MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Pumpkin Seeds: 11 రోజులు క్రమం తప్పకుండా గుమ్మడి గింజలు తింటే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!

Pumpkin Seeds: 11 రోజులు క్రమం తప్పకుండా గుమ్మడి గింజలు తింటే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!

సహజ ఆహార పదార్థాలు ఆరోగ్యానికి ఎంతమేలు చేస్తాయో మనకు తెలుసు. అలా ఆరోగ్యానికి మేలు చేసే శక్తివంతమైన ఆహారాల్లో గుమ్మడి గింజలు ఒకటి. 11 రోజులపాటు క్రమం తప్పకుండా గుమ్మడి గింజలు తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతమైన మార్పుల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Kavitha G
Published : Feb 07 2026, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Pumpkin Seeds Health Benefits
Image Credit : Google Gemini\ storyblocks

Pumpkin Seeds Health Benefits

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో చాలామంది సహజ పదార్థాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఫుడ్స్ నే ఎంచుకుంటున్నారు. వాటిలో ముఖ్యమైనవి గుమ్మడి గింజలు. చూడ్డానికి చిన్నగా కనిపించినా పోషక విలువల పరంగా ఇవి చాలా శక్తివంతమైనవని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా 11 రోజుల పాటు గుమ్మడి గింజలను తీసుకుంటే శరీరంలో కొన్ని స్పష్టమైన, సానుకూల మార్పులు కనిపిస్తాయని చెబుతున్నారు. అవేంటో వివరంగా చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ప్రధాన మార్పు ఇదే..
Image Credit : stockPhoto

ప్రధాన మార్పు ఇదే..

గుమ్మడి గింజలు తినడం వల్ల శరీరంలో కనిపించే ప్రధాన మార్పు రోగనిరోధక శక్తి పెరగడం. ఈ గింజల్లో జింక్, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. పోషకాహార నిపుణుల ప్రకారం జింక్ శరీరంలోని రోగనిరోధక కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. 11 రోజులపాటు గుమ్మడి గింజలు తీసుకుంటే జలుబు, దగ్గు వంటివి తగ్గడంతో పాటు, అలసట, నీరసం వంటి సమస్యలు దూరమవుతాయి.

37
జీర్ణక్రియపై సానుకూల ప్రభావం
Image Credit : Getty

జీర్ణక్రియపై సానుకూల ప్రభావం

గుమ్మడి గింజల్లో ఫైబర్ మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. గ్యాస్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు క్రమంగా తగ్గుతాయి. 11 రోజులు వరుసగా తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడి, శరీరం పోషకాలను బాగా గ్రహించే స్థితికి చేరుతుందని నిపుణులు చెబుతున్నారు.

47
గుండె పనితీరుకు..
Image Credit : Getty

గుండె పనితీరుకు..

గుమ్మడి గింజల్లో ఉండే మెగ్నీషియం, మంచి కొవ్వులు గుండె పనితీరుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి. 11 రోజుల పాటు గుమ్మడి గింజలు తీసుకుంటే రక్తప్రసరణ మెరుగుపడటం, రక్తపోటు స్వల్పంగా నియంత్రణలోకి రావడం వంటి మార్పులు గమనించవచ్చు. 

57
మెరుగైన నిద్రకు..
Image Credit : stockPhoto

మెరుగైన నిద్రకు..

గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. సెరటోనిన్ మన మనసును ప్రశాంతంగా ఉంచడంలో, నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నిపుణుల ప్రకారం, రోజూ గుమ్మడి గింజలు తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి, రాత్రి నిద్ర బాగా పడుతుంది. 11 రోజులలోనే నిద్ర నాణ్యత పెరగడం, ఉదయం తాజాగా లేవడం గమనించవచ్చు.

67
చర్మం, జుట్టు ఆరోగ్యానికి..
Image Credit : Getty

చర్మం, జుట్టు ఆరోగ్యానికి..

గుమ్మడి గింజల్లో విటమిన్ E, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని లోపలి నుంచి కాంతివంతంగా మారుస్తాయి. అంతేకాదు ఇవి ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి ముడతలు త్వరగా రాకుండా చేస్తాయి. అలాగే జుట్టు రాలే సమస్య తగ్గి, జుట్టు బలంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

77
ఎంత మోతాదులో తీసుకోవాలి?
Image Credit : Getty

ఎంత మోతాదులో తీసుకోవాలి?

గుమ్మడి గింజలను తీసుకునేటప్పుడు మోతాదు చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజూ సుమారు 20–30 గ్రాముల వరకు తీసుకోవచ్చని చెబుతున్నారు. నిపుణుల ప్రకారం ఈ గింజలను ముడిగా లేదా తేలికగా వేయించి తీసుకోవచ్చు. ఉప్పు ఎక్కువగా కలపకుండా తినడం మంచిది. గర్భిణీలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
Cumin Water: 11 రోజులపాటు ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే కలిగే 5 లాభాలు ఇవే!
Recommended image2
Fenugreek Water: 11 రోజులపాటు మెంతుల నీళ్లు తాగితే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved