MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Testosterone: యువకుల్లోనే టెస్టోస్టెరాన్ సమస్య..ఎందుకంటే?

Testosterone: యువకుల్లోనే టెస్టోస్టెరాన్ సమస్య..ఎందుకంటే?

ప్రపంచవ్యాప్తంగా పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతున్నాయి. యువకుల్లోనే అలసట, లిబిడో , మజిల్స్ బలం తగ్గడం వంటి లక్షణాలు పెరుగుతున్నాయి. ఒత్తిడి, నిద్రలేమి, జంక్ ప్రధాన కారణాలు. జీవనశైలి మార్పులు, వైద్యుల సలహాతో చికిత్స ముఖ్యమంటున్నారు. 

2 Min read
Author : Nandini Arava
Published : Feb 24 2026, 11:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
యువకుల్లోనే తగ్గుతున్న టెస్టోస్టెరాన్ స్థాయిలు
Image Credit : Getty

యువకుల్లోనే తగ్గుతున్న టెస్టోస్టెరాన్ స్థాయిలు

గతంలో పురుషుల హార్మోన్ల ఆరోగ్యం గురించి చర్చ పెద్దగా జరిగేది కాదు. ముఖ్యంగా టెస్టోస్టెరాన్ గురించి మాట్లాడటం చాలా అరుదు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా పురుషులలో సగటు టెస్టోస్టెరాన్ స్థాయిలు క్రమంగా తగ్గుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది కేవలం వృద్ధాప్యానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఒకప్పుడు మధ్య వయస్సు పురుషులలో కనిపించే లక్షణాలే ఇప్పుడు 20, 30 ఏళ్ల యువకులే అనుభవిస్తున్నారు.

24
అన్నింటికీ ఆధునిక జీవనశైలే కారణం
Image Credit : our own

అన్నింటికీ ఆధునిక జీవనశైలే కారణం

పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్‌ పాత్ర చాలా విస్తృతం. ఇది మజిల్స్ పెరుగుదల, ఎముకల బలం, శక్తి స్థాయిలు, మానసిక స్థితి, లిబిడో, స్పెర్మ్ ఉత్పత్తి వంటి అనేక శరీర క్రియల్లో కీలక పాత్ర పోషిస్తుంది. మెదడులోని హైపోథాలమస్, పిట్యూటరీ గ్రంథుల సంకేతాల ఆధారంగా వృషణాల్లో టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవుతుంది. యుక్తవయస్సులో ఇది గరిష్ట స్థాయికి చేరి, 30 ఏళ్ల తర్వాత సంవత్సరానికి సుమారు 1 శాతం చొప్పున తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇటీవలి అధ్యయనాలు ఈ తగ్గుదల యువకుల్లోనే ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఆధునిక జీవనశైలి ఈ మార్పుకు ఒక ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఎక్కువ పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, పోటీ ప్రపంచం...ఇవన్నీ కార్టిసాల్ హార్మోన్‌ను పెంచుతాయి. అధిక కార్టిసాల్ టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని అణచివేస్తుంది. అలాగే నిద్రలేమి కూడా ఒక ముఖ్య కారణం. గాఢ నిద్ర సమయంలోనే టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. రోజుకు 5–6 గంటల కంటే తక్కువ నిద్రపోయే పురుషుల్లో హార్మోన్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

Related Articles

Related image1
Men Psychology: మగవాళ్లు నిజంగా దేన్ని ఇష్టపడతారు? సైకాలజీ ఏం చెబుతోంది?
Related image2
Men sexual Health: మ‌గ‌వారు మున‌గాకు పౌడ‌ర్ తింటే ఏమ‌వుతుందో తెలుసా.? ముఖ్యంగా పెళ్లైన కొత్త‌లో
34
ఇవన్నీ ఉంటే వైద్యులను కలవాలి
Image Credit : Getty

ఇవన్నీ ఉంటే వైద్యులను కలవాలి

అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్, అధిక చక్కెర, కొవ్వు కూడా సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. శరీరంలో అధిక కొవ్వు ఉండటం వల్ల టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజెన్‌గా మారే ప్రక్రియ వేగవంతమవుతుంది. పైగా ప్లాస్టిక్‌లు, కాలుష్యం, పురుగుమందులు వంటి హార్మోన్-డిస్రప్టింగ్ కెమికల్స్ కూడా ప్రభావం చూపుతాయి.

టెస్టోస్టెరాన్ లక్షణాలు ఒక్కసారిగా కనిపించవు. ఉదయం అంగస్తంభన తగ్గడం, నిరంతర అలసట, లిబిడో తగ్గడం, మజిల్స్ బలం తగ్గడం, పొత్తికడుపులో కొవ్వు పెరగడం, చిరాకు ఇవన్నీ ఉంటే వైద్యులను కలవాలని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. చాలామంది పురుషులు ఈ లక్షణాలు ఉన్నా పెద్దగా పట్టించుకోరు.

44
సిగ్గుపడాల్సిన పనిలేదు
Image Credit : our own

సిగ్గుపడాల్సిన పనిలేదు

అయితే జీవనశైలి మార్పులతో టెస్టోస్టెరాన్ స్థాయిలను సహజంగానే మెరుగుపరచవచ్చు. వారానికి మూడు సార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, 7–8 గంటల నాణ్యమైన నిద్ర, బరువు నియంత్రణ, విటమిన్-D పొందడం, ఆల్కహాల్, జంక్ ఫుడ్ తగ్గించడం ఉపయోగకరం. అవసరమైతే వైద్యుల పర్యవేక్షణలో టెస్టోస్టెరాన్ థెరపీ ఇవ్వవచ్చని చెబుతున్నారు. అయితే సొంత వైద్యం పేరుతో మాత్రలు వాడటం ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు.

పురుషుల హార్మోన్ల ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే సమస్యను మరింత పెంచుతుందని సూచిస్తున్నారు. అలసట, మానసిక మార్పుల గురించి సిగ్గుపడాల్సిన పని లేదని వైద్యులు సూచిస్తున్నారు. సమయానికి పరీక్షలు చేయించుకుని, నిపుణులను సంప్రదించడం ద్వారా దీర్ఘకాలిక సమస్యలను నివారించవచ్చు. ఆరోగ్యంపై అవగాహన పెరగాల్సిన సమయం ఇది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో ఛానెల్లో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Fatty Liver: సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఫ్యాటీ లివర్ ముప్పు..కారణమిదే..
Recommended image2
Vitamin B12: వెజిటేరియన్స్ ఈ 5 ఫుడ్స్ తో B12 లోపానికి చెక్ పెట్టొచ్చు
Recommended image3
Dates Benefits: రోజుకు రెండు ఖర్జూరాలు తింటే కలిగే 7 లాభాలు ఇవే!
Related Stories
Recommended image1
Men Psychology: మగవాళ్లు నిజంగా దేన్ని ఇష్టపడతారు? సైకాలజీ ఏం చెబుతోంది?
Recommended image2
Men sexual Health: మ‌గ‌వారు మున‌గాకు పౌడ‌ర్ తింటే ఏమ‌వుతుందో తెలుసా.? ముఖ్యంగా పెళ్లైన కొత్త‌లో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved