకూడదని సూచిస్తున్నారు.

67
చర్మ కాంతికి..
Image Credit : Getty

చర్మ కాంతికి..

చియా సీడ్స్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దీనివల్ల చర్మం తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది. అలాగే ప్రోటీన్, ఖనిజాలు శరీరానికి స్థిరమైన శక్తిని అందిస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది.

77
మోతాదు ముఖ్యం..
Image Credit : others

మోతాదు ముఖ్యం..

నిపుణుల ప్రకారం చియా సీడ్స్‌ను ఎప్పుడూ నానబెట్టి మాత్రమే తీసుకోవాలి. పొడి గింజలను నేరుగా మింగడం ప్రమాదకరం. రోజుకు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు మించిన మోతాదు తీసుకోకూడదు. థైరాయిడ్, అలెర్జీ లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ముందుగా డాక్టర్ సలహా తీసుకోవాలి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Related Stories
Recommended image1
Cumin Water: 11 రోజులపాటు ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే కలిగే 5 లాభాలు ఇవే!
Recommended image2
Pumpkin Seeds: 11 రోజులు క్రమం తప్పకుండా గుమ్మడి గింజలు తింటే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved