MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • Fatty Liver: సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఫ్యాటీ లివర్ ముప్పు..కారణమిదే..

Fatty Liver: సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఫ్యాటీ లివర్ ముప్పు..కారణమిదే..

Fatty Liver: కార్పొరేట్ ఉద్యోగుల్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరుగుతున్నాయి. ఎక్కువసేపు కూర్చోవడం, జంక్, నిద్రలేమి కారణాలు. మొదట్లో లక్షణాలు కనిపించకపోయినా, గుండె జబ్బులకు దారితీస్తుంది. జీవనశైలి మార్పులు ప్రమాదాన్ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

2 Min read
Author : Nandini Arava
Published : Feb 24 2026, 09:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఫ్యాటీ లివర్ ముప్పు
Image Credit : Getty

సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఫ్యాటీ లివర్ ముప్పు

ఇటీవలి కాలంలో కార్పొరేట్ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల మధ్య ఫ్యాటీ లివర్‌ సమస్య మెల్లగా పెరుగుతోంది. 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల, ఆల్కహాల్ తాగని ఉద్యోగులకే ఫ్యాటీ లివర్ నిర్ధారణ అవుతున్న కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు వృద్ధులు లేదా ఆల్కహాల్ సేవించే వారికి మాత్రమే వచ్చే ఈ సమస్య, ఇప్పుడు డెస్క్ ముందు గంటల తరబడి కూర్చొనే ఉద్యోగుల జీవితంలో భాగమవుతోంది.

ముందు దీన్ని నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్-N.A.F.L.D అని పిలిచేవారు. ప్రస్తుతం దీనిని మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్-M.A.S.L.Dగా పిలుస్తున్నారు. పేరులో మార్పు వచ్చినా, కారణం మాత్రం జీవనశైలిలోని లోపాలే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఫ్యాటీ లివర్‌ సమస్య ఎందుకు పెరుగుతోంది?
Image Credit : Getty

ఫ్యాటీ లివర్‌ సమస్య ఎందుకు పెరుగుతోంది?

ఆఫీసు వర్క్ కల్చర్ ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ప్రతిరోజూ 7 నుంచి 9 గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు కూర్చోవడం జీవక్రియను మందగిస్తుంది. దీంతో శరీరంలో కొవ్వు పెరిగి, కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. అదే సమయంలో ఉదయం టిఫిన్ మానేయడం, మధ్యాహ్నం జంక్ ఫుడ్ తీసుకోవడం, నిద్రలేమి, ఇవి అన్నీ కలిపి Insulin Resistanceను పెంచి కాలేయానికి నష్టం కలిగిస్తాయి.

అధ్యయనాలు ఏమి చెబుతున్నాయింటే....ఐటీ ఉద్యోగుల్లో చాలా మందికి కాలేయంలో కొవ్వు అధికంగా ఉన్నట్లు తేలింది. వారిలో చాలా మందికి ఊబకాయం, అధిక LDL కొలెస్ట్రాల్, నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఉన్నాయని వెల్లడైంది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరికి NAFLD ప్రభావం చూపుతోంది. జీవనశైలి మారుతున్న కొద్దీ ఈ సంఖ్య కూడా పెరుగుతోంది.

34
పరిస్థితి ముదిరితే కాలేయ మంట, ఫైబ్రోసిస్ వరకు దారితీసే ప్రమాదం
Image Credit : Getty

పరిస్థితి ముదిరితే కాలేయ మంట, ఫైబ్రోసిస్ వరకు దారితీసే ప్రమాదం

ఫ్యాటీ లివర్‌ను కేవలం కాలేయ సమస్యగా చూడడం పొరపాటని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇన్సులిన్ తగ్గించడం, ఊబకాయం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి గుండె జబ్బులకు దారితీస్తుంది. ఫ్యాటీ లివర్ ఉన్న రోగుల్లో మరణాలకు ప్రధాన కారణం గుండె సంబంధిత వ్యాధులేనని ఆయన స్పష్టం చేశారు.

ఫ్యాటీ లివర్‌ను silent diseasగా పిలుస్తారు. ప్రారంభంలో లక్షణాలు కనిపించవు. కొద్దిగా అలసట, భోజనం తర్వాత బరువుగా అనిపించడం, అసౌకర్యం వంటి లక్షణాలు ఉన్నా....పట్టించుకోరు. కానీ పరిస్థితి ముదిరితే కాలేయ మంట, ఫైబ్రోసిస్ వరకు దారితీసే ప్రమాదం ఉంది.

కాలేయంలో కొవ్వు పెరగడం అంటే శరీర జీవక్రియ వ్యవస్థ దెబ్బతిన్నట్టే. దీని వల్ల టైప్-2 డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె సంబంధ వ్యాధులు, దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యల ప్రమాదం పెరుగుతుంది.

44
మరి దీనికి పరిష్కారం ఏమిటి?
Image Credit : Getty

మరి దీనికి పరిష్కారం ఏమిటి?

జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఈ పరిస్థితిని నియంత్రించడం సాధ్యమే. ప్రతి గంటకోసారి లేచి 5 నిమిషాలు నడవడం, లిఫ్ట్ బదులు మెట్లు ఎక్కడం, కూల్ డ్రింక్స్ తగ్గించడం, ప్రోటీన్, తృణధాన్యాలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం, టైంకు నిద్రపోవడం, సంవత్సరానికి ఒకసారి రక్తపరీక్షలు, కాలేయ పనితీరు పరీక్ష చేయించుకోవాలి.

ఆఫీసుల్లో కూడా హెల్తీ వాతావరణాన్ని ప్రోత్సహిస్తే పరిస్థితి మారుతుంది. ఫ్లెక్సిబుల్ అవర్స్, ఆన్‌సైట్ ఫిట్‌నెస్ సదుపాయాలు చేస్తే ఇంకా బెటర్. రోజువారీ అలవాట్లలో చిన్న మార్పులు పెద్ద ఆరోగ్య సమస్యలను నివారిస్తాయి. ఫ్యాటీ లివర్ అనేది వృద్ధుల సమస్యే కాదు... సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో ముదురుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆరోగ్యం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image2
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image3
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Related Stories
Recommended image1
Fatty Liver: ఈ లక్షణాలు ఉన్నాయా? నిర్లక్ష్యం చేస్తే కాలేయానికి నష్టమే
Recommended image2
Fatty Liver: కొంచెం తిన్నా కడుపు ఉబ్బుతోందా.? ఫ్యాటీ లివ‌ర్ కావొచ్చు, అల‌ర్ట్ అవ్వండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved