MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • జిమ్‌కి వెళ్లేవాళ్ల సీక్రెట్ 3-3-3 రూల్! అందుకే వాళ్లు అంత స్ట్రాంగ్ గా ఉంటారు

జిమ్‌కి వెళ్లేవాళ్ల సీక్రెట్ 3-3-3 రూల్! అందుకే వాళ్లు అంత స్ట్రాంగ్ గా ఉంటారు

Gym Workout Guide: కండలు తిరిగే శరీరాన్ని సంపాదించాలంటే జిమ్ కి వెళ్లి కష్టపడాలి. అయితే జిమ్ కి వెళ్లే వాళ్ల రహస్యం తెలిస్తే అలాంటి స్ట్రాంగ్ బాడీని మీరు ఇంట్లోనే సంపాదించొచ్చు. జిమ్ కి వెళ్లే వాళ్లు ఓ ప్రత్యేకమైన రూల్ ని ఫాలో అవుతారు. అదే 3-3-3 రూల్. దీని గురించి తెలిస్తే మీరు ఇంట్లోనే ఎక్సర్‌సైజ్ చేస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చు. 3-3-3 రూల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా? 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 23 2025, 08:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

చాలా మంది జిమ్ చేస్తే కండలు తిరిగే శరీరాన్ని సంపాదించొచ్చని అనుకుంటారు. కాని కేవలం ఎక్సర్ సైజ్ చేస్తే సరిపోదు. కసరత్తులకు తగ్గ ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే జిమ్ లో ఎలా పడితే అలా ఎక్సర్ సైజ్ చేసినా మీరు బలాన్ని పొందలేరు. దీనికి ప్రత్యేక నియమాలు ఉంటాయి. జిమ్ చేసే వారు కచ్చితంగా ఫాలో అయ్యే రూల్ ఏంటంటే.. అదే 3-3-3 రూల్. ఈ రూల్ గురించి వివరంగా తెలుసుకుందామా?

 

24

3-3-3 రూల్ జిమ్ వర్కౌట్

3-3-3 వర్కౌట్ అంటే ప్రతి రోజు 3 వ్యాయామాలను 3 సార్లు చేయడం, 3 రౌండ్లు చేయడం. ఉదాహరణకు ఉదాహరణకు కింది శరీరాన్ని మెరుగుపరిచే స్క్వాట్ వ్యాయామాలు, పై శరీరాన్ని మెరుగుపరిచే పుష్-అప్‌లు, మధ్య కండరాలను బలోపేతం చేసే ప్లాంక్స్ వంటివి వరుసగా మొత్తం 3 రౌండ్లు (3 సెట్లు) చేయాలి. ఇలాగే వేర్వేరు కండరాల కోసం 3 వ్యాయామాలను ప్లాన్ చేసుకుని చేయవచ్చు.

ఇది కూడా చదవండి మనసులో బాధ ఉన్నా నవ్వుతూ మాట్లాడుతున్నారా? ఇది ఎంత పెద్ద సమస్యో తెలుసా?

34

పురుషులు, స్త్రీలకు కూడా మంచిదే

ఈ 3-3-3 రూల్ కేవలం పురుషులకే కాదు. స్త్రీలకు కూడా మంచిదే. ప్రతి సెట్‌కి శరీరంలోని వేర్వేరు కండరాలు స్ట్రాంగ్ అవుతాయి. 3 వ్యాయామాలను ఒక్కోటి 3 సార్లు చేయాలి. రెగ్యులర్ గా 3-3-3 రూల్ పాటిస్తూ మీ శరీరంలో ఒక్కో భాగాన్ని స్ట్రాంగ్ చేసుకోవచ్చు. అంటే సోమవారం ఛెస్ట్ (ఛాతీ) భాగాన్ని బలోపేతం చేసే వ్యాయామాలు ఎక్కువ చేయాలి. మంగళవారం శరీరంలోని మధ్య కండరాలను స్ట్రాంగ్ చేసే వ్యాయామాలు ఎక్కువ చేయాలి. బుధవారం కాళ్లు, చేతులను స్ట్రాంగ్ చేసేలా ఎక్కువ కసరత్తులు చేయాలి. ఇలా 3-3-3 రూల్ ఫాలో అవుతూనే రోజుకో భాగానికి చెందిన ఎక్సర్‌సైజ్ లు ఎక్కువగా చేయాలి. 

44

శరీరం మొత్తానికి బలం

ఈ 3-3-3 రూల్‌ ను మీరు ఇంట్లో కూడా ఫాలో అవ్వచ్చు. మీ శరీరాన్ని మూడు భాగాలుగా కేటగిరీ చేసుకొని రోజుకో భాగాన్ని బలోపేతం చేసేలా ఎక్సర్ సైజ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ శరీరం బలంగా తయారవుతుంది. అంతేకాకుండా మీ శరీరంలోని అన్ని భాగాలు సమాన బలాన్ని పొందుతాయి. దీంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

ఇది కూడా చదవండి:  ఈ లక్షణాలు ఉంటే మీకు విటమిన్ కె లోపం ఉన్నట్టే

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
జీవనశైలి
ఆరోగ్యం
ఆహారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Walking: 20 రోజులపాటు రోజుకు 10 నిమిషాలు వాకింగ్ చేస్తే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!
Recommended image2
Orange Benefits: రోజుకో ఆరెంజ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Cumin Water: పరగడుపున కాదు.. రాత్రి పడుకునే ముందు జీలకర్ర నీరు తాగితే కలిగే 5 లాభాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved